హెన్రీ కిసింజర్
హెన్రీ ఆల్ఫ్రెడ్ కిస్సింజర్(Henry Alfred Kissinger) (మే 27, 1923 - నవంబరు 29, 2023) అమెరికన్ దౌత్యవేత్త, రాజకీయ శాస్త్రవేత్త, భౌగోళిక రాజకీయ సలహాదారు, రాజకీయవేత్త, రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్ష పరిపాలనలలో అమెరికా దేశ యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశాడు. నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి. అమెరికా దేశ చరిత్రలో అత్యంత ప్రభావిత,పేరు పొందిన విదేశాంగ మంత్రిగా కిసింజర్ ను పేర్కొంటారు.1973-77 సంవత్సరాలలో అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. వియత్నాం యుద్ధంలో అమెరికా సైన్యం ప్రమేయానికి ముగింపు పలకడంలో సహాయపడినందుకు 1973 సంవత్సరంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలకు ఆయన కృషి చేశాడు[1].100 ఏళ్ళ జీవించిన కిసింజర్ 29 నవంబరు 2023 కెంటకీ లోని స్వగృహంలో మరణించినట్లుగా కిసింజర్ అసోసియేట్స్ ప్రకటించారు[2].
జీవితం
మార్చుకిసింజర్ 1923 మే 7న జర్మనీలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. 1938 లో యూదులపై నాజీ హింస నుండి తప్పించుకోవడానికి 15 సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా దేశంకు వలస వచ్చి, తర్వాత 1943లో అమెరికా పౌరసత్వాన్ని పొంది, కొంతకాలం అమెరికా సైన్యంలోని గూఢఛారి విభాగంలో సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత, కొంతకాలం ఆక్రమిత జర్మనీలో అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించాడు. తిరిగి అమెరికా చేరిన కిసింజర్ హార్వర్డ్ వర్సిటీలో బి.ఎ (1950),పి.హెచ్.డి (1954) పొందాడు. 1954లో అధ్యాపకుడిగా చేరి, 1962లో ప్రభుత్వ ప్రొఫెసర్ గా, 1959 నుంచి 1969 వరకు డిఫెన్స్ స్టడీస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ప్రభుత్వ ఏజెన్సీలకు కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించారు. నిక్సన్ పాలనలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగారు. ఆయన సాధించిన ప్రధాన దౌత్య విజయాలలో చైనా, సోవియట్ యూనియన్, వియత్నాం, సోవియట్ యూనియన్ తో అమెరికా దేశ సంబంధాల నెలకొలిపే విధానాన్ని అభివృద్ధి చేశాడు, ఇది 1969 లో వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలకు (సాల్ట్) దారితీసింది. అతను 1971 చివరిలో జరిగిన భారత-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ దేశ అనుకూల వైఖరి విధానాన్ని అనుసరించాడు[3].
రాజనీతి
మార్చుజర్మనీలో పుట్టి.. అమెరికాలో పెరిగి.. హార్వర్డ్ లో చదివి.. అక్కడే సుదీర్ఘ కాలం పనిచేసి.. ఆపై విదేశాంగ విధానంలో తనదైన ముద్ర వేసిన కిసింజర్ అమెరికా దేశ 12 మంది అధ్యక్షులకు జాన్ ఎఫ్ కెన్నడీ నుంచి జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ వరకు ఆయన సలహాలివ్వడం, అతనికి ఉన్న దౌత్య చరిత్రపై అవగాహన, అమెరికా చరిత్రలో, దౌత్యరంగంలో కీలక సమయంలో అధ్యక్షుడు రిచర్డ్ ఎం.నిక్సన్ తర్వాత అధికారంలో రెండో స్థానంలో నిలిచాడు[4]. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం సమయంలో అమెరికా దేశం పాకిస్థాన్ వైపు మళ్లించే వహించేలా అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ను ప్రభావితం చేశాడు. 1973లో అరబ్- ఇజ్రాయెల్ దేశాల మద్య జరిగిన ఘర్షణలలో అత్యంత కీలక పాత్ర వహించాడు. పూర్వ సోవియట్ యూనియన్‌తో సన్నిహితంగా ఉంటున్న చైనాను అమెరికా వైపు తీసుకు రావడంలో కిసింజర్ సఫలీకృతులయ్యాడు,1973లో చైనా వెళ్లి మావో ను కలిసినాడు. 2023 మే నెలలో చైనాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలవడం జరిగింది[5] . 2023 జూలై నెలలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సదస్సులో కిసింజర్ పాల్గొన్నాడు. ఏది ఏమైనా అగ్ర రాజ్యం అయిన అమెరికా విదేశాంగ విధానంలో తనదైన ముద్ర వేసిన హెన్రీ కిసింజర్ ఆ దేశ చరిత్రలో నిలిచిపోతాడు[6].
అవార్డులు
మార్చుకిస్సింజర్ అమెరికా విదేశాంగ విధానం, అంతర్జాతీయ వ్యవహారాలు, దౌత్య చరిత్రపై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశాడు. ఆయనకు లభించిన పురస్కారాలలో గుగ్గెన్ హీమ్ ఫెలోషిప్ (1965-66), ప్రభుత్వ, రాజకీయ ,అంతర్జాతీయ వ్యవహారాల రంగాలలో ఉత్తమ పుస్తకానికి వుడ్రో విల్సన్ బహుమతి (1958), అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అవార్డు (1973), ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అసోసియేషన్ థియోడర్ రూజ్వెల్ట్ అవార్డు (1973), వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ డ్వైట్ డి ఐసెన్హోవర్ విశిష్ట సేవా పతకం (1973), ఉన్నాయి. హోప్ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ (1973), ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ (1977), మెడల్ ఆఫ్ లిబర్టీ (1986) పలు పురస్కారాలు లభించాయి[7].
రచనలు
మార్చుకిస్సింజర్ అంతర్జాతీయ కన్సల్టెంట్ గా, రచయితగా, లెక్చరర్ గా రాణించాడు. 1983 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, కిస్సింజర్ ను నేషనల్ కమిషన్ ఆన్ సెంట్రల్ అమెరికా చైర్మన్ గా నియమించాడు. 1980వ దశకంలో అధ్యక్షుడి ఫారెన్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు, కమిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో కూడా పనిచేయడం జరిగింది. కిస్సింజర్ రచించిన పుస్తకాలలో అమెరికన్ ఫారిన్ పాలసీ (1969), ది వైట్ హౌస్ ఇయర్స్ (1979), ఫర్ ది రికార్డ్ (1981), ఇయర్స్ ఆఫ్ అప్ హీవల్ (1982), డిప్లమసీ (1994), ఇయర్స్ ఆఫ్ రెన్యువల్ (1999), డస్ అమెరికా నీడ్ ఏ ఫారెన్ పాలసీ ?: టువార్డ్ ఏ డిప్లమసీ ఫర్ ది 21 స్ట్ సెంచరీ (2001), ఎండింగ్ ది వియత్నాం వార్: ఏ హిస్టరీ ఆఫ్ అమెరికా ఇన్వాల్మెంట్ ఇన్ అండ్ ఎక్సట్రీకేషన్ ఫ్రమ్ ది వియత్నాం వార్ (2001), క్రైసిస్: ది అనాటమీ ఆఫ్ టూ మేజర్ ఫారిన్ పాలసీ క్రైసిస్ (2003), ఆన్ చైనా (2011), వరల్డ్ ఆర్డర్ (2014). విత్ ఎరిక్ ష్మిత్ అండ్ డేనియల్ హట్టెన్లోచర్, ది ఏజ్ ఆఫ్ ఏఐ: అండ్ అవర్ హ్యూమన్ ఫ్యూచర్ (2021) మొదలైనవి ఉన్నాయి[3].
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (2023-12-01). "అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కిసింజర్ కన్నుమూత". www.ntnews.com. Retrieved 2023-12-01.
- ↑ ABN (2023-12-01). "Henry : హెన్రీ కిసింజర్ కన్నుమూత". Andhrajyothy Telugu News. Retrieved 2023-12-02.
- ↑ 3.0 3.1 "Henry Kissinger | Biography, Accomplishments, Books, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2023-12-01. Retrieved 2023-12-01.
- ↑ "Henry Kissinger Is Dead at 100; Shaped the Nation's Cold War History". https://www.nytimes.com/. 01 December 2023. Retrieved 01 December 2023.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(help); External link in
(help)|website=
- ↑ "చైనాలో అమెరికా వృద్ధ సింహం.. జిన్‌పింగ్‌తో వందేళ్ల కిసింజర్ భేటీ.. అంతరార్థమేంటో?". ETV Bharat News. Retrieved 2023-12-01.
{{cite web}}
: zero width space character in|title=
at position 34 (help) - ↑ ABN (2023-12-01). "Henry : హెన్రీ కిసింజర్ కన్నుమూత". Andhrajyothy Telugu News. Retrieved 2023-12-01.
- ↑ "The Nobel Peace Prize 1973". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-01.