సంపూర్ణేష్ బాబు లేదా సంపూ (అసలు పేరు నరసింహాచారి) ఒక తెలుగు సినిమా నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభమైనది.

సంపూర్ణేష్ బాబు
Sampoorneshbabu23.jpg
జననం
నరసింహాచారి

మిట్టపల్లి, సిద్ధిపేట, తెలంగాణా
వృత్తిసినిమా నటుడు
సురరిచితుడుబర్నింగ్ స్టార్
సంపూ
పిల్లలుఇద్దరు కూతుర్లు

నేపథ్యముసవరించు

సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. వీరిది పేద విశ్వకర్మ కుటుంబం. తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. ఇతనికి ఒక అన్న, ఇద్దరు అక్కలు. ఇతను ఏడో తరగతి చదివేటపుడు తండ్రి మరణించాడు. దాంతో అన్న వెండి బంగారం పనికోసం బయట పనిచేస్తుండేవాడు. కొద్ది రోజుల తర్వాత అన్న కుటుంబ పోషణార్థం అదే ఊర్లో వెండి బంగారు పని చేస్తుండేవాడు. పదో తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా తను కూడా అదే పని నేర్చుకున్నాడు. అన్న ఇతనికి దగ్గర్లోని సిద్ధిపేటలో ఒక దుకాణం పెట్టించాడు.[1] ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు. సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.

సినిమాసవరించు

సంపూర్ణేష్ బాబుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. దుకాణం నడుపుతూనే సిద్ధిపేటలో ఉన్న మరో నటుడి దగ్గర నటనలో శిక్షణ కోసం వెళ్ళేవాడు. ఆయన ద్వారా నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవాడు. అలా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. తర్వాత హైదరాబాదులో మరో సంస్థలో నటనలో శిక్షణలో చేరాడు మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు. వాటిలో భాగంగా స్టీఫెన్ శంకర్ అలియాస్ రాజేష్ అనే దర్శకుడితో పరిచయం ఏర్పడింది.[2] సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా హృదయ కాలేయం అనే సినిమా తీయాలని స్టీఫెన్ శంకర్ ఆలోచన. ఈ సినిమా గుర్తింపు కోసం ఇతను తాను ఒక ప్రవాస భారతీయుడిననీ, డబ్బులు బాగా మిగలబెట్టుకుని వచ్చాననీ జీ న్యూస్ ఛానల్ లో ఒక వార్త కూడా ప్రసారం చేయించాడు. ఇదంతా ఇతనికి సాంఘిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టింది. తర్వాత విడుదలైన సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించి ఇతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

మూలాలుసవరించు

  1. టి. ఎన్. ఆర్. "టి. ఎన్. ఆర్ తో సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ". youtube.com. ఐడ్రీం మీడియా. Retrieved 23 April 2017.
  2. 2.0 2.1 ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (9 August 2019). "మోహన్‌బాబుగారి ప్రశంస మర్చిపోలేను". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.
  3. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  4. ఎన్ టీవి, ట్రైలర్స్ (28 July 2019). "'కొబ్బరిమట్ట'లో మూడున్నర నిమిషాల డైలాగ్ ఇదే". NTV Telugu. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.
  5. ఈనాడు, సినిమా (5 August 2019). "ఈవీవీకి 'కొబ్బరిమట్ట' అంకితం". www.eenadu.net. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.

బయటి లంకెలుసవరించు