డ్రైవర్ మోహన్
తమిళభాషలో వెలువడిన కావల్‌కారన్ అనే సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి డ్రైవర్ మోహన్ అనే పేరుతో 1969లో విడుదల చేశారు.
డ్రైవర్ మోహన్ (1969 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | మద్రాస్ సినీ క్లబ్ |
---|---|
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఎం.జి.రామచంద్రన్
- జయలలిత
- నంబియార్
- నగేష్
- మనోహర్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పి.నీలకంఠన్
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథం, పామర్తి
- రచన: అనిసెట్టి
- నిర్మాణ సంస్థ: మద్రాస్ సినీ క్లబ్
సంక్షిప్త కథ
మార్చువిద్యావంతుడైన మోహన్ అక్రమవ్యాపారం చేస్తూ లక్షలు గడిస్తున్న భద్రాచలం వద్ద డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. భద్రాచలం కూతురు సుశీల చలాకీ ఐన పిల్ల. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం. భద్రాచలం వ్యాపార భాగస్వామి నాగూ సుశీలను పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. ఒకసారి పిక్‌నిక్‌కు వెళ్ళిన సుశీలను మోహన్ ప్రమాదం నుండి కాపాడుతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఐతే సుశీల అంతస్తుకు తగినవాడు కాడని మోహన్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూ వస్తాడు. కానీ సుశీలకు మోహన్‌పై మక్కువ ఎక్కువ అవుతుంది. భద్రాచలం డాక్టర్ గిరినాథ్ కూతురు గిరిజను చెరచడానికి ప్రయత్నిస్తే మోహన్ అడ్డుపడతాడు. దాంతో మోహన్‌కు, భద్రాచలానికి వైరం ఏర్పడుతుంది. సుశీల మోహన్‌ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని పట్టుపట్టింది. భద్రాచలం ఆమెను నాగూకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ఆమె ఇంటి నుండి పారిపోయి దొంగల ముఠాకు చిక్కుతుంది. మోహన్ ఆమెను విడిపిస్తాడు. సుశీల తనను వివాహం చేసుకోమని బతిమాలినా మోహన్ దానికి నిరాకరించి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తాడు. తన కుమార్తె నగలు మోహన్ కాజేశాడని పోలీసులకు భద్రాచలం ఫిర్యాదు చేస్తాడు. అయితే ఇది అబద్ధమని సుశీల పోలీసులకు చెబుతుంది. తుదకు మోహన్ సుశీలను పెళ్లి చేసుకుంటాడు. మోహన్ స్నేహితుడు చంద్రం విషాహారం తిని మరణిస్తాడు. ఆ నేరం మోహన్‌పై పడుతుంది. అసలు డ్రైవర్ మోహన్ ఎవరు?, భద్రాచలం మోసాలు బయట పడతాయా? అనే విషయాలు కథ చివరలో తెలుస్తాయి[1].
మూలాలు
మార్చు- ↑ రెంటాల (7 February 1969). "చిత్ర సమీక్ష - డ్రైవర్ మోహన్". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 15 January 2020.[permanent dead link]