పెద్ద హిమాలయాలు

(హిమాద్రి నుండి దారిమార్పు చెందింది)

పెద్ద హిమాలయాలు (గ్రేటర్ హిమాలయాలు) హిమాలయాల్లో కెల్లా ఎత్తైన పర్వత శ్రేణి.[1][2] వీటిని హిమాద్రి అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం, అలాగే కొంచెం అటూ ఇటూగా అంతే ఎత్తుండే కాంచన్‌జంగా, లోట్సే, నంగ పర్బత్ వంటి ఇతర శిఖరాలు పెద్ద హిమాలయ శ్రేణిలో భాగంగా ఉన్నాయి. పశ్చిమ నుండి తూర్పుకు వీటి మొత్తం విస్తరణ 2400 కి.మీ. కాగా, వాటి సగటు ఎత్తు 6000 మీ.

Annapurna I and Annapurna south on the right; Nilgiri South on the left of the Himalayas
అన్నపూర్ణ 1, కుడివైపున అన్నపూర్ణ దక్షిణ; హిమాలయాలకు ఎడమవైపున దక్షిణ నీలగిరి

గంగోత్రి హిమానీనదం, సతోపంత్ గ్లేసియర్‌తో సహా అనేక హిమానీనదాలు ఈ శ్రేణిలో ఉన్నాయి.

పెద్ద హిమాలయాలు ఉన్న దేశాలు - భారతదేశం, చైనా, నేపాల్, పాకిస్తాన్, భూటాన్, టిబెట్.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Greater Himalayas Encyclopædia Britannica
  2. Hussain, Majid, Geography of India