ముహమ్మద్ అజహరుద్దీన్

ముహమ్మద్ అజహరుద్దీన్ (en:Mohammad Azharuddin) (జననం ఫిబ్రవరి 8 1963, హైదరాబాదులో) అజహర్ గా పిలువబడే అజహరుద్దిన్, భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్. క్రికెట్ రంగంలో బాగారాణించాడు. కానీ మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని తన క్రికెట్ కెరీర్ ను పోగొట్టుకొన్నాడు. కోర్టులో మ్యాచ్ ఫిక్సింగ్ దోషిగా నిరూపింపబడలేదు.[1] . మే 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు.

ముహమ్మద్ అజహరుద్దీన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2009
ముందు షాఫిఖర్ రహమాన్ బరక్
నియోజకవర్గము మొరదాబాద్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సంగీత బిజ్లాని
సంతానము అయాజుద్దిన్
అసద్
మతం ఇస్లాం
వెబ్‌సైటు http://azhar.co/
2 జనవరి, 2014నాటికి


ముహమ్మద్ అజహరుద్దీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ముహమ్మద్ అజహరుద్దీన్
మారుపేరు అజహర్
జననం (1963-02-08) 1963 ఫిభ్రవరి 8 (వయస్సు: 57  సంవత్సరాలు)
హైదరాబాదు - ఆంధ్రప్రదేశ్ - భారత్, భారత్
పాత్ర బ్యాట్స్-మ్యాన్
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మాన్
బౌలింగ్ శైలి Right-arm మీడియం
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం
తొలి టెస్టు (cap 169) 31 డిసెంబరు 1984: v ఇంగ్లాండు
చివరి టెస్టు 2 మార్చి 2000: v దక్షిణాఫ్రికా
తొలి వన్డే (cap 51) 20 జనవరి 1985: v ఇంగ్లాండు
చివరి వన్డే 3 జూన్ 2000:  v పాకిస్తాన్
దేశవాళీ క్రికెట్ సమాచారం
Years Team
1981–2000 హైదరాబాద్ క్రికెట్ టీమ్
1983–2000 సౌత్ జోన్
1991–1994 Derbyshire
కెరీర్ గణాంకాలు
TestODIFCLA
మ్యాచ్‌లు 99 334 229 433
పరుగులు 6,215 9,378 15,855 12,941
బ్యాటింగ్ సగటు 45.03 36.92 51.98 39.33
100s/50s 22/21 7/58 54/74 11/85
అత్యుత్తమ స్కోరు 199 153* 226 161*
వేసిన బంతులు 13 552 1,432 827
వికెట్లు 0 12 17 15
బౌలింగ్ సగటు 39.91 46.23 47.26
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 0/4 3/19 3/36 3/19
క్యాచ్ లు/స్టంపింగులు 105/– 156/– 220/– 200/–

As of 13 February, 2009
Source: CricketArchive

క్రికెట్ జీవితంసవరించు

మ్యాచ్ పిక్సింగ్ ఆరోపణలుసవరించు

రాజకీయ జీవితంసవరించు

2009 పార్లమెంటు ఎన్నికలుసవరించు

కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి 49,107 మెజారిటీతో గెలుపొందాడు.[2]

ఇతరాలుసవరించు

2013 జూలై 14 న మొహమ్మద్ అజహరుద్దీన్ ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[3]

వ్యక్తిగత జీవితంసవరించు

అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్, అసద్. అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.

మూలాలుసవరించు

  1. http://news.bbc.co.uk/sport2/hi/in_depth/2000/corruption_in_cricket/1055889.stm
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-11. Retrieved 2013-11-25.
  3. http://www.andhraprabha.com/sports/azahar-new-innings/1140.html[permanent dead link]

బయటి లింకులుసవరించు