హార్మోన్ సమస్యలు
మారుతున్న కాలంలో హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి వింటున్నాము. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి కాకుండా ఇంకా చాలా హార్మోన్‌లు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.
హార్మోన్లు అనగా ఏమి?
మార్చుహార్మోన్లు పాలీపెస్టైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుండి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడుతాయి. ఈ హార్మోన్‌లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతాయి.
ఇవి మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ, వీటి ప్రభావం వలన శరీరంలోని వివిధ సాధారణ జీవనక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత, జీవక్రియలకు తోడ్పడతాయి. మానవుడిలో ఈ హార్మోన్‌లు అసమతుల్యతకు గురి అయినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు.
వివిధ హార్మోన్‌లు-వాటి అసమతుల్యతల వలన వచ్చే జబ్బులు
మార్చు- థైరాయిడ్ హార్మోన్‌లు (T3, T4): ఇవి థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతాయి. కానీ, వీటి ప్రభావం 90 శాతం మానవుడి జీవనక్రియలపై ఉంటుంది. వీటి అసమతుల్యత వలన హైపోథైరాయిడ్, హైపర్‌థైరాయిడ్, గాయిటర్ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి.
- హైపోథైరాయిడ్ లక్షణాలు : బరువు పెరగడం, జుట్టు రాలడం, నీరసం, మతిమరుపు, ఋతుచక్ర సమస్యలు మొదలైన వాటికి దారితీస్తుంది.
- హైపర్‌థైరాయిడ్ లక్షణాలు : బరువు తగ్గడం, నీరసం, గుండెదడ, కాళ్ళు చేతులు వణకడం మొదలైన సమస్యలకు దారి తీస్తుంది.
- గాయిటర్ : గొంతుకింద ఉండే థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి అవటాన్ని గాయిటర్ అంటాము. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వలన వస్తుంది. ఇది హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు.
స్త్రీలలో ఉండే హార్మోన్లు
మార్చుఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటాసిన్ హార్మోన్‌లు స్త్రీలలో రజస్వల, ఋతుచ్రకం, ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary Sexual Characters) సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్‌లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు (Menstrual Disorders, PCOD) హిర్సుటిజం (అవాంఛిత రోమాలు), సంతానలేమి సమస్యలు వస్తాయి. స్త్రీలలో మెనోపాజ్, రజస్వల అయ్యే సమయంలో హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్ హెచ్చుతగ్గుల వలన Hot Flushes, మానసికఅశాంతి, నీరసం, కీళ్ళు, కండరాల నొప్పులు వస్తాయి.
పురుషులలో ఉండే హార్మోన్లు
మార్చుటెస్టోస్టిరాన్: ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యతల వలన శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు వస్తాయి.
చికిత్స
మార్చుప్రస్తుత పరిస్థితులలో మానవుడి జీవన విధానం, అధిక ఒత్తిడికి గురికావడం వలన ఎక్కువ శాతం థైరాయిడ్ బారిన పడటం గమనించాము. థైరాయిడ్ సమస్యలకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా, ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి వ్యక్తిత్వానికి అనుగుణంగా సరి అయిన హోమియో వైద్యం చేయడం ద్వారా థైరాయిడ్, హార్మోన్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
హార్మోన్ సమస్యలు ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటికి హోమియో కేర్ వైద్యంతో ఎలాంటి హార్మోన్‌లు బయటినుండి ఇవ్వకుండా హార్మోన్ అసమతుల్యతలను సరిచేయడం వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఋతుచక్ర సమస్యలు, పీసీఓడీ సమస్యలు, సంతానలేమి, శుక్రకణ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చును.