1995 ఆసియా కప్ (పెప్సీ ఆసియా కప్), ఐదవ ఆసియా కప్ టోర్నమెంట్. షార్జా, UAE లో నిర్వహించిన రెండవ టోర్నమెంటు. ఈ టోర్నమెంటు 1995 ఏప్రిల్ 5-14 మధ్య జరిగింది. ఇందులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు పాల్గొన్నాయి.
1995 ఆసియా కప్ రౌండ్-రాబిన్ పద్ధతిలో జరిగింది. ప్రతి జట్టు ఇతర జట్లతో ఒకసారి ఆడింది. మొదటి రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. రౌండ్-రాబిన్ దశ ముగిసే సమయానికి భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్లకు నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే మెరుగైన రన్-రేట్ల ఆధారంగా భారత్, శ్రీలంకలు ఫైనల్‌కు అర్హత సాధించాయి. భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి వరుసగా మూడవ (మొత్తం మీద నాలుగోది) ఆసియా కప్‌ను గెలుచుకుంది.