హిబత్ అబు నదా
హిబత్ కమల్ అబూ నదా (అరబ్బీ: هبة كمال أبو ندى); జూన్ 24, 1991 - 20 October 2023). ఆమె పాలస్తీనా కవయిత్రి, నవలా రచయిత్రి, పోషకాహార నిపుణురాలు [1], ఇంకా వికీమీడియన్[2]. ఆమె నవల "ఆక్సిజెన్ ఇస్ నాట్ ఫర్ ది డెడ్ ("Oxygen is not for the dead") కు 2017లో షార్జా అవార్డ్ ఫర్ అరబ్ క్రియేటివిటీ లో రెండవ స్థానం లభించింది.[3][4] ఆమె 2023 లో ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ విమాన దాడులలో (airstrike) గాజా స్ట్రిప్ లో మరణించింది.
హిబత్ అబూ నదా | |
---|---|
స్థానిక పేరు | هبة أبو ندى |
జననం | హిబత్ కమల్ సలేహ్ అబూ నదా (Hiba Kamal Saleh Abu Nada) 1991 జూన్ 24 మక్కా, సౌదీ అరేబియా |
మరణం | 2023 అక్టోబరు 20 ఖాన్ యునిస్, గజా స్టిప్ | (వయసు 32)
వృత్తి | కవయిత్రి, కాల్పనిక సాహిత్య రచయిత్రి, పోషకాహార నిపుణురాలు |
జీవిత విశేషాలు
మార్చుఅబూ నదా 24 జూన్ 1991న మక్కా, సౌదీ అరేబియాలో జన్మించింది..ఆమె ఇస్లామిక్ విశ్వవిద్యాలయం, గాజా నుండి జీవ రసాయన శాస్త్రం (బయోకెమిస్ట్రీ)లో బ్యాచిలర్ డిగ్రీని, అల్ - అజర్ విశ్వవిద్యాలయం నుండి పోషకాహార చికిత్స (క్లినికల్ న్యూట్రిషన్) లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.[5]
ఆమె 'అల్ - అమల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్ఫన్స్' తో అనుబంధం కలిగిన 'రుసూల్ సెంటర్ ఫర్ క్రియేటివిటీ'లో కొంతకాలం పనిచేశారు. ఆమె " న్యాయం గురించి , అరబ్ స్ప్రింగ్ తిరుగుబాట్లు, ఆక్రమణలో ఉన్న పాలస్తీనా జీవితం వాస్తవాల గురించి ఆలోచించింది.[6] అని అల్ - అయ్యామ్ పేర్కొన్నాడు.
ఆమె అనేక కవితా సంకలనాలను, అల్ - ఉక్సుజిన్ లేసా లిల్ - మావ్తా (' ఆక్సిజన్ ఈజ్ నాట్ ఫర్ ది డెడ్ ') అనే పేరుతో ఒక నవలను ప్రచురించింది. 2017లో ఆమె తన నవలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించిన 20వ వార్షిక షార్జా అవార్డు ఫర్ అరబ్ క్రియేటివిటీలో రెండవ స్థానాన్ని గెలుచుకుంది. [7][8]ఈ పుస్తకాన్ని దార్ దివాన్ 2021లో తిరిగి ప్రచురించారు.[9]
రచన
మార్చుالأكسجين ليس للموتى [Oxygen is not for the dead: a novel] (in అరబిక్). دائرة الثقافة، حكومة الشارقة،, al-Shāriqah. 2017. ISBN 978-9948-23-314-5. OCLC 1032289333.
మరణం
మార్చు20 అక్టోబరు 2023న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ లోని ఆమె ఇంటిని ఢీకొన్న ఇజ్రాయెల్ వైమానిక దళం వైమానిక దాడి సమయంలో ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ఆమె మరణించారు. ఆమె వయసు 32 సంవత్సరాలు.[10][11]
ఆమె 'లిటరరీ హబ్' అను ఆన్లైన్ వేదిక మీద చివరి పోస్ట్ 8 అక్టోబరు 2023న చేసింది[12]
- గాజా లో రాత్రి చీకటిగా ఉంటుంది, రాకెట్ల మెరుపుతో పాటు,
- బాంబుల శబ్దంతో పాటు నిశ్శబ్దం
- ప్రార్థన సౌకర్యం, అమరవీరుల కాంతి తో పాటు భయపెట్టే నలుపు
- శుభ రాత్రి, గాజా.
సూచనలు
మార్చు- ↑ "وزارة الثقافة تنظم أمسية شعرية بالتعاون مع بلدية غزة". Alwatan Voice (in అరబిక్). 29 August 2017. Archived from the original on 29 August 2017. Retrieved 20 October 2023.
- ↑ "Gaza: Muerte de una poeta - ContraPunto". ContraPunto (in స్పానిష్). 21 October 2023. Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ ""الثقافة" تكّرم الروائية "أبو ندى" لفوزها بجائزة الشارقة للإبداع العربي". Alray (in అరబిక్). 15 March 2017. Archived from the original on 21 October 2023. Retrieved 20 October 2023.
- ↑ "الأكسجين ليس للموتى". Department of Culture, Sharjah (in అరబిక్). 2017. Archived from the original on 21 October 2023. Retrieved 20 October 2023.
- ↑ "حوار صحفي مع الأديبة هبة أبو ندى". Women for Palestine (in అరబిక్). 12 March 2017. Archived from the original on 25 July 2019. Retrieved 20 October 2023.
- ↑ "هبة أبو ندى ." www.al-ayyam.ps. Archived from the original on 29 అక్టోబరు 2023. Retrieved 25 October 2023.
- ↑ "الحدث الثقافي: فلسطين تكسب جائزتين في الشعر والرواية". Al-Hadath (in అరబిక్). 17 February 2017. Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023.
- ↑ "وزارة الثقافة تشيد بفوز حجاوي وابو ندى في جائزة الشارقة للإبداع العربي". Palestinian Ministry of Culture (in అరబిక్). 2017. Retrieved 20 October 2023.[permanent dead link]
- ↑ "الأكسجين ليس للموتى (Oxygen is not for the dead)". Goodreads (in ఇంగ్లీష్). Retrieved 25 October 2023.
- ↑ Ramadan, Alsayid (21 October 2023). "حاصلة على جائزة الشارقة للإبداع العربي.. وفاة الأديبة الفلسطينية الشابة هبة أبو ندى ضحية قصف غزة". Al-Bayan (in అరబిక్). Archived from the original on 20 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Al-Kardousi, Elham (21 October 2023). "معلومات عن الشاعرة الفلسطينية هبة أبو ندى.. قتلها الاحتلال في غزة". El Watan News (in అరబిక్). Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ "Read the last words of writer Heba Abu Nada, who was killed last week by an Israeli airstrike". Literary Hub (in అమెరికన్ ఇంగ్లీష్). 24 October 2023. Retrieved 25 October 2023.