బ్రహ్మ మానస పుతృలలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు ఒక ప్రజాపతి.

దక్షుడు తన సంతానము అయిన దితి, అదితి, కద్రువ, వినత, దను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధనక, ఇడ, ఖస, ముని అనే 13గురు కుమార్తెలను కశ్యపుని కిచ్ఛి వివాహము చేసెను.

కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే ఆదిత్యులు. నామములు వరుసగా ఇంద్ర, మిత్ర, ధాత, భాగ, త్వష్ట, వరుణ, ఆర్యమ, వివస్వనుడు, సవిత్రుడు, పూష, అంషు అను నామములతో ప్రసిద్ధి చెందినారు.

మిత్రకు సంధ్యతో వివాహము జరిగి, వారికి కుమారునిగా శని జన్మించెను.

వివస్వనుడు/వివశ్వనునికి కుమారునిగా వైవశ్వంన్త జన్మించెను. వైవశ్వంన్త ఆ తదుపరి వైవశ్వంన్త మనువుగా భాసిల్లెను.

కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము రాక్షసులు లేదా అసురులు. వారే హిరణ్యకసిపుడు, హిరణ్యాక్షుడు.

కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము పక్షి గణములు. వారే అనూరుడు, గరుత్మంతుడు, సగరుడు. సగరుని భార్య సుమతి.

కశ్యపునికీ, కద్రువకు కలిగిన సంతానము నాగ గణములు అయిన తక్షకుడు, కర్కోటకుడు.

కశ్యపునికీ, దనుకు 100 మంది సంతానము కలిగినారు. వారే దనువులు. వారిలో ఒకరు విప్రఛిత్తి. విప్రఛిత్తి కుమారుడు మయుడు.

మూలాలుసవరించు

(1) *డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).

"https://te.wikipedia.org/w/index.php?title=దితి&oldid=2951351" నుండి వెలికితీశారు