హేమ. ఎమ్ ప్రముఖ రంగస్థల నటి.

హేమ. ఎమ్

జననం మార్చు

వీరు 1977 డిశంబరు 19న శ్రీమతి మహాలక్ష్మి, డి.ఎమ్. నాయుడు దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు.

రంగస్థల ప్రవేశం మార్చు

1995 సంవత్సరం తన గురువుగారైన ఎల్. సత్యానందం దర్శవత్వంలోని ‘బొమ్మలాట’ నాటకంతో తన రంగస్థల నటజీవితాన్ని ప్రారంభించారు. ఈవిడ ప్రజా నాట్యమండలి బృదంతో కలిసి రైలుబండి, లెట్ ఇట్‌బి వేకస్ట్, గారడి లాంటి వీధి నాటికలలో శతాధిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఎయిడ్స్, పల్స్ పోలియో, మలేరియా లాంటి వాటిమీద ప్రజలకు అవగాహన కల్పించే వీధి నాటకాల్లో పాత్రధారణ గావించారు.

రంగస్థల నటిగా దాదాపు 15 సంవత్సరాల అనుభవం గడించిన ఈవిడ పలు పరిషత్తులలో ఉత్తమ నటిగా, సహాయనటిగా, ప్రతినాయకిగా, శతాధిక బహుమతులను అందుకున్నారు. 2002లో కళాజగతి మాసపత్రికవారు కళాజగతి అవార్డును ప్రదానంచేశారు.

డిప్లమా ఇన్ యాక్టంగ్, డిప్లమా ఇన్ డైరెక్షన్ లో ఆంధ్రా యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ వర్క్ షాప్ లో 60రోజులు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఒక ఏడాదిపాటు శిక్షణ పొందారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ఆడిషన్ లో ‘బి’ హైగ్రేడ్ స్థానాన్ని పొందారు.

రావూజీ, మందులు, అత్తిలి కృష్ణారావు, చలసాని కృష్ణప్రసాద్, ప్రసాదమూర్తి ముదనూరి, కృష్ణచైతన్య, మిశ్రో, కె.ఎస్.టి. శాయి, కె.జి.ఆర్. గాంధి, నాయుడు గోపి లాంటి ప్రముఖ దర్శకుల నాటకాల్లో నటించి నటనలోని మెళకువలను నేర్చుకున్నారు.

నటించినవి మార్చు

  1. అతనికోసం ఇతను
  2. మపకేయకే చందమామ
  3. పోస్టర్
  4. శ్రీకారం
  5. ఆరణి
  6. చదరంగం
  7. కుక్కపిల్ల దొరికింది
  8. హుళక్కి ఇచ్చుటలో వున్న హాయి
  9. భారతరత్న
  10. దర్పణం
  11. ఒంటెద్దు బండి
  12. అంబేద్కర్
  13. మబ్బుల్లో బొమ్మ
  14. కకావికలం
  15. మైదానం
  16. జీవన సంధ్య
  17. పండగొచ్చింది
  18. నిమజ్జనం
  19. అనంతరాగం
  20. పడమటిగాలి
  21. దిగేమ్
  22. వందేమాతరం
  23. సావిత్రి సవాల్
  24. అంతర్మథనం
  25. పెద్ద బాలశిక్ష
  26. అంతరాలు
  27. తులసీతీర్థం
  28. భరతవాక్యం
  29. మధ్యతరగతి మందహాసం
  30. కాబూలీవాలా
  31. మనోధర్మం
  32. అతిథి దేవుళ్లోస్తున్నారు జాగ్రత్త
  33. సిద్ధార్థ
  34. అద్దంలో చందమామ
  35. శాంతి యుద్ధం
  36. తలుపు
  37. ఇక్కడ కాసేపు ఆగుదాం
  38. పితృవనం
  39. మానవత్వానికి మరో కోణం
  40. లగాబుస్ లచ్చన్న
  41. కాలుష్యం
  42. పులుస్టాప్ కాదు కామా

మూలాలు మార్చు

  • హేమ. ఎమ్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 129.
"https://te.wikipedia.org/w/index.php?title=హేమ._ఎమ్&oldid=2682788" నుండి వెలికితీశారు