హృదయ కాలేయం
హృదయ కాలేయం 2014 లో విడుదలైన తెలుగు చలన చిత్రము.
హృదయ కాలేయం | |
---|---|
దర్శకత్వం | స్టీఫెన్ శంకర్ |
రచన | స్టీవెన్ శంకర్ |
నిర్మాత | స్టీవెన్ శంకర్ |
తారాగణం | సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, కావ్యా కుమార్ |
ఛాయాగ్రహణం | చిరంజీవి |
కూర్పు | కార్తీక్ శ్రీనివాస్ |
సంగీతం | ఆర్కే |
నిర్మాణ సంస్థలు | అమృత ప్రొడక్షన్స్, వి.ఎస్.ఎస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 4, 2014 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | Rs 52,30,000 |
బాక్సాఫీసు | Rs 40000000 |
కథ
మార్చుసంపూ (సంపూర్ణేష్ బాబు ) ఓ చిల్లర దొంగ. సంపూ దొంగగా మారడానికి ముందు నీలూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలూ కూడా అంతే మొత్తంలో సంపూని ప్రేమిస్తుంది. ఊహించని విధంగా నీలూ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి నీలూని బయటపడేయాడానికి సంపూ దొంగగా మారాల్సి వస్తుంది. దొంగతనాలతో పోలీసులకు సంపూ సవాల్ గా నిలిస్తాడు. అన్ని రకాల చెమటోడ్చిన పోలీసులు చివరికి సంపూని పట్టుకుంటారు. సంపూని చూసిన పోలీస్ కమీషనర్ మీరు దొంగగా మారడమేమిటని ఆశ్చర్యపోతాడు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన సంపూ ఎందుకు దొంగగా మారాడు. సమస్యలో కూరుకుపోయిన నీలూని సంపూ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో సంపూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? సంపూ ప్రేమ కథకు 'హృదయ కాలేయం' టైటిల్ సంబంధమేమిటనే అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
నటవర్గం
మార్చు- సంపూర్ణేష్ బాబు
- ఇషికా సింగ్
- కావ్యా కుమార్
- కత్తి మహేష్
పాటల జాబితా
మార్చునేనే బేబీ షాంపూ , గానం. స్పాట్ బాబు
ఎందుకు నాకు ఈ జీవితం (మేల్ వాయిస్) గానం.జునైడ్ కాంతి
పీతే వేసిన బెదరదు , గానం.జునైడ్ బాబు
మీకి మాకీ మాకి మేకి , గానం.జైన్ బాబు
హృదయ వినూ , గానం.రవీంద్ర తేజస్వి
ఎక్కడికి రావాలో చెప్పు(ఫిమేల్ వాయిస్)
నాకు శివరాత్రి , గానం: గీతామాధురి , రాహుల్ సింప్లీగాంజ్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు - స్టీవెన్ శంకర్
- సంగీతం - ఆర్కే