హారూత్, మారూత్ ఈదూతలు పురాతన ఇస్రాయెలీ తెగలను పరీక్షించుటకు అల్లాహ్ చే బాబిలోనియాకు పంపబడ్డవారు. వీరికి అప్పజెప్పబడిన పని భార్యాభర్తలను వేరుచేయడం. వీరు తమపనిని నిర్వహించేముందు ప్రజలకు చెప్పేవారు "మేము మీమధ్య చిచ్చుపెట్టడానికి వచ్చాము, మానుండి మిమ్ముమీరు కాపాడుకోండ"ని కానీ ప్రజలు వినక గేలిచేస్తూ చేటుతెచ్చుకొన్నారు.

హరూత్, మరూత్ ఇన్ దేర్ ఫరెవర్ వెల్ (1703)

ఇద్దరు మలాయికా 1) హారూత్, 2) మారూత్ ల గురించి ఖురాన్ లో నేరుగాచెప్పబడింది. ". . . అలాంటివి హారూత్, మారూత్ లపై (బాబుల్ / బాబిలోనియాలో) అవతరింపబడినవి . . ." (అల్-బఖరా 2:102)

ఈ దూతలు బార్యాభర్తలను వేరుచేస్తూ వుంటారు. ఈ పని చేస్తున్నందుకు షైతాన్ వీళ్ళను ఎంతో పొగుడుతాడు. హారూత్ మారూత్, అనే ఇద్దరు దేవదూతల ద్వారా తేబడిన జాలవిద్యను ప్రజలకు నేర్పుచుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవ దూతలు) ఇలా చెప్పే వారు: “నిశ్చయంగా, మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్యతిరస్కారులు కాకండి.” అయినప్పటికీ వారు (ప్రజలు), భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించేది (జాల విద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. అల్లాహ్ అనుమతి లేనిదే, దాని ద్యారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే, కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించే వానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు.

ఇవీ చూడండి

మార్చు