హృదయాల తోటలు పూయగా

ఈ పాటని డా.దాశరథి రంగాచార్య రచించారు. మహాభాష్యం చిత్తరంజన్ గారు సంగీతం సమకూర్చారు. ఈ పాటని చిత్తరంజన్, శాంతా చారి, ఎ.వి.సావిత్రి గానం చేయగా ఆకాశవాణిలో ఉగాది గీతంగా ప్రసారామయింది.

సందర్భం (చిత్తరంజన్ గారి లలిత సంగీతం: 80 సంగీత సారస్వత మలయమారుతాలు నుంచి) మార్చు

1977లో రవీంద్రభారతిలో అక్కినేని నాగేశ్వరరావుగారికి జరిగిన సన్మానం కోసం బాపు,రమణల కోరికపై దాశరథి రచించిన గీతమిది. ముళ్ళపూడి రమణ రచించిన కథానాయకుడి కథ అనే గ్రంథం ఆ సభలో ఆవిష్కరించారు. ఈ విషయాన్ని ఈ గీతంలో "కథానాయకుడవై నీవు కదలి రావోయీ" అంటూ దాశరథి స్ఫురింపజేసారు.

రాగం: బిలహరి

తాళం: మిశ్రచాపు (రూపక్ తాళ్)

<poem>

హృదయాల తోటలు పూయగా వచ్చింది వాసంతం వాసంతం మన భాగ్యనగరం అంతటా విరిసింది ఆనందం ఆనందం ॥

రాళ్ళ గుండెలలలో మల్లియలే తెల్లని నవ్వులోలికే ముళ్ళ మనసులలలో గులాబీలే తీయని తావి చిలికే ఓ ఉగాదీ స్వాగతం సుస్వాగతం ఓయీ నేస్తం స్వాగతం సుస్వాగతం ॥

కథానాయకుడవై నీవు కదలి రావోయీ ఎల్లజనులు మెచ్చుకొనగ మల్లెపూలు విచ్చుకొనగ సుధామయ జీవివి నీవు సోంపులిడవోయీ ఎల్లజనులు మెచ్చుకొనగ మల్లెపూలు విచ్చుకొనగ ఓ ఉగాదీ స్వాగతం సుస్వాగతం ఓయీ నేస్తం స్వాగతం సుస్వాగతం ॥