మహాభాష్యం చిత్తరంజన్
మహాభాష్యం చిత్తరంజన్ (1938 ఆగస్టు 25 - 2023 జూలై 21) ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో చాలాకాలం పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశాడు.
మహాభాష్యం చిత్తరంజన్ | |
---|---|
జననం | 1938 ఆగస్టు 25 హైదరాబాదు |
మరణం | 2023 జూలై 21 | (వయసు 84)
వృత్తి | ఆకాశవాణిలో లలిత గీతాల రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1971- 1998 |
గుర్తించదగిన సేవలు | లలిత సంగీత సౌరభం, లలిత సంగీతం-80 సంగీత సారస్వత మలయమారుతాలు తదితర పుస్తకాలు |
జీవిత భాగస్వామి | డా.పద్మిని |
పిల్లలు | అమృతవల్లి (మూడో కుమార్తె ) శ్రీనివాస హరీష్ (కుమారుడు) |
తల్లిదండ్రులు |
|
ఎనిమిదేళ్ల వయసు నుంచి నిజాం ప్రభుత్వ హయాంలోని దక్కన్ రేడియోలో పాడటం మొదలుపెట్టిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా లలిత సంగీతానికి సేవలందించాడు. 1972లో ఆలిండియా రేడియోలో ‘ఏ’ గ్రేడ్ గాయకుడిగా గుర్తింపు పొందాడు. 2008లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది.[1]
రచనలు
మార్చుఇతడు వెలువరించిన పుస్తకాలు:
- లలిత సంగీతం: 80 సంగీత సారస్వత మలయమారుతాలు
- లలిత సంగీత సౌరభం
- శ్రీ చిత్తరంజనం: కీర్తనలు, లలిత భక్తి గీతాలు, మంగళహారతులు
లలిత గీతాలు
మార్చుఇతడు స్వరపరచిన లలిత గీతాల జాబితా:
మరణం
మార్చు85 ఏళ్ల మహాభాష్యం చిత్తరంజన్ 2023 జూలై 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు.[2] ఆయన భార్య డా.పద్మిని, పెద్ద కుమార్తె విజయలక్ష్మి దేశికన్, రెండో కుమార్తె వందన పవన్ గతంలోనే మృతిచెందారు.
మూలాలు
మార్చు- ↑ "లలిత సంగీత శిఖరం.. చిత్తరంజన్ ఇకలేరు |". web.archive.org. 2023-07-22. Archived from the original on 2023-07-22. Retrieved 2023-07-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ప్రముఖ లలిత సంగీతకారుడు చిత్తరంజన్ కన్నుమూత | Popular classical musician Chittaranjan passed away". web.archive.org. 2023-07-22. Archived from the original on 2023-07-22. Retrieved 2023-07-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)