సాహసం (2013 సినిమా)

చంద్ర శేఖర్ చిత్రించిన తెలుగు చలనచిత్రం (2013)

సాహసం 2013 లో విడుదలైన తెలుగు చిత్రం. గోపీచంద్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం ఇండియా ప్రై.లిమిటెడ్‌ పతాకంపై ఛత్రపతి ప్రసాద్‌ నిర్మించారు. గోపీచంద్‌, తాప్సీ, శక్తికపూర్‌, ఆలీతో పాటు ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ఎస్‌., ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎస్‌.రామకృష్ణ, సంగీతం: శ్రీ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: కె.కె.రాధాకృష్ణ కుమార్‌, పాటలు: అనంత్‌శ్రీరాం, నిర్మాత: బి.వి. ఎస్‌. ఎన్‌.ప్రసాద్‌,కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్‌ ఏలేటి.

సాహసం
Sahasam.jpg
దర్శకత్వంచంద్రశేఖర్ ఏలేటి
నిర్మాతబి. వి. ఎస్. ఎన్. ప్రసాద్
నటులుతొట్టెంపూడి గోపీచంద్
తాప్సీ
ఆలీ (నటుడు)
సంగీతంశ్రీ
ఛాయాగ్రహణంశ్యామ్‌దత్. ఎస్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర
విడుదల
మార్చి 2013 (2013-03)
దేశంభారత్
భాషతెలుగు

కథసవరించు

ఈ చిత్ర కథకు స్ఫూర్తికలిగించిన అంశాలు ఇండియా-పాకిస్థాన్ విడిపోయిన సమయంలో ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లారు. అక్కడి వాళ్లు కొంత మంది ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆస్తులను చాలా మంది వదులుకున్నారు. దీనిపై ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. చాలా రిస్క్ అయినా సరే లడక్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు.[1]

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకుడు - చంద్రశేఖర్ ఏలేటి
  • ఆర్ట్ - ఎస్. రామకృష్ణ
  • సినిమాటోగ్రఫీ - శ్యామ్‌దత్. ఎస్
  • సంగీతం - శ్రీ
  • ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఫైట్స్ - సెల్వ
  • అసోసీఏట్ రైటర్స్ - కె. కె. రాధాకృష్ణ కుమార్, ప్రశాంత్, సుమలత
  • మాటలు - కె. కె. రాధాకృష్ణ కుమార్,
  • పాటలు - అనంత శ్రీరామ్

సూచికలుసవరించు

బయటి లంకెలుసవరించు