1785 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1782 1783 1784 - 1785 - 1786 1787 1788
దశాబ్దాలు: 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
 
English Channel Satellite
  • జనవరి 1: లండన్‌లో డైలీ యూనివర్సల్ రిజిస్టర్ మొట్టమొదటిగా ప్రచురితమైంది. అదే ఆ తరువాత ది టైమ్స్ అయింది.
  • జనవరి 7: ఫ్రెంచ్ వ్యక్తి జీన్-పియరీ బ్లాన్‌చార్డ్, అమెరికన్ జాన్ జెఫ్రీస్ ఇంగ్లండ్‌లోని డోవర్ నుండి ఫ్రాన్స్‌లోని కలైస్‌కు హైడ్రోజన్ గ్యాస్ బెలూన్‌లో ప్రయాణించి, ఇంగ్లీష్ ఛానెల్‌ను వాయుమార్గం ద్వారా దాటిన మొదటి వ్యక్తు లయ్యారు.
  • జనవరి 11: రిచర్డ్ హెన్రీ లీ యుఎస్ కాంగ్రెస్ ఆఫ్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]
  • ఫిబ్రవరి 9: ఫోర్ట్ విలియం (తరువాత బ్రిటిష్ ఇండియా ) ప్రెసిడెన్సీకి గవర్నర్ జనరల్‌గా ఉన్న వారెన్ హేస్టింగ్స్ రాజీనామా చేశాడు. 19 నెలల తరువాత చార్లెస్ కార్న్‌వాలిస్ వచ్చే వరకు, జాన్ మాక్‌ఫెర్సన్ బ్రిటిష్ ఇండియాను పరిపాలించారు.[2]
  • మార్చి 7: స్కాటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త జేమ్స్ హట్టన్ మొదట తన మైలురాయి రచన థియరీ ఆఫ్ ది ఎర్త్ను రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరోలో ప్రదర్శించాడు.[3]
  • మార్చి 10: అమెరికన్ ఇంజనీర్ జేమ్స్ రమ్సే విజయవంతమైన స్టీమ్‌బోట్‌ను రూపొందించే ప్రణాళికలను తెలియజేస్తూ జార్జ్ వాషింగ్టన్కు ఒక లేఖను పంపాడు.[4]
  • ఏప్రిల్ 28 – ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ 1789 లో ప్రచురితమైన తన రెండవ శ్రేణి నక్షత్రాల సర్వేలను ప్రారంభించాడు.[5]
  • మే 10 – ఐర్లాండ్‌లోని టుల్లామోర్‌లో వేడి గాలి బెలూన్ కుప్పకూలి, సుమారు 100 ఇళ్ళు తగలబడ్డాయి. ఇది ప్రపంచంలోనే మొదటి విమానయాన ప్రమాదం (36 రోజుల తరువాత మరో ప్రమాదం జరిగింది).[6]
  • జూన్ 15: ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవడంతో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రే డి రోజీర్, కో పైలెట్ పియర్ రొమెయిన్ మరణించారు. ప్రపంచంలో మనుషులు మరణించిన మొట్ట మొదటి విమాన ప్రమాదం ఇది.
  • జూలై 6డాలర్ను అమెరికా ద్రవ్యంగా కాన్ఫెడరేషన్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.[7]
  • అక్టోబర్ 13 – బ్రిటిష్ ఇండియాలో మొదటి వార్తాపత్రిక మద్రాస్ కొరియర్ ప్రచురితమైంది. 1794 వరకు వారపత్రికగా దీని ప్రచురణ కొనసాగింది.[8]
  • తేదీ తెలియదు: మొట్టమొదటిగా బొగ్గు వాయువును వెలుతురు కోసం ఉపయోగించారు.
  • తేదీ తెలియదు: నెపోలియన్ ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్‌గా నియమితుడయ్యాడు.
  • తేదీ తెలియదు: పిట్ ఇండియా చట్టం ప్రకారం భారతదేశంలో మద్రాసు ప్రావిన్సు ఏర్పాటైంది

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Harper's Encyclopaedia of United States History from 458 A. D. to 1909, ed. by Benson John Lossing and, Woodrow Wilson (Harper & Brothers, 1910) p167
  2. G.S.Chhabra, Advance Study in the History of Modern India, Volume-1: 1707-1803 (Lotus Press, 2005) p282
  3. Jill Schneiderman, The Earth Around Us: Maintaining A Livable Planet (Henry Holt and Company, 2000) p24
  4. Annual Report of the Commissioner of Patents, Part 1 (U.S. Government Printing Office, 1850) p535
  5. Stephen James O'Meara, Deep-Sky Companions: The Caldwell Objects (Cambridge University Press, 2016) p534
  6. Byrne, Michael (2007-01-09). "The Tullamore Balloon Fire - First Air Disaster in History". Tullamore History. Offaly Historical & Archaeological Society. Archived from the original on 2012-03-26. Retrieved 2012-08-21.
  7. David C. Harper, ed., 2011 North American Coins and Prices (Krause Publications, 2010) p9
  8. Henry Davison Love, ed., Indian Records Series: Vestiges of Old Madras, 1640-1800 (Mittal Publications, p440
"https://te.wikipedia.org/w/index.php?title=1785&oldid=3467176" నుండి వెలికితీశారు