హలో జూన్
హలో జూన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. 2019లో మలయాళంలో విడుదలైన ‘జూన్’ సినిమాను మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో యాంట్స్ టు ఎలిఫెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ బ్యానర్‌పై అనిల్ రెడ్డి తెలుగులో ‘హలో జూన్’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. రజిషా విజయన్, జోజు జార్జ్, అశ్వతీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించగా ఏప్రిల్ 1న ఆహా ఓటీటీలో విడుదలైంది.[1]
హలో జూన్ | |
---|---|
దర్శకత్వం | అహ్మద్ కబీర్ |
రచన | లిబిన్ వర్గీస్ అహ్మద్ కబీర్ జీవన్ బేబీ |
నిర్మాత | అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్. వి |
తారాగణం | రజిషా విజయన్ సర్జానో ఖలీద్ అర్జున్ అశోకన్ జోజు జార్జ్ అశ్వతీ మీనన్ సన్నీ వేన్ |
ఛాయాగ్రహణం | జితిన్ స్టానిస్లాస్ |
కూర్పు | లిజో పాల్ |
సంగీతం | ఇఫ్తి |
నిర్మాణ సంస్థ | యాంట్స్ టు ఎలిఫెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 1 ఏప్రిల్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుజూన్ (రజిషా విజయన్) ఇంటర్మీడియట్ చేయడానికి కాలేజీలో చేరుతుంది, అదే కాలేజీలో తన క్లాస్ లో ఉన్న అబ్బాయిని చూసి ప్రేమలో పడుతుంది. ఆ తరువాత ఆమె తన ప్రేమని ఆ అబ్బాయికి ఎలా వ్యక్త పరిచింది, కాలేజ్ కు వెళ్లిన దగ్గర నుండి ఆమెకు 26 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె తన తల్లితండ్రుల నుండి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- రజిషా విజయన్
- సర్జానో ఖలీద్
- అర్జున్ అశోకన్
- జోజు జార్జ్
- అశ్వతీ మీనన్
- సన్నీ వేన్
- అజు వర్గీస్
- జాలీ చిరయత్
- శృతి జయన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో
- నిర్మాత: అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి
- కథ: లిబిన్ వర్గీస్, అహ్మద్ కబీర్, లిబిన్ బేబి మాత్యు
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అహ్మద్ కబీర్
- సంగీతం: ఇఫ్తీ
- సినిమాటోగ్రఫీ: జితిన్ స్టానిష్ లస్
- ఎడిటర్ : లిజో పౌల్
- మాటలు : అనిల్ రెడ్డి.ఎం
- పాటలు: శ్రీ సిరాగ్[2]
మూలాలు
మార్చు- ↑ Sakshi (31 March 2022). "ఆహాలో 'హలో జూన్' మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
- ↑ Eenadu (21 May 2022). "వెతలు దాటి పాటల యాత్ర". EENADU. Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.