ఆదోని కోట ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, ఆదోనికి సమీపంలో ఒక కొండపైన ఉన్న శిథిలమైన పురాతన కోట.[1] ఇది సుమారు 3000 సంవత్సరాలు చరిత్ర కలిగిన కోట. కాలక్రమంలో ఇది విజయనగర రాజులు, గోల్కొండ, బీజాపుర సుల్తానులు, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్, చివరికి ఆంగ్లేయుల చేతుల్లోకి మారుతూ వచ్చింది.

కోట లోపలి భాగంలో హాలు

చరిత్ర

మార్చు
 
కోట పశ్చిమ వైపు ద్వారం

ఈ ప్రాంతం ద్వాపరయుగంలో యదువంశ మూలపురుషుడు యయాతి-దేవమానిల (శుక్రాచార్యుల) పుత్రిక యదు పేరుతో యదుపురం యాదవ అవనిగా పిలువబడింది. తదనంతరం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు పరిపాలించారు. దీనిని క్రీ.పూ 1200 శతాబ్దంలో చంద్రసేనుడు అనే రాజు కట్టించినట్లుగా తెలుస్తోంది. దీనిని యాదవగిరి అనే పేరుతో నిర్మించారు.[2] తరువాత మధ్యయుగంలో విజయనగర రాజుల చేతికి వచ్చి సా.శ. 14 నుంచి 16 వ శతాబ్దం మధ్యలో బాగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. వారి తరువాత ఇది ఆదిల్ షాహీ వంశానికి చెందిన గోల్కొండ, బీజాపూర్ సుల్తానులకు గట్టి కోటగా వ్యవహరించింది. 1690 లో దీన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. 18 శతాబ్దం చివరి నాటికి మైసూరు రాజుల చేతికి, 1785లో టిప్పు సుల్తాన్ చేతికి, [3] చివరికి 1799 లో ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది.[4]

నిర్మాణం

మార్చు

యాదవగిరి 800 నుండి 900 అడుగుల ఎత్తు వుండి 48 నుంచి 50 కిలోమీటర్ల చుట్టు కొలతలో కోటనిర్మాణమై మొదట 7 వృత్తాల కోటగోడలు వుండి బారాకిల్లా అనే పేరుతో 12 కోటలున్నాయి. శతృవులు చొరబడలేని విధంగా చక్రవ్యూహంగా కనబడేది. కోట వైశాల్యం 3583 ఎకరాలు, కోటగోడల మందం25 నుండి 35 అడుగుల మందం ఉండేది.

మూలాలు

మార్చు
  1. "ఆదోని పోర్టల్". manaadoni.com. Retrieved 19 October 2016.
  2. కెంగార, మోహన్. "ఆదోని చరిత్ర రచనకు సజీవ సాక్ష్యం 'పివి నరసణ్ణ'". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 20 October 2016.[permanent dead link]
  3. సందీప్, బాలకృష్ణ (2015). TipuSultan- The Tyrant of Mysore. RARE Publications. ISBN 9782765908326. Retrieved 19 October 2016.
  4. "బ్రిటీష్ లైబ్రరీ వ్యాసం". bl.uk. Archived from the original on 4 ఆగస్టు 2020. Retrieved 19 October 2016.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆదోని_కోట&oldid=4021829" నుండి వెలికితీశారు