ప్రధాన మెనూను తెరువు

చంద్రశేఖర్ యేలేటి (జననం మార్చి 4, 1973)తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన ఐతే సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు. [1] ఆయన అనుకోకుండా ఒక రోజు మరియు ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. [2] తన యొక్క దశాబ్ద వృత్తి జీవితమ్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు నంది పురస్కారాలను పొందాడు. [3]

చంద్రశేఖర్ యేలేటి
జననం (1973-03-04) 1973 మార్చి 4 (వయస్సు: 46  సంవత్సరాలు)
తుని, ఆంధ్ర ప్రదేశ్, India
నివాసంహైదరాబాద్, తెలంగాణ
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు2003–present

బాల్య జీవితం మరియు కెరీర్సవరించు

ఆయన మార్చి 4 1973 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తుని లో జన్మించాడు. గంగరాజు గున్నం ఆయన యొక్క బంధువు. చంద్రశేఖర్ మే 19 న వివాహం జరిగింది.[4][5] ఆయన గంగరాజు గున్నం దర్శకత్వం వహించిన తెలుగు చలన చిత్రం లిటిల్ సోల్జర్స్ లో అసిస్టెంటు దర్శకునిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ప్రముఖ టెలివిజన్ కామెడీ సీరియల్ అయిన అమృతం (ధారావాహిక) యొక్క మొదతి 10 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించాదు.

మలుపు (2004–2009)సవరించు

అసిస్టెంటు డైరక్టరుగా పనిచేసిన తరువాత ఆయన ఐతే సినిమాతో దర్శకత్వ భాద్యతలు చేపట్టాడు. ఈ చిత్రం నిర్మాణానికి 1.5 కోట్ల ఖర్చయింది. కానీ ఈ చిత్రం 6 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండు సంవత్సరాల తరువాత ఆయన అనుకోకుండా ఒక రోజు చిత్రాన్ని విదుదల చేసాడు. ఈ రెండు చిత్రాలకు గున్నం గంగరాజు నిర్మాణ భాద్యతలు చేపట్టాడు. కొంత కాలం వ్యవధి తరువాత ఆయన గోపీచంద్ కథా నాయకునిగా ఒక్కడున్నాడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2009లో ఆయన తన నాల్గవ చిత్రం మంచు మనోజ్ కథానాయకునిగా ప్రయాణం చిత్రానికి దర్శకత్వం వహించాడు.

చిత్రాలుసవరించు

టెలివిజన్సవరించు

అవార్డులుసవరించు

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు