100 డేస్ ఆఫ్ లవ్ 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో ఎస్.ఎస్.సి.మూవీస్ బ్యానర్‌పై వెంకట రత్నం ఈ సినిమా తెలుగులో విడుదల చేశాడు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జీనస్ మహమ్మద్ దర్శకత్వం వహించగా, 26 ఆగష్టు 2016న విడుదల చేశారు.[2]

100 డేస్ ఆఫ్ లవ్
దర్శకత్వంజీనస్ మహమ్మద్
రచనజీనస్ మహమ్మద్
నిర్మాతవెంకట రత్నం
తారాగణందుల్కర్ సల్మాన్
నిత్యా మీనన్
శేఖర్ మీనన్
అజు వర్గీస్
ఛాయాగ్రహణంప్రతీష్ వర్మ
కూర్పుసందీప్ కుమార్
సంగీతంపాటలు:
గోవింద్ మీనన్
బ్యాక్ గ్రౌండ్ సంగీతం :
బిజీబాల్
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎస్.సి.మూవీస్
విడుదల తేదీ
2016 ఆగస్టు 26 (2016-08-26)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రావుగోపాల రావు (సల్మాన్ దుల్కర్) టైమ్స్ సంస్థలో పని చేస్తుంటాడు. ఆయనకు సావిత్రి (నిత్యా మీనన్) పరిచయం ఆవుతుంది. అయితే ఆమె తాను చిన్నప్పుడు ఎంతగానో అసహ్యించుకన్న తన స్కూల్ మేట్ సావిత్రి అని తెలుస్తోంది. అప్పటి నుంచి సావిత్రిని పక్కనపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, సావిత్రి మాత్రం అతనికి దగ్గరవుతూనే ఉంటుంది. సావిత్రికి మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరగటం, ఆపై గోపాల్ రావుకి ఆమె ప్రేమ కలగటం ఒకేసారి జరుగుతాయి. మరి వారిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
  • నిర్మాత: వెంకట రత్నం
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీనస్ మహమ్మద్
  • సంగీతం: గోవింద్ మీనన్
  • సినిమాటోగ్రఫీ: ప్రతీష్ వర్మ
  • ఎడిటర్: సందీప్ కుమార్

మూలాలు మార్చు

  1. The Indian Express (25 August 2016). "100 Days of Love: Do Dulquer Salmaan, Nithya Menen have another hit on hands?" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. The Times of India (12 April 2016). "Dulquer's 100 Days of Love to be remade in Telugu - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. The Times of India (26 August 2016). "100 Days of Love Movie Review {3/5}: Critic Review of 100 Days of Love by Times of India". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.