ఎస్.కె. మిశ్రో

నటుడు

ఎస్.కె. మిశ్రో (సుశీల్ కుమార్ మిశ్రో) నటుడు, నాటక రచయిత, దర్శకుడు.

ఎస్.కె. మిశ్రో
Skmisro.png
జననంజనవరి 4, 1945
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాటకరంగ నటుడు, నాటక రచయిత, దర్శకుడు,
జీవిత భాగస్వామిసచలాదేవి మిశ్రో
తల్లిదండ్రులు
  • శశి భూషణ్ మిశ్రో (తండ్రి)
  • సరోజిని దేవి (తల్లి)

జననంసవరించు

ఇతను 1945, జనవరి 4వ తేదీన శశి భూషణ్ మిశ్రో, సరోజిని దేవి దంపతులకు విశాఖపట్నంలో జన్మించాడు.

ఉద్యోగంసవరించు

డిగ్రీ పాసయ్యాక పోర్టు ట్రస్ట్, విశాఖపట్నం లో ఉద్యోగంలో చేరాడు.

రంగస్థల ప్రస్థానంసవరించు

చదువుకునే రోజుల్లోనే (1960) నాటకాలలో నటిస్తూ పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో నటన, దర్శకత్వం పై పూర్తి అవగాహన పెంచుకొని, డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ పట్టా పొందాడు.

1956లో నవ్యభారతి కళామందిరం, 1968లో రసమయి నట సమాఖ్య సంస్థలను స్థాపించి, స్వీయ దర్శకత్వంలో నాటకాలు తయారుచేసే పరిషత్తులలో పాల్గొని ఉత్తమ ప్రదర్శనకు, నటనకు, దర్శకత్వానికి బహుమతులు సంపాదించారు. ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల కళలశాఖకు ప్రథమ దర్శకుడు కె. వెంకటేశ్వరరావు వద్ద వాచికం, నటన, దర్శకత్వ పోకడలు పుణికిపుచ్చుకున్నాడు.

1970లో ఢిల్లీలో 26 దేశాలు పాల్గొన్న కామన్ వెల్త్ యువజనోత్సవాలలో పాల్గొని గణేష్ పాత్రో రచించిన ‘పావలా’ నాటికను అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించాడు. 1972లో ఢిల్లీలోని పూనా నేషనల్ ఇన్సిట్యూట్ నిర్వహించిన బహుభాషా నాటకోత్సవాలలో పాల్గొని, తను ప్రదర్శించిన ‘త్రివేణి’ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి పొందటమే కాకుండా తను నటించిన నేస్తలింగం పాత్రకు ఉత్తమ నటుడి బహుమతి కూడా పొందాడు. మిశ్రో వాచికాభినంయం చాలా విభిన్నంగా ఉంటుంది. అవసరం మేరకు దృశ్యబంధ నిర్మాణం, రంగోద్దీపనం, పాత్రల కదలికలు, రంగస్థలంపై ఉన్న వస్తువులను వాడుకునే పద్ధతి, చాలా పకడ్బందీగా నిర్వహించేవాడు. మిశ్రో రచయితగా ప్రేమజీవులు, ద్రౌపది, పితృదేవోభవ నాటకాలను, ఆలోచించండి అనే నాటికను, కొన్ని గేయాలను రచించాడు.

దర్శకత్వం వహించిన నాటకాలుసవరించు

  1. వీలునామా
  2. చెరపకురా చెడెదవు
  3. రక్తదానం
  4. అన్నాచెల్లెలు
  5. అసుర సంధ్య
  6. అరణి
  7. వేటకుక్కలు
  8. మళ్ళీ మధుమాసం
  9. హెచ్చరిక
  10. భలే పెళ్ళి
  11. ఈనాడు
  12. కనక పుష్యరాగం
  13. ఋత్విక్

దర్శకత్వం వహించిన నాటికలుసవరించు

  1. తెరచిరాజు
  2. దొరికితే దొంగలు
  3. కాలధర్మం
  4. కొడుకు పుట్టాల
  5. పావలా
  6. లాభం
  7. ధర
  8. ఎంతెంత దూరం
  9. భజంత్రీలు
  10. నిర్మానుష్యం
  11. తుఫాను
  12. బెత్తం మనిషి
  13. ధర్మ సూక్ష్మం
  14. విషాదం
  15. చెప్పుకింద పూలు
  16. వంశంవృక్షం
  17. యజ్ఞం
  18. నేనూ మనిషినే

సినిమా రంగంసవరించు

అంతేకాదు తన నటనాపరిధిని విస్తృతి పరుచుకోవడానికి 1973లో ఆడది చిత్రంలో నటుడిగా ప్రవేశించి దాదాపు నలభై చిత్రాల్లో నటించాడు. మరో చరిత్ర (1978) సినిమాలో సరిత బావగా నటించాడు. [1]

నటించినవి

టివి రంగంసవరించు

డిటెక్టివ్ సుబ్బారావు, మల్లాది రామకృష్ణ శ్రాస్త్రి కథలు, భరాగో కథలు, వండర్ బాయ్ మొదలైన టి.వి సీరియల్స్ లో కూడా నటించాడు.

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. ఐ.ఎం.డి.బి.లో మిశ్రో పేజీ.
  2. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
  3. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 6 June 2020.

ఇతర లింకులుసవరించు