2002 తూర్పు మధ్యధరా ఘటన

2002 తూర్పు మధ్యధరా సంఘటన 2002 జూన్ 6 న 34°N 21°E ( లిబియా, క్రీట్ ల మధ్య) మధ్యధరా సముద్రం మీద ఎగువ వాతావరణంలో చాలా శక్తితో జరిగిన పేలుడు. [1] ఈ పేలుడు, ఒక చిన్న అణు బాంబు వంటి శక్తితో కూడుకుని ఉంది. గుర్తించబడని చిన్న గ్రహశకలం భూమిని సమీపిస్తున్నప్పుడు ఈ పేలుడు జరిగింది. సముద్రం మీద పేలడంతో ఉల్క విచ్ఛిన్నమై పోయింది. ఉల్క శకలాలేవీ దొరకలేదు.

ఈ సంఘటన 2001-2002 భారతదేశం-పాకిస్తాన్ ప్రతిష్టంభన సమయంలో జరిగింది. ఈ పేలుడు పాకిస్తాన్ కు గాని, భారతదేశానికి గానీ దగ్గరలో జరిగి ఉంటే, అది ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉండేదని అమెరికా వైమానిక దళానికి చెందిన జనరల్ సైమన్ వోర్డెన్ ఆందోళన వ్యక్తం చేశాడు. [2]

ఇవి కూడా చూడండి

మార్చు
  • తాకిడి ఘటన
  • భూమికి సమీపంలో ఉన్న వస్తువు
  • సంభావ్య ప్రమాదకర గ్రహశకలం
  • వేల సంఘటన

మూలాలు

మార్చు
  1. "Speech by Gen. Simon Worden: "Military Perspectives on the Near-Earth Object (NEO) Threat"". SpaceRef. United States Space Command. 2002-07-15. Archived from the original on 2009-10-12. Retrieved 2022-03-13. Had you been situated on a vessel directly underneath the intensely bright flash would have been followed by a shock wave that would have rattled the entire ship and possibly caused minor damage.
  2. "Near-Earth Objects Pose Threat, General Says". Space Daily. 2002-09-17.