1690
1690 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1687 1688 1689 - 1690 - 1691 1692 1693 |
దశాబ్దాలు: | 1670లు 1680లు - 1690లు - 1700లు 1710లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 14: జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన జాన్ సి. డెన్నర్ 'క్లారినెట్' వాద్యాన్ని రూపొందించారు. [1]
- ఫిబ్రవరి 3: ఉత్తర అమెరికాలో మొట్ట మొదటి కాగితపు డబ్బును మసాచుసెట్స్ బే కాలనీలో విడుదల చేసింది.
- మే 20: పదవీచ్యుతుడైన జేమ్స్ II అనుచరులను క్షమించి ఇంగ్లాండ్ గ్రేస్ చట్టాన్ని ఆమోదించింది.
- జూన్ 14: జేమ్స్ II ను ఎదుర్కోవటానికి ఇంగ్లాండ్ రాజు విలియం III (విలియం ఆఫ్ ఆరెంజ్) ఐర్లాండ్‌లో అడుగుపెట్టాడు.
- జూన్ 8: సిద్ది సేనాని యదీ సాకత్ ముంబై లోని మజగావ్ కోటను నాశనం చేసాడు
- జూలై 10: బీచి హెడ్ యుద్ధం (బెవిజియర్స్ యుద్ధం అని కూడా పిలుస్తారు) : ఫ్రెంచి వారు ఆంగ్లో-డచ్ నావికాదళాన్ని ఓడించారు. ఇంగ్లాండ్‌పై జాకబైట్ల దాడి జరుగుతుందనే భయాలకు ఇది దారితీసింది. [2]
- జూలై 11: డబ్లిన్‌కు ఉత్తరాన బోయ్న్ యుద్ధం : ఇంగ్లాండ్ రాజు విలియం III (విలియం ఆఫ్ ఆరెంజ్) పదవీచ్యుతుడైన జేమ్స్ II ను ఓడించాడు, అతను ఫ్రాన్స్‌కు పారిపోయాడు. [3] [4] ఆరెంజ్ సైన్యం పూర్తి నియంత్రణ సాధించే వరకు ఐర్లాండ్‌లో తిరుగుబాటు మరో సంవత్సరం పాటు కొనసాగుతుంది.
- ఆగష్టు 24: భారతదేశంలో, ఆంగ్లో- మొఘుల్ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, హూగ్లీ నది ఒడ్డున సూతనూతి (ఇదే తరువాత కలకత్తాగా మారింది) వద్ద కోట, వాణిజ్య స్థావరం స్థాపించుకుంది. [5]
- అక్టోబర్ 8: గొప్ప టర్కిష్ యుద్ధం : ఒట్టోమన్లు బెల్గ్రేడ్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు .
- నవంబర్ 17: లండన్‌లో బార్క్లేస్ సంస్థను స్థాపించారు.
- డిసెంబర్: యురేనస్ గ్రహాన్ని మొదటగా జాన్ ఫ్లామ్‌స్టీడ్ చూసాడు. అతడు పొరపాటున దీనిని 34 టౌరీ అనే నక్షత్రంగా జాబితా చేశాడు
- తేదీ తెలియదు: ఆదోని కోటను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు.
జననాలు
మార్చుమరణాలు
మార్చుపురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Rice, Albert R. (1992). The Baroque Clarinet. Oxford: Clarendon Press. pp. 17, 40–42. ISBN 0198161883.
- ↑ (the battle took place on June 30, according to the "old style" Julian calendar in use at this time by the English)
- ↑ (the battle took place on July 1, according to the "old style" Julian calendar in use at this time by the English. This is equivalent to 11 July in the "new style" Gregorian calendar, although today it is commemorated on July 12).
- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. p. 285. ISBN 0-304-35730-8.
- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. p. 285. ISBN 0-304-35730-8.