మధ్యధరా సముద్రం

అట్లాంటిక్ మహాసముద్రానికి అనుసంధానమై ఉన్న సముద్రం
(మధ్యధరా సముద్రము నుండి దారిమార్పు చెందింది)

మధ్యధరా సముద్రం (ఆంగ్లం: Mediterranean Sea) అట్లాంటిక్ మహాసముద్రమునకు కలసి ఉన్న ఒక సముద్రం. మధ్యధరా పరీవాహక ప్రాంతంచే చుట్టబడి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగాలచే చుట్టబడివున్నది. ఉత్తరాన ఐరోపా , దక్షిణాన ఆఫ్రికా ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది". [1] దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపు కిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె (జిబ్రాల్టర్ జలసంధి) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. సముద్రాల అధ్యయన శాస్త్రంలో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు. పాశ్చాత్య నాగరికత చరిత్రలో ఈ సముద్రం కేంద్ర పాత్ర వహించింది. దాదాపు 5.9 మిలియన్ సంవత్సరాల క్రితం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం నుండి పూర్తిగా వేరుపడి, మెస్సినియన్ లవణీయ సంక్షోభంలో, 6 లక్షల సంవత్సరాల పాటు పాక్షికంగానో, పూర్తిగానో ఎండిపోయి, తిరిగి 5.3 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన జాన్‌క్లియన్ వరదలో తిరిగి నీటిని నింపుకున్నదని భౌగోళిక ఆధారాలు సూచిస్తున్నాయి.

ఉపగ్రహం నుండి తీసిన మధ్యధరాసముద్రపు సంక్షిప్త ఛాయాచిత్రం
జిబ్రాల్టర్ జలసంధి వద్దనుండి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం. ఎడమవైపు యూరప్: కుడివైపు, ఆఫ్రికా.

మధ్యధరా సముద్రం దాదాపు 2,500,000 km2 (970,000 sq mi) మేరకు విస్తరించింది.[2] ఇది భూమి యొక్క పూర్తి సముద్రతలంలో 0.7% శాతం. కానీ అంతటి సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రానికి కలిసే జిబ్రాల్టర్ జలసంధి (అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరాసముద్రానికి కలుపుతూ, ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పాన్ని, ఆఫ్రికాలోని మొరాకోను విడదీస్తున్న జలసంధి) వద్ద కేవలం 14 km (9 mi) వెడల్పు మాత్రమే ఉన్నది.

సరిహద్దు దేశాలు సవరించు

 
లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.

21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి ఉన్నాయి. అవి:

టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ , పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని సినాయ్ ద్వీపకల్పం ఆసియాలోనూ ఉన్నాయి.

కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నాయి. (పశ్చిమం నుండి తూర్పునకు) :

అండొర్రా, జోర్డాన్, పోర్చుగల్, సాన్ మెరీనో, సెర్బియా , వాటికన్ నగరం, వీటికి మధ్యధరా సముద్రతీరంతో సంబంధం లేకున్ననూ, మధ్యధరాప్రాంతపు దేశాలుగా పరిగణింపబడుతాయి.

మధ్యధరా సముద్రతీరంలో గల పెద్ద నగరాలు :

  • మలగా, వాలన్షియా, బార్సెలోనా, మార్సెయిల్లె, నైస్, వెనిస్, జెనోవా, నేపుల్స్, బారి, పాలెర్మో, మెస్సినా, స్ప్లిట్, ఏథెన్స్, ఇజ్మీర్, అంతాల్యా, లట్టాకియా, బీరూట్, టెల్ అవీవ్, పోర్ట్ సైద్, డామియెట్టా, అలెగ్జాండ్రియా, బెంఘాజీ, ట్రిపోలీ, ట్యూనిస్, అల్జీర్స్.

మూలాలు సవరించు

  1. "How did mediterranean sea get its name?". Yahoo Inc. 6 May 2008. Archived from the original on 27 జూలై 2011. Retrieved 6 January 2008.
  2. Boxer, Baruch. "Mediterranean Sea". Encyclopædia Britannica (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 23 October 2015.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇవీ చూడండి సవరించు

బయటి లింకులు సవరించు

35°N 18°E / 35°N 18°E / 35; 18