హర్దేకర్ మంజప్ప

భారతీయ స్వాతంత్ర సమరయోధుడు

హర్దేకర్ మంజప్ప (1886-1947) కర్ణాటక రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత, పాత్రికేయుడు.[1]

ప్రారంభ జీవితం, విద్య మార్చు

మంజప్ప ఉత్తర కర్ణాటకలోని బనవాసి అనే ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతను సమీపంలోని సిరిసి పట్టణంలో చదువుకున్నాడు. ప్రాథమిక విద్యను 1903లో పూర్తి చేశాడు. నెలకు ఏడు రూపాయల జీతంతో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.[2]

ఉద్యమంలో మార్చు

మంజప్ప, అతని సోదరుడితో కలిసి స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను సెయింట్-రిఫార్మిసిస్ట్ బసవ మాటలకు ఆకర్షితుడయ్యాడు. మంజప్ప అనేక పుస్తకాలను వ్రాసాడు. 1913 లో, అతను బసవ జయంతిని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించాడు.[3]

1927 లో ఆల్మట్టిలో మంజప్ప ఒక ఆశ్రమ పాఠశాలను ప్రారంభించాడు. గాంధీజీ నిర్మాణాత్మక పనుల గురించి అవగాహన కల్పించడానికి ఉత్తర కర్ణాటకలోని గ్రామాల్లో పర్యటించాడు. బసవన్న, గాంధీ బోధనల మధ్య అనేక సారూప్యతలను అతను గ్రహించాడు. ఈ ఉపదేశాలను బహిరంగ ప్రసంగాలలో సులభంగా అర్థమయ్యే భాషలో వ్యక్తీకరించడంలో మంజప్ప ప్రయత్నం చేశాడు.

ఇతర విషయాలు మార్చు

  • మంజప్ప సత్యాగ్రహం, దేశభక్తి, జాతీయత వంటి అంశాలపై వెయ్యికి పైగా ఉపన్యాసాలు ఇచ్చాడు.
  • 1924లో తన బృందం 'బసవేశ్వర సేవా దళ' సహాయంతో బెల్గాంలో కాంగ్రెస్ పార్టీ సెషన్ నిర్వహించాడు.
  • మంజప్ప బసవన్నపై ఒక పుస్తకాన్ని రాసి గాంధీకి అందించాడు.
  • మంజప్ప "గాంధీ ఆఫ్ కర్ణాటక"గా ప్రసిద్ధి చెందాడు.
  • మంజప్ప తన ఆత్మకథతో సహా 40 కి పైగా పుస్తకాలు రాశాడు.[4]

మరణం మార్చు

మంజప్ప 3 జనవరి 1947 న మరణించాడు.

మూలాలు మార్చు

  1. Amaresh Datta, ed. (1988). Encyclopaedia of Indian Literature. Vol. 2. Sahitya Akademi. p. 1542. ISBN 9788126011940.
  2. [1]
  3. "Kamat's Potpourri: Amma's Column - Gandhi of Karnataka - Hardekar Manjappa". Kamat.com. Retrieved 2016-09-29.
  4. Special correspondent (January 1, 2008). "Seminar on Hardekar Manjappa's life". The Hindu. Retrieved 2016-09-29.