హింగ్లాజ్
హింగ్లాజ్ (ఇంగ్లీషు: Hinglaj, సంస్కృతం: हिङ्ग्लाज, హిందీ: हिंगलाज) అనునది పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శక్తిపీఠం.[1] హింగ్లాజ్ లేదా హింగుళ దేవి భారతదేశంలోని చాలామంది క్షత్రియులకు, ఇతర తెగలకూ కులదేవత. ఇది బెలూచిస్తాన్ రాష్ట్రంలో కరాచీ నుండి 250 కి.మీ దూరంలో ఉన్నది.[1][2]
Hinglaj ﮨنگلاج | |
---|---|
Coordinates: 25°30′52.6″N 65°31′08.7″E / 25.514611°N 65.519083°E | |
Country | Pakistan |
Province | Balochistan |
Time zone | UTC+5 (PST) |
స్థల పురాణం
మార్చుసతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది. సతీ దేవి బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినట్టు చెప్పుకుంటారు. ఇక్కడ భైరవుడు భీమలోచనుడనే పేర పిలువబడుతున్నాడు.
రామాయణం ప్రకారం, రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడు.
హింగుళా దేవికి చెందిన ఈ మంత్రం దధీచీవిరచితంగా భావిస్తారు.
ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి
మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా
సినిమా
మార్చుహింగ్లాజ్ దేవి ఆలయం కథనాంశంగా, టి.గోపిచంద్ కథానాయకుడిగా సాహసం అనే తెలుగు చిత్రం, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చింది. భారత్-పాకిస్తాన్ విభజన అనంతరం, భారతదేశానికి వచ్చిన హిందువుల, కుటుంబంలో పుట్టిన కథానాయకుడు, తన వారసత్వ ఆస్తికోసం, పాకిస్తాన్ కి వెళ్ళే నేపథ్యంలో, సినిమా కథ సాగుతుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 http://www.sskna.org/newsite/folklores.php
- ↑ "In a Muslim-majority country, a Hindu goddess lives on". Culture & History. 10 January 2019. Retrieved 12 October 2020.