హలో వరల్డ్
హలో వరల్డ్ 2022లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. జీ5' ఒరిజినల్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నీహారిక కొణిదెల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు శివ సాయివర్ధన్ జలదంకి దర్శకత్వం వహించాడు. ఆర్యన్ రాజేష్, సదా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 12న జీ5 ఓటీటీలో విడుదలైంది.[1]
హలో వరల్డ్ | |
---|---|
దర్శకత్వం | శివ సాయివర్ధన్ జలదంకి |
రచన | శివ సాయివర్ధన్ జలదంకి |
నిర్మాత | |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎదురొలు రాజు |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | పీకే దండి |
నిర్మాణ సంస్థ | పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 12 ఆగస్టు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుపీపుల్ టెక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. అందులో ఐటీ కంపెనీలోకి అడుగుపెట్టిన ఎనిమిది మంది యువకులు జీవితంలో తాము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉందని తెలుసుకుంటారు, 8 మంది వ్యక్తులు తమ సొంత కలలు కలిగి, చివరకు తమ కలలని నెరవేర్చుకోవడానికి ఎలా పోరాడారు అనేదే మిగతా కథ.[2][3]
నటీనటులు
మార్చు- ఆర్యన్ రాజేష్ - రాఘవ్
- సదా - ప్రార్ధన
- రామ్ నితిన్ - సిద్దార్థ్
- నయన్ కరిష్మా - మేఘన
- సుదర్శన్ గోవింద్ - వరుణ్
- నిత్య శెట్టి - ప్రవల్లిక
- నిఖిల్ విజయేంద్ర సింహా - రాహుల్
- అపూర్వ రావు - వర్ష
- గీలా అనిల్ - సురేష్
- స్నేహాల్ ఎస్.కామత్ - అమృత
- రవి వర్మ - డేబాషిష్ సేనాపతి
- జయప్రకాష్ - ఆనంద్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
- నిర్మాత: నీహారిక కొణిదెల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ సాయివర్ధన్ జలదంకి
- సంగీతం: పీకే దండి
- సినిమాటోగ్రఫీ: ఎదురొలు రాజు
- ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మూలాలు
మార్చు- ↑ A. B. P. Desam (25 July 2022). "జీ5లో కొత్త తెలుగు సిరీస్ - ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో!". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.
- ↑ "హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?". 12 August 2022. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
- ↑ Eenadu (12 August 2022). "హలో వరల్డ్ రివ్యూ". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.