హాజెల్ కీచ్
హాజెల్ కీచ్, మోడల్, టీవి సినిమా నటి. టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలలో నటించింది.[1][2] బిల్లా, బాడీగార్డ్ సినిమాలలో నటించిన హాజెల్, సుజుకీ ప్రకటనలో కూడా నటించింది.[3] ఫ్రాంక్‌ఫిన్ మ్యూజిక్ రీమిక్స్ ఐటెమ్ నంబర్ "కహిన్ పే నిగాహెన్"లో డ్యాన్స్ చేసింది.[4] 2013లో రియాలిటీ టెలివిజన్ ప్రోగ్రాం బిగ్ బాస్ 7 లో పాల్గొన్నది.
హాజెల్ కీచ్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | రోజ్ డాన్, గుర్బసంత్ కౌర్ |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2007 – 2016 |
జీవిత భాగస్వామి | యువరాజ్ సింగ్ (2016) |
పిల్లలు | 1 |
జననం, విద్య
మార్చుహాజెల్ 1987, ఫిబ్రవరి 28న[5] ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జన్మించింది. తండ్రి బ్రిటీష్ వ్యక్తి కాగా, తల్లి బీహారీ వంశానికి చెందిన ఇండో-మారిషియన్ హిందువు.[6] లండన్‌లోని రెడ్‌బ్రిడ్జ్‌లోని బీల్ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.[7] పలు స్టేజ్ షోలలో ప్రదర్శన ఇచ్చింది. భారతీయ శాస్త్రీయ, బ్రిటీష్ నృత్యం, పాశ్చాత్య సమకాలీన నృత్యాలతో సహా పలురకాల నృత్యాలను కూడా నేర్చుకుంది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2007 | బిల్లా | రియా, రాజేష్‌కి కాబోయే భార్య | తమిళం | |
2009 | కిక్ | పాటలో | తెలుగు | |
2011 | బాడీగార్డ్ | మాయా కపూర్ | హిందీ | |
2012 | మాక్సిమం | ఆ అంటే అమలాపురం పాటలో | హిందీ | |
2012 | కృష్ణం వందే జగద్గురుమ్ | పాటలో | తెలుగు | |
2013 | హీర్ అండ్ హీరో | పాటలో | పంజాబీ | |
2015 | ధరమ్ సంకట్ మే | నీలానంద్ పాటలో | హిందీ | |
2016 | బాంకీ కి క్రేజీ బారాత్ | పాటలో |
వ్యక్తిగత జీవితం
మార్చు2015 నవంబరు 12న భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో హాజెల్ కు నిశ్చితార్థం జరిగింది.[8] 2016 నవంబరు 30న వారికి వివాహం జరిగింది.[9] వివాహం తర్వాత, హాజెల్ తన పేరును "గుర్బసంత్ కౌర్" (వివాహ వేడుకలో సంత్ బల్వీందర్ సింగ్ ఆమెకు ఇచ్చిన పేరు)గా మార్చుకుంది.[10] వారికి 2022 జనవరిలో మొదటి బిడ్డ జన్మించాడు.[11]
మూలాలు
మార్చు- ↑ PTI (16 September 2011). "Salman would never groan in pain: Hazel Keech". NDTV. Retrieved 2022-04-16.
- ↑ Sonal Chawla (3 March 2011). "Sallu's new girl Hazel Keech follows Kat". The Times of India. Archived from the original on 25 September 2012. Retrieved 2022-04-16.
- ↑ "Christine Zedek — Tamil Actress Gallery stills images clips". IndiaGlitz. Archived from the original on 2 మే 2007. Retrieved 20 July 2012.
- ↑ "Meet the new item number in town". Rediff.com. 31 December 2004. Retrieved 20 July 2012.
- ↑ "Yuvraj Singh braves a freezing day for Hazel Keech: Only because it is your birthday". India Today (in ఇంగ్లీష్). 28 February 2020. Retrieved 2022-04-16.
- ↑ Gulshankumar Wankar (1 September 2016). "Yuvraj Singh blasts Western Union for denying money to fiancée Hazel Keech". Hindustan Times. Retrieved 2022-04-16.
- ↑ Rob Parsons (9 September 2011). "West End chorus girl strikes Bollywood gold". Evening Standard. Archived from the original on 21 April 2013. Retrieved 2022-04-16.
- ↑ TNN (14 November 2015). "Yuvraj Singh Gets Engaged To Model-Actress Hazel Keech". The Times of India. Retrieved 2022-04-16.
- ↑ "Yuvraj Singh and Hazel Keech exchange wedding vows". The Hindu. Press Trust of India. 30 November 2016. Retrieved 2022-04-16.
- ↑ ABP News Web Desk (2 December 2016). "POST MARRIAGE Hazel Keech changes her NAME completely". ABP Live. Archived from the original on 2 January 2018. Retrieved 2022-04-16.
- ↑ "Yuvraj Singh, wife Hazel Keech blessed with baby boy". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-26. Retrieved 2022-04-16.
బయటి లింకులు
మార్చు- ట్విట్టర్ లో హాజెల్ కీచ్
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హాజెల్ కీచ్ పేజీ