హోర్హె లువీస్ బోర్హెస్

ఆర్జెంటినా లో చిన్న చిన్న కత ల రచయితా ,కవి మరియు అనువాదకుడు ,స్పానిష్ భాష లో విద్వాంసుడు

హోర్హె ఫ్రన్సీస్కొ ఇసిదోరొ లువీస్ బోర్హెస్ (స్పానిష్: Jorge Francisco Isidoro Luis Borges, ఆగష్టు 24, 1899 - జూన్ 14, 1986) ఒక అర్జెంటీనా రచయిత. ఇయన చిన్న కథలు, వ్యాసాలు, కవితలు, సాహిత్య విమర్శలు, అనువాదాలు, మొదలైన విభాగాలలో నిమగ్నమై ఉండేవారు,

హోర్హె లువీస్ బోర్హెస్
Jorge Luis Borges

1951 లో బోర్హెస్
జననం: హోర్హె ఫ్రన్సీస్కొ ఇసిదోరొ లువీస్ బోర్హెస్
(1899-08-24)1899 ఆగస్టు 24
బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా.
మరణం:1986 జూన్ 14(1986-06-14) (వయసు 86)
జెనీవా, స్విట్జర్లాండ్.
వృత్తి: రచయిత, కవి, విమర్శకుడు, లైబ్రేరియన్
జాతీయత:అర్జెంటీనా
ప్రభావితులు:సెసార్ ఐర, పాల్ ఆస్టర్, పౌలో కోయెల్హో, రికార్డో పిగ్లీ, జీన్ బాడ్రిలార్డ్, అడాల్ఫో బ్యో కెసరెస్, రాబర్టో బోలనో, గ్లన్నిన బ్రస్చి, ఇటాలో కాల్వినో, జులియో కర్ట్జర్, ఫిలిప్ కె. డిక్, అమ్బెర్టో ఎకో, మైఖేల్ పౌకాల్ట్, కార్లోస్ ప్యూయెంటెస్, డేనిలో కిస్, స్టానిష్లా లెమ్, ఓరన్ పాముక్, జార్జెస్ పార్క్, థామస్ పేన్కోన్, , జీన్ వుల్ఫ్, విలియం గిబ్సన్, డేవిడ్ ఫోస్టర్ వాలెస్, హార్లాన్ ఎలిసన్, జాన్ బార్త్

ఇయన 1899 ఆగష్టు 24 వ సంవత్సరంలో అర్జెంటీనాలో ఉన్న బ్యూనస్ ఎయిరీస్ లో జన్మించారు. ఇయనది అర్జెంటీనా చరిత్రలో ప్రసిద్ధ పొందిన సైనిక అధికారుల సంప్రదాయాక కుటుంబం. బోర్హెస్ యొక్క తల్లి లీయోనోర్ అసెవెడో స్వారెస్, సాహిత్య ఆసక్తి గల ఒక న్యాయవాది, మానసిక శాస్త్ర ఉపాధ్యాయురాలు ఆమె. ఈమెకూడా రచయిత కావాలని ప్రయత్నించి ఓడిపోయిన వారె.

బోర్హెస్ యొక్క తండ్రి గారి కంటి చూపు మందగించటం వల్ల న్యాయస్థానం నుండి విరమణ స్వీకరించి 1914 లో, కుటుంబంతో జెనీవాకు వెళ్ళారు. తండ్రి జెనీవాలో ఒక వైద్యుడు నుండి చికిత్స పొందారు. యువ బోర్హెస్, అతని సోదరి నోరాను జెనీవాలో బడికి వెళ్ళేవారు. యువ బోర్హెస్ అక్కడ ఫ్రెంచ్ భాష, జర్మన్ భాష నేర్చుకున్నారు. అర్జెంటీనా నుండి దేశంలో గందరగోళల వల్ల 1921 నాటివరకు జెనీవాలో నే నివసించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బోర్హెస్ కుటుంబం మూడు సంవత్సరాలు లుగానో, బార్సిలోనా, మాజోర్కా, సెవిల్లే, మాడ్రిడ్ నగరాలలో నివసించారు.