హైసిస్

భూమి యొక్క పరిశీలన ఉపగ్రహం
(హైసిస్ ఉపగ్రహం నుండి దారిమార్పు చెందింది)

హైసిస్ ఉపగ్రహాం నుఇస్రో తయారు చేసినది.ఇది భూ పర్యవేక్షణ ఉపగ్రహం.ఇస్రో సంస్థ ఈ భూపర్యవేక్షణ ఉపగ్రహాని ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలో ఉన్న సతిష్ ధవన్ అంతరిక్షకేంద్రం నుండి అంతరిక్షంలోని కక్ష్యలో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం, అటవీప్రాంతాలు, తీర మండలాల అంచనా, భూగర్భ జలాలు, నేల, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించిన వాటికి సంబంధించిన ఇమేజింగ్ సేవలు అందిస్తుంది.[1][2] మిలిటరి వ్యవస్థకు అవసరమైన సేవక్\లు కూడా పొందవచ్చ్గును.[3]

హైసిస్ ఉపగ్రహం


హైసిస్ ఉపగ్రహ వివరాలు మార్చు

హైసిస్ ఉపగ్రహాన్ని ఇస్రో తయారు చేసినది.ఇది భూ పర్యవేక్షణ ఉపగ్రహం.ఇస్రో తయారు చేసి ప్రయోగించిన ఉపగ్రహాల్లో తక్కువ బరువున్న ఉపగ్రహాల్లో హైసిస్ ఒకటి. హైసిస్ బరువు ఇంధనంతో సహా 380 కిలోలు. ఇది మిని శాటలైట్-2(IMS-2)రకానికి చెందిన ఉపగ్రహం.ఇది భూమికి 636 కిలో మీటర్ల ఎత్తులో,97.957 డిగ్రీల ఏటవాలులో సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమించును.దీని జీవిత కాలం 5 సంవత్సరాలు.ఉపగ్రహం పరిమాణం 2.158 X 1.386 X 1.121 మీటర్లు.విద్యుతు శక్తి 730 వాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ వున్నది.ఉపగ్రహంలో హైయర్ స్పేక్ట్రల్ ఇమేజర్ (VNIRమరియు SWIR బ్యాండ్స్) వున్నది.దీని ద్వారా 630 కిలోమీటర్ల పైభాగం నుంచి కలర్ చిత్రాలు క్లారిటీగా వీక్షించవచ్చు. భూ ఉపరితలాన్ని పరిశీలించడం, వ్యవసాయం, నీటి లభ్యత తదితర అంశాలకు సంబంధించిన పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.

ఉపగ్రహ ప్రయోగం మార్చు

హైసిస్ ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి సీ-43 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపారు.పిఎస్‌ఎల్‌వి సీ-43 నౌక కోర్ అలోన్ రకపు పిఎస్‌ఎల్‌విశ్రేణికి చెందిన వాహక నౌక.అనగా ఈ రకపు వాహక నౌకకు స్ట్రాపన్ బూస్టరు ఇంధన చోదకాలు ఉండవు.హైసిస్ ఉపగ్రహం తో పాటు 8 విదేశాలకు చెందిన 30 లఘు/సూక్ష్మ ఉపగ్రహాలను కూడా పిఎస్‌ఎల్‌వి సీ-43 వాహక నౌక ద్వారా అంతరిక్షకక్ష్యలోకి పంపారు.వాటి మొత్తం బరువు 261.5 కిలోలు మాత్రమే అనగా మొత్తం ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు మాత్రమే.అందువలన కోర్ అలోన్ రకపు రాకెట్ ను ఉపయోగించారు.హైసిస్ ఉపగ్రహన్ని 636 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి పంపాగా విదేశీ ఉపగ్రహాలను ఒకగంట తరువాత 504 కిలో మీటర్లేత్తులో కక్ష్యలోకి పంపారు.ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన 17:29 నిమిషాలకు హైసిస్ ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.[4] ఉపగ్రహాన్ని 29 నవంబరు(గురువారం) 2018 న ఆంధ్రప్రదేశ్ లోని శ్రిహరికోట అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు.[5]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Upagrah July–September 2018". ISAC.gov.in. 9 November 2018. Archived from the original (PDF) on 9 November 2018. Retrieved 9 November 2018.
  2. "ISRO Develops Optical Imaging Detector Array for Hyperspectral Imaging Applications – ISRO". www.isro.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 11 నవంబరు 2018. Retrieved 10 November 2018.
  3. "Isro to launch hyperspectral imaging sat with 30 foreign satellites on Nov 29 - Times of India". The Times of India. Retrieved 2018-11-25.
  4. "PSLV-C43 / HysIS Mission". isro.gov.in. Archived from the original on 2018-11-26. Retrieved 2018-11-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Isro launches India's first hyperspectral imaging satellite". timesofindia. Retrieved 2018-11-29.
"https://te.wikipedia.org/w/index.php?title=హైసిస్&oldid=3800157" నుండి వెలికితీశారు