హవేరి జిల్లా

కర్ణాటక లోని జిల్లా

హవేరి, కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా, పట్టణం. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనుకూలంగా అనేక చూడవలసిన ప్రదేశాలున్నాయి.[2]. కనుక పర్యాటకులను ఈ ప్రదేశం విశేషంగా ఆకర్షిస్తుంది.[3] జిల్లా మపఖ్యపట్టణం హవేరి,

Haveri district
ಹಾವೇರಿ ಜಿಲ್ಲೆ
Clockwise from top-right: Galageshwara Temple at Galaganatha, Siddhesvara Temple in Haveri, Rajkumar circle in Utsav Rock Garden, Tarakeshwara Temple at Hangal, Chaudayyadanapura Mukteshwara temple in Ranebennur
Location in Karnataka
Location in Karnataka
పటం
Haveri district
Coordinates: 14°48′N 75°24′E / 14.8°N 75.4°E / 14.8; 75.4
Country India
StateKarnataka
RegionBayaluseeme
DivisionKittur Karnataka
HeadquartersHaveri
TaluksByadgi
Haveri
Hangal
Hirekerur
Shiggaon
Savanur
Rattihalli
Ranebennur
Government
 • Deputy CommissionerSanjay Shettannanavar
జనాభా
 (2011[1])
 • Total15,97,668
Languages
 • OfficialKannada
Time zoneUTC+5:30 (IST)
PIN
581110
Telephone code+ 91 (08375)
ISO 3166 codeIN-KA
Vehicle registrationKA 27 Haveri
KA 68 Ranebennuru

భౌగోళికం

మార్చు

హవేరి జిల్లా సరిగ్గా కర్ణాటక మధ్యలో ఉంది, ఇది ఉత్తరాన బీదర్ నుండి దక్షిణాన కొల్లెగల్ వరకు సమానంగా ఉంది. ఈ జిల్లాలో హనగల్, షిగ్గావ్, సవనూర్, హవేరి, భయాదగి, హిరేకెరూర్, రణెబెన్నూర్ అనే ఏడు తాలూకాలు ఉన్నాయి. ఇది ఉత్తరాన ధార్వాడ్ జిల్లా, ఈశాన్యంలో గడగ్ జిల్లా, తూర్పున బళ్లారి జిల్లా, దక్షిణాన దావంగెరే జిల్లా, నైరుతిలో షిమోగా జిల్లా, పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర కన్నడ సరిహద్దులుగా ఉన్నాయి. దీనిని సొంత జిల్లాగా మార్చడానికి ముందు, ఇది ధార్వాడ్ జిల్లాలో భాగం. హవేరి బెంగళూరు నుండి 335 కి.

హవేరి జిల్లా యొక్క పరిపాలనా, రాజకీయ ప్రధాన కార్యాలయం కాగా, దక్షిణాన రాణెబెన్నూర్ ఒక వ్యాపార కేంద్రంగా ఉంది. హవేరి జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, గ్రామాలు:

  • హవెరి :- జిల్లా పాలనా, సంస్కృతి, రాజకీయ కేంద్రం. జిల్లా పశు సంపదకు, ఆయిల్ మిల్లులకు, పత్తి మార్కెటుకు ప్రసిద్ధి. హవేరి " హవేరి న్యాయ " విధానానికి ప్రసిద్ధి. ఇది వివాదాలను సంప్రదాయ పద్ధతిలో పరిష్కరిస్తుంది.
  • హౌంసభవి :- ప్రముఖ విద్యాకేంద్రంగా గుర్తించబడుతుంది. (మృత్యుంజయ విద్యాపీఠం).
  • హంగల్ :- తాలూకా ప్రధాన కార్యాలయం, ఇక్కడ అందమైన తారకేశ్వర్ ఆలయం ఉంది.
  • అక్కి- ఆలూర్ :- సిటీ ఇన్ హంగల్ తాలూకా. " రైస్ బౌల్‌గా ప్రసిద్ధి చెందింది ". ఇది సరసులకు, తోటలకు ప్రసిద్ధి చెందింది.
  • కుమార్ పట్టణం :- ఇక్కడ తుంగభద్రా తీరంలో బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
  • బైయాద్గి :- బైయాద్గి మిరపకాయలకు ప్రసిద్ధి.
  • బంకపురా :- " బంకపూర్ కంసర్వేషన్ రిజర్వ్ " ఇది నెమళ్ళ అభయారణ్యంగా ప్రదిద్ధి చెందింది.
  • రాణేబెన్నూరు :- ఇది ప్రముఖ వ్యాపార కేంద్రం.
  • కగ్నెలె :- " కగ్నెలె కనక గురు పీఠం " ఇది ఒక ఆధ్యాత్మిక మఠం (సంస్థ). ఇది కనకదాస ౠషి పేరున స్థాపించబడింది.
  • రాత్తిహళ్ళి :- ఇది హిరెకెరూర్ తాలూకా లోని ఒక పట్టణం. ఇక్కడ అందమైన కదంబేశ్వరాలయం ఉంది.

గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,598,506, [4]
ఇది దాదాపు. గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 312 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 331 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.08%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 77.6%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 
హవేరి ప్రాంతం పర్యాటక పటం, ఉత్తర కర్ణాటక
  • వన్యప్రాణి అభయారణ్యం (రనెబెన్నుర్:హవేరి జిల్లా)
  • సిద్ధెస్వర ఆలయం (హవేరి)
  • దేవత ద్యమవ్వ మహాదేవ హవనుర్
  • హుక్కెరి మఠం (హవేరి)
  • తారకేశ్వర్ వద్ద (హనగల్)
  • నగరెష్వర్ వద్ద (బనకపురా)
  • ముక్తెష్వర ఆలయం (చౌదయ్యదనపుర)
  • గలగెష్వర ఆలయం (గలగనథ)
  • రత్తిహల్లి వద్ద కదంబెస్వర ఆలయం
  • సోమేశ్వర్ (హరలహల్లి)
  • జైన మందిరం (యలవత్తి)
  • ఆలయాలు కగినెలె (కనకదస)
  • అన్వెరి ఆలయం (హోల్)
  • అంజనెయస్వమి ఆలయం (కదరమందలగి)
  • మైలర లింగెశ్వర ఆలయం (మైలర గుత్తల)
  • సమీప ంలో గుడ్డ గుడ్డాపుర వద్ద మల్లరి ఆలయం (రనెబెన్నూరు)
  • సంగమెశ్వర్ ఆలయం (కుదల్, హంగల్, నరెగల్ నుండి 2.కి.మీ)
  • బసవేశ్వర ఆలయం (హొంబలి, హంగల్)
  • మల్లికార్జున దేవాలయం (విలేజ్ నరెగల్)
 
హవేరి జిల్లా చౌడయ్య దానపురలో ముక్తేశ్వరాలయం.
 
గలగనాథ గలగేశ్వర మందిరం, హవేరి జిల్లా

కగినెళ ఆలయాలు

మార్చు
  • కగినెళి మహాసంస్థాన కనకగురుపీఠ
  • ఆదికేశవ ఆలయం
  • వీరభద్రుని ఆలయం
  • సోమేశ్వర ఆలయం
  • సంగమేశ్వర దేవాలయం
  • ఖలహస్తెష్వర ఆలయం
  • నరసింహ ఆలయం
  • లక్ష్మీ ఆలయం
  • హందిగనుఒర్
  • వన్యప్రాణి సంక్చురి (రనెబెన్నుర్: హవేరి జిల్లా)
  • జైన్ ఆలయం (బలంబీడ్)
  • శిద్దరుద ఆలయం (చిక్కల్లి)
  • హొంబన్న బావి (ఆక్కీలుర్ గ్రామం)

రాణిబెన్నూరులో ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది.

ప్రముఖులు

మార్చు
  • కనకదాస :- కనకదాస జిల్లాలోని బాబా గ్రామంలో జన్మించాడు.
  • మైలర మహదేవప్ప :- బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం సాగించాడు. ఆయన జిల్లాలోని మోతెబెన్నూర్ జిల్లాలో జన్మించాడు.
  • సిద్దప్ప్ హోసమనీ కరజ్గి :- స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన తన స్థానిక ప్రదేశం అయిన కరజ్గి వద్ద బ్రిటిష్ వారిని అడ్డగించాడు. ఆయన గొప్ప న్యాయవాది. ఆయన సుభాస్ చంద్రబోసుతో అన్యోన్య సంబంధాలు ఉన్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంటుగా పనిచేసాడు. పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన హవేరీలో ఉన్న ముంసిపల్ హై స్కూల్ స్థాపించాడు. పేదల కొరకు సేవలు అందించాడు. ఆయన శిల్పం కె.ఎస్.ఆర్.టి.సి బస్ స్టాండు వద్ద ఉన్న హవేరీ జిల్లా ప్యాలెస్‌లో స్థైంచబడింది.
  • గుడ్లెప్ప హల్లికెరె :- స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన హోసరెట్టి ప్రాంతానికి చెందిన వాడు.హోసరట్టిలో " ఆయన గాంధీ గ్రామీణ గురుకుల్ " రెసిడెంషియల్ స్కూల్ స్థాపించాడు.
  • శాంతా షిషునల్ షరీఫ్ :- ఆయన గొప్ప కవి, 19వ శతాబ్ధానికి చెందిన తాత్వికవాది. ఆయన వ్రాసిన జానపద గేయాలు సజీవంగా ఉన్నాయి. ఆయన హవేరీ జిల్లాలోని షిగ్గావ్ తాలూకాలోని షిషువినల్‌కి చెందిన వాడు.
  • రామన్నద్ మన్నగి :- ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. ఆయన జంగమన కొప్ప వద్ద ఒక ఆశ్రమం స్థాపించాడు. ఇది హవేరి పట్టణం నుండి 5 కి.మీ దూరంలో ఉంది.
  • సుబ్బాన్న ఎక్కుండి :- సాహిత్య అకాడమీ గ్రహీత. (2011 జనవరి).
  • పుట్టరాజ్ గవైగళు :- ఆయన హవేరి జిల్లాలోని దేవగిరిలో జన్మించాడు. ఆయన గొప్ప హిందూస్థానీ సంప్రదాయ గాయకుడు. ఆయన గడగ్ వద్ద " వీరేశ్వర పుణ్యాశ్రమం " స్థాపించాడు.
  • పండిత్ పండి పంచాక్షరీ గవైగళ్ :- జిల్లాలోని కడా షెట్టిహళ్ళి తాలూకాలో జన్మించాడు.
  • గలగనాథరు :- ఆయన గలగనాథ్‌కు చెందిన గొప్ప రచయిత.
  • సరవజ్నయ :- ఆయన జిల్లాలోని అబలురు హిరెకెరూరు తాలూకాకు చెందిన వాడు.
  • వి.కె. గొకక్ :- గొప్పరచయిత. ఙాఅనపీఠ అవార్డ్ గ్రహీత. ఆయన జిల్లాలోని సవనూర్ లో జన్మించాడు.
  • జూనియర్ రాజ్‌కుమార్ :- అశోక్ బస్తి జిల్లాలోని దేవగిరి తాలూకాలో జన్మించాడు.
  • ఎన్ బసవర ఆయన గుడగేరి జిల్లాలో జన్మించాడు. ఆయన గొప్ప నటుడు, నాటక కంపెనీ స్వాతదారుడు.
  • బి.సి. పత్ని :- కన్నడ చిత్రనటుడు. ఆయన జిల్లాలోని యలివలలో జన్మించాడు.
  • మహేష్ బిక్షవర్తిమఠం :- రీజనల్ హెడ్ ఆఫ్ కర్ణాటక జీ. ఆయన హవేరి జిల్లాకు చెందినవాడు.

విద్యా సంస్థలు

మార్చు

పాఠశాలలు

మార్చు
  • సాయి-చంద్ర గురుకుల్, బసవేశ్వర్ నగర్.
  • మునిసిపల్ హై స్కూల్
  • జీన గంగా శిక్షణ సమితి కన్నడ మీడియం పాఠశాల, ఉన్నత పాఠశాల, (కూడా గెలెయార బలాగా అని పిలుస్తారు)
  • కె.ఎల్.ఇ ఇంగ్లీష్ మీడియం సి.బి.ఎస్.సి స్కూల్
  • జే.పి. రోటరీ స్కూల్
  • లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
  • హుక్కరిమఠం శివబశ్వేశర హై స్కూల్ (హవేరి)
  • శ్రీ మురళి దేశాయ్ రెసిడెన్షియల్ హై స్కూల్ (నెగలూర్)
  • కర్ణాటక పబ్లిక్ స్కూల్ (హంగల్ రోడ్ హవేరి)

కళాశాలలు

మార్చు
  • గుడ్డెప్ప హళ్ళికేరి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్
  • కె.ఎల్.ఇ ఆఫ్ సి.బి. కొల్లి పాలిటెక్నిక్ కళాశాల
  • కర్ణాటక పబ్లిక్ స్కూల్ (హంగల్ రోడ్ హవేరి)
  • ఎస్.జె.ఎం.కాలేజ్ ( హోదమఠం అని కూడా ) పిలుస్తారు
  • ఆర్.టి.ఇ.ఎస్. చట్టం. కాలేజ్, రాణెబెన్నూర్.

ఇది కూడ చూడు

మార్చు

మూలాలు

మార్చు
  1. Haveri District : Census 2011 data
  2. "Hold investors' meet in Haveri". Archived from the original on 2007-02-24. Retrieved 2008-11-20.
  3. "Karnataka, The Tourist Paradise". Archived from the original on 2009-03-04. Retrieved 2008-10-17.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582

వెలుపలి లింకులు

మార్చు