1473 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1470 1471 1472 - 1473 - 1474 1475 1476
దశాబ్దాలు: 1450లు 1460లు - 1470లు - 1480లు 1490లు
శతాబ్దాలు: 14 వ శతాబ్దం - 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం


సంఘటనలు మార్చు

  • ఫిబ్రవరి 12: అవిసెన్నా యొక్క ది కానన్ ఆఫ్ మెడిసిన్ (లాటిన్ అనువాదం) యొక్క మొదటి పూర్తి ఎడిషన్ మిలన్‌లో ప్రచురించారు.
  • ఆగస్టు 11: ఒట్లక్బెలి యుద్ధం : ఒట్టోమన్ సుల్తాన్ మెహమెద్ II ఉజున్ హసన్ నేతృత్వంలోని వైట్ షీప్ తుర్క్మెన్లను ఓడించాడు.
  • రెక్యూయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ ఆంగ్లంలో ముద్రించిన మొదటి పుస్తకం. విలియం కాక్స్టన్ దీన్ని ముద్రించాడు. అప్పటివి 18 కాపీలు ఇంకా ఉన్నాయి. 2014 లో డ్యూక్ ఆఫ్ నార్తంబర్‌లాండ్ ఒక కాపీని వేలం వేసినపుడు అది 10 లక్షల పౌండ్లకు అమ్ముడైంది. [1]
  • మోల్దవియా యొక్క గ్రేట్ స్టీఫెన్ ఒట్టోమన్లకు కప్పం చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో ఒట్టోమన్లు దండయాత్ర చేసారు. ఈ యుద్ధంలో 1475 లో ఒట్టోమన్లు ఓడిపోయారు. ఒట్టోమన్లకు అతి పెద్ద ఓటమి అది.

జననాలు మార్చు

 
నికోలాస్ కోపర్నికస్


మరణాలు మార్చు

  • ఫిబ్రవరి 19: హీన్రిచ్ బిర్న్‌బామ్, ఒక కాథలిక్ జర్మన్ సన్యాసి (జ.1403)
  • మేవారు రాజు మొదటి ఉదయ్ సింగ్. ఇతడు రాణా కుంభా కుమారుడు. తండ్రిని చంపి సింహాసనమెక్కాడు. అందుచేత ఇతన్ని హంతకుడు అనేవారు. అయితే ఇతడి మరణం గురించి రెండు కథనాలున్నాయి - పిడుగుపాటుకు అని ఇక కథనం కాగా, ఎవరో హత్య చేసాడని మరొక కథనం.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "First printed book in English sold for over £1m", 17 July 2014, BBC
"https://te.wikipedia.org/w/index.php?title=1473&oldid=3845594" నుండి వెలికితీశారు