హిమాంశ్ కోహ్లీ

హిమాంశ్ కోహ్లీ (జననం 1989 నవంబరు 3 [1] ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ నటుడు. హిందీ సీరియల్ హమ్సే హై లైఫ్ లోని రాఘవ్ ఒబెరాయ్ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు కోహ్లీ. జనవరి 2014న విడుదలైన యారియాన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశాడు.

హిమాంశ్ కోహ్లీ
హిమాంశ్ కోహ్లీ

తొలినాళ్ల జీవితంసవరించు

పంజాబీ హిందూ కుటుంబం లో పుట్టిన కోహ్లీ ఢిల్లీ పెరిగాడు.[1] తండ్రి విపిన్ కోహ్లీ, తల్లి నీరూ కోహ్లీ. ఢిల్లీలోని కె.ఆర్.మంగళం వరల్డ్ స్కూల్ లో చదువుకున్నాడు.  ఎమిటీ విశ్వవిద్యాలయం నుండి మాస్ మీడియాలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు.[2] 

జీవిత గమనంసవరించు

మే 2011 నుండు జూలై 2011 వరకు ఢిల్లీ లోని రేడియో మిర్చి లో రేడియో జాకీగా పచిచేశారు. చానల్ వి లోని డైలీ సీరియల్ హమ్సే హై లైఫ్  సినిమాలో  రాఘవ్  ఒబెరాయ్  పాత్రలో నటించారు.[3]  2011 సెప్టెంబరు 5 నుండి 2012 జూన్ 12 వరకు ఆ సీరియల్ లో పనిచేసి, సినిమా అవకాశం వచ్చిన కారణంగా సీరియల్ ను వదిలేశారు.[4] కానీ చివరి ఎపిసోడ్ల కోసం నవంబరు 2012లో తిరిగి ఆ సీరియల్ లో నటించాడు.2012 మే లో దర్శకుడు దివ్య కుమార్ యారియాన్ సినిమా కోసం హీరోగా హిమాంశ్ ను ఎంపిక చేశారు.[5] 2014 జనవరి 10న సినిమా విడుదలైంది.2015 జనవరి లో అభి నహీతో కభీ నహీ సినిమాలో హీరోగా ఎంపికయ్యారు హిమాంశ్. ఆ తరువాత జీనా ఇసీ కా నాం హై, స్వీటీ దేసీ వెడ్స్ ఎన్.ఆర్.ఐ సినిమాలకు కూడా సైన్ చేశారు ఆయన. 2016 లో అభీ నహీతో కభీ నహీ సినిమా విడుదల అవుతుంది.[6]

సినిమాలుసవరించు

సంవత్సరం చిత్రం భాష
2014 యారియాన్ హిందీ
2016 అభీ నహీతో కభీ నహీ హిందీ
2016 జీనా ఇసీ కా నామ్ హై హిందీ
2016 స్వీటీ దేశీ వెడ్స్ ఎన్.ఆర్.ఐ హిందీ

టెలివిజన్సవరించు

  • హమ్సే హై లైఫ్ సీరియల్ లో రాఘవ్ పాత్ర

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Himansh Kohli". web.archive.org. 2013-11-11. Retrieved 2020-12-26.
  2. Fab Five Archived 2016-03-04 at the Wayback Machine, boxofficeindia.com, retrieved 11 May 2014
  3. "Abigail Jain in new show Humse Hai Life on Channel [V]". Metro Masti.
  4. Varun Kapoor enters Humse Hai Life on Channel V Archived 2013-11-02 at the Wayback Machine, The Times of India 1 June 2012, retrieved 11 May 2014
  5. "Divya Kumar finds the leading man for her directorial debut". Mid Day. 24 September 2012.
  6. "Virender K. Arora (an agriculturist magnate), who is producing the film with Arjun N. Kapoor, CEO of Virender K. Arora & Arjun N." TOI. 26 January 2015.