హైడ్రోకార్బన్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "ఉదకర్బనం." ఉదకర్బనాలలో కొన్నింటిని యంత్రాలలో ఇంధనంగా వాడతారు. ఉదాహరణకి మెతేను, ఎతేను వాయువులు ఈ జాతివే. దీపాలు వెలిగించుకుందికి వాడే కిరసనాయిలు, కార్లలో వాడే గేసలీను (పెట్రోలు) ఈ జాతివే.

కార్బోహైడ్రేట్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "కర్బనోదకం." కర్బనోదకాలలలో కొన్ని జీవుల శరీరాలలో ఇంధనంగా పని చేస్తాయి. ఉదాహరణకి పిండి పదార్థాలు ఈ జాతివే. గ్లూకోజు, సెల్యులోజు కూడా ఈ జాతివే.