హిరణ్యాక్షుడు హిందూ పురాణాలలో పేర్కొన్న ఒక రాక్షసుడు. ఇతను భూమిని ముంచివేసి, ముల్లోకాలను భయకంపితులను చేశాడు. ఇతన్ని దశావతారాలలో ఒకటైన వరాహ అవతారం సంహరించి భూమిని రక్షించి లోకాలలో శాంతిని స్థాపించాడు.[2][3] ఇతని సోదరుడు హిరణ్యకశిపుడు.

హిరణ్యాక్ష
Hiranyaksha
హిరణ్యాక్షునితో పోరాటం చేస్తున్న వరాహవతారం, భాగవత పురాణంలోని ఒక దృశ్యం (సు. 1740)
అనుబంధంఅసురులు
నివాసంపాతాళ లోకం
ఆయుధములుగధ
భర్త / భార్యరుషభాను[1]
తల్లిదండ్రులుకశ్యపుడు, దితి
తోబుట్టువులుహిరణ్యకశిపుడు (సోదరుడు)
హోళిక (చెల్లెలు)
పిల్లలుఅంధకుడు

పద వివరణ

మార్చు

హిరణ్యాక్షుడు అంటే బంగారం వంటి కన్నులు కలవాడని అర్థం.[4]

పురాణ కథనం

మార్చు

వైకుంఠానికి కాపలాగా ఉన్న జయ విజయులను ద్వారపాలకులు బ్రహ్మ కుమారులైన సనత్కుమారులును అడ్డగిస్తారు. వారు అగ్రహోదగ్రులై భూలోకమునందు అసురులై జన్మించమని శాపం ఇస్తారు. వారు విష్ణుమూర్తిని ప్రార్థించగా మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు, కావున వారి శాపమున మూడుజన్మలు రాక్షసులులుగా జన్మించండని చెబుతాడు. కొన్ని పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు దితి, కశ్యపుల పుత్రుడు.[5] ఇతను బ్రహ్మ గురించి తీవ్ర తపస్సు చేసి దేవుడు, మనిషి, మృగాల చేత తనకు చావు రాకూడదని వరం సంపాదించాడు.[6][7] ఈ వర గర్వంతో హిరణ్యాక్షుడు ఏ రక్షణ లేని భూమిని విశ్వాంతరాళ సముద్రంలోకి ఈడ్చుకుపోసాగాడు. దేవతలందరూ కలిసి భూమిని, జీవకోటిని కాపాడమని మహావిష్ణువును వేడుకున్నారు. వారి ప్రార్థనను మన్నించిన మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి తన కొమ్ముతో భూమిని ఎత్తి కాపాడాడు. అడ్డుకోబోయిన హిరణ్యాక్షుని వధించాడు.[5][8]

హిరణ్యాక్షుని అన్నయైన హిరణ్యకశిపుడు కూడా తమ్ముని లాగే మరణం లేకుండా వరాలు పొందాడు. ముల్లోకాలను జయించి తన తమ్ముని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.[9]

మూలాలు

మార్చు
  1. "Hiraṇyakaśipu consoles his mother and kinsmen [Chapter 2]". 30 August 2022.
  2. Williams, George M. (2008-03-27). Handbook of Hindu Mythology (in ఇంగ్లీష్). OUP USA. p. 155. ISBN 978-0-19-533261-2.
  3. Jones, Constance; Ryan, James D. (2006). Encyclopedia of Hinduism (in ఇంగ్లీష్). Infobase Publishing. p. 189. ISBN 978-0-8160-7564-5.
  4. George M. Williams (27 March 2008). Handbook of Hindu Mythology. Oxford University Press. pp. 54–. ISBN 978-0-19-533261-2. Retrieved 28 August 2013.
  5. 5.0 5.1 Roshen Dalal (2010). Hinduism: An Alphabetical Guide. Penguin Books. p. 159. ISBN 978-0-14-341421-6.
  6. Cole, W. Owen (1996-06-01). Six World Faiths (in ఇంగ్లీష్). A&C Black. p. 29. ISBN 978-1-4411-5928-1.
  7. Phillips, Charles; Kerrigan, Michael; Gould, David (2011-12-15). Ancient India's Myths and Beliefs (in ఇంగ్లీష్). The Rosen Publishing Group, Inc. p. 59. ISBN 978-1-4488-5990-0.
  8. George M. Williams (2008). Handbook of Hindu Mythology. Oxford University Press. pp. 154–155, 223–224. ISBN 978-0-19-533261-2.
  9. Hudson, D. Dennis (2008-09-25). The Body of God: An Emperor's Palace for Krishna in Eighth-Century Kanchipuram (in ఇంగ్లీష్). Oxford University Press. p. 202. ISBN 978-0-19-045140-0.