ఇషికా సింగ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా నటి, నృత్యకారిణి, మోడల్.

ఇషికా సింగ్
Ishika Singh.jpg
జననం
ఇషికా సింగ్

(1990-08-10) 1990 ఆగస్టు 10 (వయస్సు 31)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
ఎత్తు1.63 మీటర్లు

జననంసవరించు

ఇషికా సింగ్ రాజపుట్ కుటుంబంలో 1990, ఆగస్టు 10న జన్మించింది. వీరి తల్లిదండ్రులు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు.

విద్యాభ్యాసంసవరించు

కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇగ్నో నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చదివినండి. డిజిసిఎ సర్టిఫైడ్ చేసిన ఏవియానిక్స్ ఇంజనీర్ లైసెన్సు, పైలట్ లైసెన్సులను కలిగివుంది.

మోడలింగ్సవరించు

కాల్గేట్, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, నీరూస్, ఆనంద్ మసాలా, ఫ్రీడం, ఇన్నో ఇంజిన్ ఆయిల్స్, ల్యూసిడ్ డయాగ్నోసిస్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కంట్రీ క్లబ్, గ్లో హెర్బల్ ఫెయిర్నెస్ క్రీమ్ మొదలైన బ్రాండ్లకు మోడిలింగ్ చేసింది.

సినిమారంగంసవరించు

ఇషికా సింగ్, హృదయ కాలేయం[1] సినిమా ద్వారా తెలుగు చలనచిత్రరంగంలోకి ప్రవేశించింది. తరువాత ఆమె ఓ రాత్రి, కొబ్బరి మట్ట, కారులో షికారుకెళితే[2] వంటి తెలుగు సినిమాలలో, వెయిటింగ్ ఇన్ వైల్డర్నెస్ అనే ఆంగ్ల చిత్రంలో నటించింది.

మూలాలుసవరించు

  1. టాలీవుడ్ టైమ్స్. "హృదయ కాలేయానికి "యు"". www.tollywoodtimes.com. Retrieved 13 February 2017.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ. "కారులో షికారుకెళితే..." Retrieved 13 February 2017.[permanent dead link]