అమ్మోనియం సల్ఫేట్

((NH4)2SO4 నుండి దారిమార్పు చెందింది)

అమ్మోనియం సల్ఫేట్ ఒక రసాయనిక అకర్బన సమ్మేళనం. ఈ సమ్మేళనాన్ని ఆంగ్లంలో Ammonium sulfate, ammonium sulphate అనిరెండు రకాలుగా వ్రాయవచ్చును.

అమ్మోనియం సల్ఫేట్
Ball-and-stick model of two ammonium cations and one sulfate anion
పేర్లు
IUPAC నామము
Diazanium sulfate
ఇతర పేర్లు
ammonium sulfate
ammonium sulfate (2:1)
diammonium sulfate
sulfuric acid diammonium salt
mascagnite
Actamaster
Dolamin
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7783-20-2]
కెగ్ D08853
SMILES O=S(=O)(O)O.N.N
  • InChI=1/2H3N.H2O4S/c;;1-5(2,3)4/h2*1H3;(H2,1,2,3,4)

ధర్మములు
(NH4)2SO4
మోలార్ ద్రవ్యరాశి 132.14 g/mol
స్వరూపం Fine white hygroscopic granules or crystals.
సాంద్రత 1.769 g/cm3 (20 °C)
ద్రవీభవన స్థానం [convert: invalid number]
70.6 g/100 mL (0 °C)

74.4 g/100 mL (20 °C)
103.8 g/100 mL (100 °C)[1]
ద్రావణీయత insoluble in acetone, alcohol and ether
Critical relative humidity 79.2% (30 °C)
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
2840 mg/kg, rat (oral)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium sulfate
Potassium sulfate
సంబంధిత సమ్మేళనాలు
Ammonium iron(II) sulfate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

అమ్మోనియం సల్ఫేట్ ఒక అకర్బనసమ్మేళన లవణం. దీనిని సాధారణంగా పొలాలకు నత్రజని సత్తువను చేకూర్చు ఎరువుగా ఉపయోగిస్తారు. అమ్మోనియావాయువు, సల్ఫర్, ఆక్సిజన్‌మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళనం ఏర్పడినది.అమ్మోనియా వాయువు నైట్రోజన్, హైడ్రోజన్ వాయువుల సమ్మేళనం వలన ఏర్పడును. అమ్మోనియం సల్ఫేట్ లో నత్రజని/నైట్రోజన్ 21%,, సల్ఫర్/గంధకం 24%ఉండును.

అమ్మోనియం సల్ఫేట్ తెల్లని, చెమ్మని పిల్చు కొను లక్షణం కలిగి గుళికల రూపంలో లేదా స్పటికము లుగా ఉండును. సమ్మేళన పదార్థం యొక్క రసాయన ఫార్ములా (NH4)2SO4. అణుభారం 132.14గ్రాములు/మోల్. అమ్మోనియం సల్ఫేట్ సాంద్రత 1.769 గ్రాములు/సెం.మీ3. ద్రవీభవన స్థానం 235 to 280 °C (455 to 536 °F; 508 to 553 K). ఈ ద్రవీభవన స్థానం వద్ద అమ్మోనియం సల్ఫేట్ వియోగం చెందును.

నీటిలో ఈ రసాయన సమ్మేళన పదార్థం యొక్క ద్రావణియత నిటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది, ద్రావణియత కుడా పెరుగు తుంది. 0 °C నీటి ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీలో 70.6 గ్రాములు కరుగగా, 20°Cవద్ద 74.4 గ్రాములు/100 మి.లీలో కరుగును. అలాగే 100°Cవద్ద 103.8 గ్రాములు/100 మి.లీలో కరుగును. ఈ సమ్మేళనం అసిటోన్, ఆల్కహాల్,, ఈథర్‌ లలో కరుగదు. 30 °C వద్ద ఈ సమ్మేళనం యొక్క క్రిటికల్ రిలేటివ్ హ్యుమిడిటీ 79.2%.మండే గుణం లేదు.

ఉత్పత్తి విధానం

మార్చు

అమ్మోనియం వాయువుతో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చర్య కావించడం వలన అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు. తరచుగా కోక్ బట్టిలలో నుండి వెలువడు/ఉత్పత్తి అగు అమ్మోనియా వాయువును సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సంయోగపరచడం వలన అమ్మోనియం సల్ఫేట్ సమ్మేళనాన్ని తయారు చేయుదురు.

2 NH3 + H2SO4 → (NH4)2SO4

జిప్సం (CaSO4•2H2O).ను ఉపయోగించి కూడా అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును. మెత్తని చూర్ణంగా చేసిన జిప్సాన్ని అమ్మోనియం కార్బోనేట్ ద్రవానికి కలుపుతారు. కాల్షియం కార్బోనేట్ ఘన రూప అవక్షేపంగా వేరుపడగా, అమ్మోనియం సల్ఫేట్ ద్రవముగా లభించును.

(NH4)2CO3 + CaSO4 → (NH4)2SO4 + CaCO3

అమ్మోనియం సల్ఫేట్ స్వాభావికంగా అతి అరుదుగా లభించే mascagnite ఖనిజంతో పాటు లభిస్తుంది.

రసాయన చర్యలు

మార్చు

అమ్మోనియం సల్ఫేట్ ను 250 °C వరకు వేడి చేసిన ఇదిమొదట వియోగం చెందును. మొదట అమ్మోనియంబైసల్ఫేట్ ఏర్పడును. అధిక ఉష్ణోగ్రత వరకు వేడి చెయ్యడం వలన అమ్మోనియా, నత్రజని, సల్ఫర్ డైఆక్సైడ్, నిరుగా వియోగం చెందును. ఒక బలమైన ఆమ్లం (సల్ఫ్యూరిక ఆమ్లం, H2SO4), బలహీనమైన క్షారం (అమ్మోనియా వాయువు NH3) లరసాయన చర్యవలన ఏర్పడిన అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం ఆమ్ల తత్వం కలిగిఉండును. 0.1 మోలార్ అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం యొక్క pHస్థాయి 5.5 ఉండును. అమ్మోనియం మోలార్ ద్రవాన్ని అంతే మోలార్ విలువ కలిగిన లోహ సల్ఫేట్ ద్రవాల తోకలిపినా ద్వి లవణానలను (అమ్మోనియంలోహ సల్ఫెట్లు) ఏర్పరచును.

ఉపయోగాలు

మార్చు

ప్రథమంగా అమ్మోనియం సల్ఫేట్ ను క్షార భూములలో/నేలలో ఎరువుగా /సత్తువ ఉపయోగిస్తారు.నేలలో ఈ సమ్మేళనం అమ్మోనియా ఆయానులను విడుదల చెయ్యడం వలన అల్ప ప్రమాణంలో అమ్లా న్ని జనింప చేసి, నేల యొక్క pH స్థాయిని తటస్థ పరుస్తుంది. అదే సమయంలో మొక్క ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని కూడా అందిస్తుంది.ఈ సమ్మేళనాన్ని ఎరువుగా వాడటంలో ఉన్న ఇబ్బంది లేదా అనానుకూలత ఏమనగా, ఇది అమ్మోనియం నైట్రేట్ కన్న తక్కువ శాతం నత్రజని కలిగి ఉంది.

దీనిని నీటిలో కరిగే గుణమున్న కీటక నాశక, గుల్మ నాశక, శిలీంధ్ర నాశక మందులతో అనుపానం కలిపి పైరు పై పిచికారీచెయ్యుదురు.ప్రయోగ/పరిశోధనశాలలలో, ముఖ్యంగా జీవ రసాయన శాస్త్ర పరిశోధనశాలలో ప్రోటినులను శుద్ధీ కరించుటకు అమ్మోనియం సల్ఫేట్ అవక్షేపికరణ విధానా న్ని ఉపయోగించటంసాధారణం. అమ్మోనియం సల్ఫేట్ ను ఆహారపు అడిటివ్ (additive సంకలితము, గా ఉపయోగిస్తారు. అలాగే బ్రెడ్, పిండిల అసిడిటీ రెగ్యులేటర్ గా కూడా వాడెదరు. అమ్మోనియం పెర్ సల్ఫేట్ వంటి ఇతర అమ్మోనియం లవణాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు.

అమ్మోనియం సల్ఫేట్ ను దారువు/చెక్కను పాడవ్వకుండ నిల్వ ఉంచు కారకంగా వాడేవారు. అయితే అమ్మోనియం సల్ఫేట్ కు అధికంగా చెమ్మను పీల్చుకునేగుణం కారణంగా వుడ్ ప్రిసేర్ వేటివ్ గా దీని వాడకాన్ని ఆపివేశారు.

చట్టపరమైన నియంత్రణ

మార్చు

నవంబరు 2009లో పాకిస్తాన్ లోని వాయవ్య సరిహద్దుప్రాంతంలో మలకండ్ డివిజన్ లో అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియంనైట్రేట్, కాల్షియం అమ్మోనియంనైట్రేట్ ల అమ్మకాన్ని నిషేధించారు, కారణం అక్కడి ఉగ్రవాదులు వీటిని ప్రేలుడు వస్తువులను తయారుచెయ్యడంవలన ఈ నిషేధాన్ని అమలు పరచారు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Lide, David R., ed. (2006). CRC Handbook of Chemistry and Physics (87th ed.). Boca Raton, FL: CRC Press. ISBN 0-8493-0487-3.