హైడ్రోమీటర్ ను ద్రవముల విశిష్టగురుత్వము కనుగొనుటకు ఉపయోగిస్తారు.అనగా ద్రవముల సాపేక్ష సాంద్రతను కనుగొనుటకు ఉపయోగిస్తారు.

హైడ్రోమీటర్
హైడ్రోమీటర్
ఇతర పేర్లుహైడ్రోమీటర్
ఉపయోగాలుద్రవముల విశిష్టగురుత్వం కనుగొనుటకు
ఆవిష్కర్తహైపాటియా(అలెగ్జాండ్రియా)
హైడ్రోమీటర్

నిర్మాణముసవరించు

ఇది సాధారణంగా స్థూపాకారపు కాడ కలిగి ఉంటుంది. దీని క్రింది భాగములో పాదరసం లేదా సీసముతో నిండియున్న బల్బు ఉంటుంది. కాడపై ఒక స్కేలు క్రమాంకనం చేయబడి ఉంటుంది. ఈ పరికరం ద్రవంలో నిలువుగా తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఈ పరికరమును ఏ ద్రవం విశిష్ట గురుత్వం కనుగొనాలనుకుంటున్నామో దానిలో ఉంచినపుడు అది కొంత వరకు మునిగి కొంత భాగం తేలుతుంది. ద్రవం యొక్క తలం హైడ్రోమీటరులో ఏ భాగమును తాకుతుందో ఆ విభాగము ఆ ద్రవం యొక్క విశిష్ట గురుత్వం అవుతుంది.

నియమంసవరించు

ఈ పరికరం ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అనగా ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా మునిగినపుడు వస్తువుపై కలుగజెయబడిన ఊర్థ్వ ఒత్తిడి ఆ వస్తువు కోల్పోయిన ద్రవ భారవుతో సమానంగా ఉంటుంది.

వివిధ హైడ్రోమీటర్లు,వాటి ఉపయోగంసవరించు

ప్రత్యేక హైడ్రోమీటర్లు
రకం ఉపయోగాలు
లాక్టోమీటర్ పాల స్వచ్ఛత తెలుసుకొనుటకు
ఆల్కహాలోమీటర్ ద్రవములలో ఆల్కహాల్ బలం తెలుసుకొనుటకు
శాకరోమీటర్ ద్రావణంలో చక్కెర శాతం తెలుసుకొనుటకు
థెర్మో హైడ్రోమీటర్ పెట్రోలియం ఉత్పత్తుల సాంద్రత తెలుసుకొనుటకు
యూరినోమీటర్ మూత్ర పరీక్ష చేయుటకు
అసిడోమీటర్ ఆమ్లం యొక్క విశిష్టగురుత్వం కనుగొనుటకు

యివి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు