పిఎస్‌ఎల్‌వి సీ-43
పిఎస్‌ఎల్‌వి సీ-43ఉపగ్రహ వాహక నౌక భారతీయ అంతరిక్ష ప్రయోగ సంస్థఇస్రో తయారు చేసి ప్రయోగించిన రాకెట్.ఈ రాకెట్ ను ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో వున్న శ్రీహరికోట లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 29 నవంబరు(గురువారం) 2018 ఉదయం 9:58 గంటలకు,ఒకటవ ప్రయోగ వేదికనుండి ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఉపగ్రహాల మొత్తం బరువు641.5 కిలోలు. ఇందులో భారత దేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహం బరువు 380 కిలోలు. మిగతా విదేశాలకు చెందిన ఉపగ్రహాల మొత్తం బరువు 261.5 కిలోలు.[1]
పిఎస్‌ఎల్‌వి సీ-43 ఉపగ్రహ వాహక నౌక
మార్చుపిఎస్ఎల్వి సీ-43 పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన కోరాలోన్ రకపు రాకెట్. అనగా ఇందులో మొదటి ఘన ఇంధన దశకు అదనంగా బూస్టరు స్ట్రాపన్ మోటర్లను ఉపయోగిచరు.కక్ష్యలో ప్రవేశ పెట్టు ఉపగ్రహాల మొత్తం బరువు ఒకటన్ను కన్న తక్కువ ఉండటం వలన బూస్టరు స్ట్రాపన్ మోటర్లు అవసరం లేదు.ఈ వాహకనౌక లో కూడా మిగతా పిఎస్ఎల్వి రాకెట్‌ల వలే నాలుగు దశలు వుండును.మొదటి, మూడో దశలో ఘన ఇంధనాన్ని,రెండవ, నాల్గవ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు.[2]
మొదటి దశ
మార్చుమొదటి దశను PS1 అంటారు.మొదటి దశ కోర్ ఆలోన్ ఘన ఇంధనదశ లో 138 టన్నుల ఘన ఇంధనం నింపబడినది.ఇంధనం HTBP అధారిత ఇంధనం. దశ పొడవు 20 మీటర్లు.దశ వ్యాసం 2.8 మీటర్లు.కోర్ ఆలోన్ కాబట్టి స్ట్రాపన్ బూస్టరు ఇంజనులు లేవు.[2]
రెండవ దశ
మార్చురెండవ దశను PS2 అంటారు.రెండవ దశ ద్రవ ఇంధనదశ.ఇందులో 42 టన్నుల ద్రవ ఇంధనం నింపబడినది.ఈ దశ వ్యాసం 2.8 మీటర్లు. దశ పొడవు 12.8 మీటర్లు. ఉపయోగించిన ఇంధనం UH25+ N2O4
మూడవ దశ
మార్చుమూడవ దశను HPS3 అంటారు.మూడవ దశలో కూడా ఘన ఇంధనం నింపబడినది. 7.6 టన్నుల ఘన ఇంధనం నింపబడి వున్నది.పొడవు 3.6 మీటర్లు.దశ వ్యాసం 2.0 మీటర్లు.ఇంధనం HTBP అధారిత ఇంధనం.[2]
నాల్గవ దశ
మార్చుఈ దశను PS4 అంటారు.ఈ చివరి నాల్గవ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం వున్నది. ఈ భాగం పొడవు 3 మీటర్లు., వ్యాసం 1.34 మీటర్లు.ఉపయోగించిన ద్రవ ఇంధనం MMH+MON3.నాలుగవ దశ పైభాగంలో 31 ఉపగ్రహాలు పొందికగా అమర్చబడి వుండి, వీటి చుట్టూ ఉష్ణ కవచం బిగింపబడి వున్నది. పిఎస్ఎల్వి సీ-43 ఎత్తు 44.4 మీటర్లు.ఇంధనంతో కలిపి పిఎస్ఎల్వి సీ-43 బరువు 320 టన్నులు.[2]
ప్రయోగ వివరాలు
మార్చుపిఎస్ఎల్వి సీ-43 ప్రయోగానికి కౌట్ డౌన్ 28 నవంబరు 2018(బుధవారం) ఉదయం 5:57 గంటలకు ప్రారంభమై,మరుసటి రోజు గురువారం 29 వతేది ఉదయం 9:58 గంటలకు విజయంతంగా జరిగినది.కౌట్ డౌన్ ముగిసిన వెంటనే పిఎస్‌ఎల్‌వి సీ-43 మంటలు కక్కుతూ గగనం వైపు దూసుకెళ్లినది.17నిమిషాల27 సెకన్లకు హైసిస్ ను కక్ష్యలోఫ్ 636 కిలో మిటర్లేత్తులో ప్రవేసపెట్తినది.తరువాత ఒక గంత తరువాత 504 కిలో మీట్ర్ల ఎత్తులో మిగిలిన 30లఘు ఉపగ్రహాలను వేరువేరు కక్ష్యల్లో విజయవంతంగా ప్రవేశ పెట్త బడినవి.ఇప్పటికి వరకు ఇలా మొదటి ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టి,నతరువాత మిగిలి ఉపగ్రహాలను వేరే ఎత్తులో ఒక గంట తరువాత ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
ప్రయోగించిన ఉపగ్రహాల వివరాలు
మార్చుపిఎస్ఎల్వి సీ-43 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో380 కిలోల బరువు వున్న భారతీయ హైసిస్(హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు మొత్తం 261.5 కిలోల బరువున్న 8విదేశాలకు చెందిన 30 చిన్న/సూక్ష్మ ఉపగ్రహాలు వున్నవి.
విదేశాలకు చెందిన ఉపగ్రహాలు
మార్చుఇందులో అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు వున్నవి.ఇందులో ఫోక్ శాట్-3R పేరుతో 16 ఉపగ్రహాలు,లీమూర్ ఎస్ పేరులో నాలుగు ఉపగ్రహాలు, హెచ్ శాట్-1,గ్లోబల్ శాట్-1, సిసిరో-1.ఇక కెనడా కు చెందిన కెప్లర్,కొలంబియాకు చెందిన ఫ్యాక్ శాట్,ఫిన్‌లాండ్ కు చెందిన రియక్టరు హలో వరల్డ్ ఉపగ్రహాలు.అలాగే ఆస్ట్రేలియాకు చెందిన సెంటూరి,మలేసియాకు చెందిన ఇన్నోశాట్ -2,నెదర్లాండ్ కు చెందిన హైబర్ శాట్,స్పెయిన్ కు చెందిన త్రీక్యాట్ శాట్-1 వున్నవి.
భారత దేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహ వివరాలు
మార్చుహైసిస్ ఉపగ్రహం ఇస్రో తయారు చేసినది.ఇది భూ పర్యవేక్షణ ఉపగ్రహం.ఇస్రో తయారు చేసి ప్రయోగించిన ఉపగ్రహాల్లో తక్కువ బరువున్న ఉపగ్రహాల్లో హైసిస్ ఒకటి.ఇది మిని శాటలైట్-2(IMS-2)రకానికి చెందిన ఉపగ్రహం.ఇది భూమికి 636 కిలో మీటర్ల ఎత్తులో,97.957 డిగ్రీల ఏటవాలులో సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమించును.దీని జీవిత కాలం 5 సంవత్సరాలు.ఉపగ్రహం పరిమాణం 2.158 X 1.386 X 1.121 మీటర్లు.విద్యుతు శక్తి 730 వాట్స్, లిథియం అయాన్ బ్యాటరీ వున్నది.ఉపగ్రహంలో హైయర్ స్పేక్ట్రల్ ఇమేజర్ (VNIR, SWIR బ్యాండ్స్) వున్నది.దీని ద్వారా 630 కిలోమీటర్ల పైభాగం నుంచి కలర్ చిత్రాలు క్లారిటీగా వీక్షించవచ్చు. భూ ఉపరితలాన్ని పరిశీలించడం, వ్యవసాయం, నీటి లభ్యత తదితర అంశాలకు సంబంధించిన పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.[1]
బయటి వీడియో లింకులు
మార్చుఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C43". oneindia.com. Retrieved 2018-11-29.
- ↑ 2.0 2.1 2.2 2.3 "PSLV-C43 / HysIS Mission Brochure". isro.gov.in. Retrieved 2018-11-29.