2001–2002 భారత పాక్ ప్రతిష్ఠంభన
| ||||||||||||||||||||||||||||||||
2001-2002 భారతదేశం-పాకిస్తాన్ ప్రతిష్టంభన భారతదేశం, పాకిస్తాన్ మధ్య 2001 లో ఏర్పడిన సైనిక ప్రతిష్టంభన. దీనిలో భాగంగా సరిహద్దుకు ఇరువైపులా, కాశ్మీర్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి సైనికులను భారీగా మోహరించారు. 1998లో రెండు దేశాలు విజయవంతంగా అణ్వాయుధాలను పరీక్షించిన తర్వాత భారత పాకిస్తాన్ల మధ్య ఇది రెండవ అతిపెద్ద సైనిక ప్రతిష్టంభన, మొదటిది 1999 నాటి కార్గిల్ యుద్ధం.
2001 డిసెంబర్ 13 న ఢిల్లీలోని భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి (భవనంపై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులతో సహా పన్నెండు మంది మరణించారు), 2001 అక్టోబరు 1 న జమ్మూ కాశ్మీర్ శాసనసభపై జరిగిన ఉగ్రవాద దాడికి (దీనిలో 38 మంది మరణించారు.) ప్రతిస్పందనగా భారతదేశం సైనిక బలగాల మోహరింపు మొదలుపెట్టింది.[9] కాశ్మీరులో పోరాడుతున్న రెండు పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలు - లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ లు ఈ దాడులు చేసాయని భారతదేశం పేర్కొంది. ఈ రెండింటికి పాకిస్తాన్ ISI మద్దతు ఉందని భారతదేశం పేర్కొంది. ఆ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది.[10][11] పాకిస్తాన్‌లోని సరిహద్దుల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై యుద్ధం ప్రారంభించాలని అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా భారత్‌ను కోరాడు. [9]
పాశ్చాత్య మీడియాలో, రెండు దేశాల మధ్య అణుయుద్ధ సంభావ్యత, సమీపంలోని ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలోని " గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం "పై దానివలమ్న కలిగే చిక్కులపైననే దృష్టి సారించింది. అంతర్జాతీయ దౌత్యపరమైన మధ్యవర్తిత్వం కారణంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి, దీని ఫలితంగా 2002 అక్టోబరులో భారత [12] పాకిస్తాన్లు అంతర్జాతీయ సరిహద్దు నుండి తమతమ దళాలను ఉపసంహరించుకున్నాయి.
సైనిక సమీకరణకు భారతీయ సంకేతనామం ఆపరేషన్ పరాక్రమ్, దీనిని NDTV కి చెందిన సంజయ్ అహిర్వాల్ పాకిస్తాన్‌తో భారతదేశపు "కన్నూ కన్నూ కలిపి ఎదుర్కోవాలని నిర్ణయించుకోవడం" గా అభివర్ణించాడు. భారత్ తన సైనిక, రాజకీయ లక్ష్యాలలో కొన్నింటిని సాధించుకున్న ఆపరేషను ఇది. [13]
సుదీర్ఘమైన ఈ సైనిక ప్రతిష్టంభన ముగింపు దశకు చేరే సమయంలో చేసిన ఒక రహస్య ఆపరేషనులో ద్రాస్ సమీపంలో, నియంత్రణ రేఖకు పాకిస్తాన్ వైపున వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత గల పర్వత శిఖరం పాయింట్ 5070 ని భారతదేశ జాట్ రెజిమెంటు ఆక్రమించింది. తదనంతరం దానికి బల్వాన్ అని పేరు పెట్టింది. [14][15][13] వేసవిలో ఈ శిఖరాన్ని ఆక్రమించడం అలవాటుగా ఉన్న పాకిస్తానీ సైన్యాన్ని ఇది చిక్కుల్లో పడేసింది. ఈ శిఖరారోహణంతో భారతదేశానికి, అక్కడి నుండి పాక్ వౌపున ఉన్న గుల్తారీ లోయను చక్కగా చూసే వీలు కల్పించింది. ఈ శిఖరాన్ని కోల్పోయినందుకు పర్యవసానంగా, పాకిస్తానీ బ్రిగేడ్ కమాండరు, ఉత్తర ప్రాంతాల కమాండింగు ఆఫీసరులతో సహా మొత్తం కమాండ్ గొలుసును పాకిస్తానీ సైన్యం తొలగించేసింది. ద్రాస్ సమీపంలోని సరిహద్దు ప్రాంతంపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించినందుకు గాను భారతదేశం, లెఫ్టినెంట్ జనరల్ దీపక్ సమ్మన్వార్‌ను ఉత్తమ యుద్ధ సేవా పతకంతో సత్కరించింది. [15] [13]
తొలిదశ
మార్చు2001 డిసెంబర్ 13 ఉదయం, భారత పార్లమెంటు గేట్ 12 వద్ద భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఐదుగురు సాయుధ వ్యక్తులు దాడి చేసారు. భారత భద్రతా దళాలు ఈ ఐదుగురినీ కాల్చి చంపేసాయి. ఈ లోపు వాళ్ళు ఏడుగురిని చంపారు.
భారత పార్లమెంటుపై జరిగిన దాడిని పాకిస్థాన్‌తో సహా ప్రపంచ నేతలు, సమీప దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. డిసెంబరు 14న, పాలక భారత జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఈ దాడికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఎం)లు కారణమని ఆరోపించింది. భారత హోం మంత్రి ఎల్‌కె అద్వానీ, " నిన్నటి సంఘటన గురించి మాకు కొన్ని ఆధారాలు అందాయి, పొరుగు దేశం, అక్కడ క్రియాశీలంగా ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలు దీని వెనుక ఉన్నాయని చూపిస్తున్నాయి " అని చెబుతూ, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద గ్రూపులను పరోక్షంగా ప్రస్తావించాడు. అదే రోజు, భారతదేశంలోని పాకిస్తాన్ హైకమీషనర్ అష్రఫ్ జహంగీర్ ఖాజీకి చేసిన డిమాండ్‌లో, LeT, JeM కార్యకలాపాలను నిలిపివేయాలని, సంస్థ నాయకులను అరెస్టు చేయాలని, అన్ని ఆస్తులకు స్థంభింపజేయాలనీ పాకిస్తాన్‌ను భారతదేశం డిమాండ్ చేసింది. భారత ప్రభుత్వ ప్రకటనలను అనుసరించి, అదే రోజు పాకిస్తాన్ తన సైన్యాన్ని పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధం చేసింది.
పాకిస్తాన్ మిలటరీ పబ్లిక్ మీడియా విభాగం ( ISPR ) ప్రతినిధి, మేజర్ జనరల్ రషీద్ ఖురేషి మాట్లాడుతూ, భారత పార్లమెంటుపై దాడి పాకిస్తాన్‌తో వివాదాన్ని ప్రారంభించడానికి భారతదేశం చేసిన ప్రయత్నాల ఫలితమేనని చెప్పాడు". "కాశ్మీర్‌లో రక్షణ లేని వేలాది మంది ప్రజలను చంపినవారు, అంతర్జాతీయ సానుభూతి పొందేందుకు ఇటువంటి వ్యూహాలను అవలంబిస్తారు. నిజానిజాలు తెలుసుకోవడం కోసం అంతర్జాతీయ సమాజం స్వతంత్రంగా ఈ దాడిపై విచారణ జరపాలని మేము కోరుతున్నాము. మరొక సీనియర్ అధికారి, "అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో భారతదేశం విఫలమైంది, అందుకనే కారణం లేకుండా ప్రతిదానికీ పాకిస్తాన్‌ను నిందిస్తోంది" అని అన్నాడు. "పార్లమెంట్‌పై దాడిపై దర్యాప్తు చేసేందుకు ఎఫ్‌బీఐ బృందాన్ని పంపిస్తామని అమెరికా అంటే భారతీయులు ఎందుకు తిరస్కరించారు?" అని అడిగాడు
డిసెంబరు 20 న, ఓవైపు యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఐక్యరాజ్యసమితి లు సంయమనం పాటించాలని పిలుపునిస్తోండగా భారతదేశం, 1971 యుద్ధం తర్వాత చేసిన అతిపెద్ద సైనిక సమీకరణలో కాశ్మీర్, పంజాబ్ లలో దళాలను సమీకరించి, మోహరించింది. [16] ఈ సమీకరణకు భారతదేశం పెట్టుకున్న సంకేతనామం ఆపరేషన్ పరాక్రమ్. [17]
జనవరి ఘటనలు
మార్చుప్రణాళిక
మార్చుపశ్చిమ సరిహద్దులో సైన్యాన్ని మోహరించడానికి మూడు నుండి నాలుగు వారాలు పడుతుందని భారత్ అంచనా వేసింది. తదనుగుణంగా, 2002 జనవరి రెండవ వారంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలపై పరిమిత దాడితో కూడిన సైనిక చర్య జరపాలని భద్రతపై భారత క్యాబినెట్ కమిటీ ప్లాన్ చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల శిబిరాలు ఉన్న ప్రాంతాలపై భారత వైమానిక దళానికి చేందిన టైగర్ స్క్వాడ్రన్ వైమానిక దాడితో మొదలౌతుంది. భారత సైన్యపు ప్రత్యేక బలగాలు తీవ్రవాద శిబిరాలను తటస్థీకరించడానికి, నియంత్రణ రేఖపై ఆధిపత్య స్థానాలను ఆక్రమించడానికి పరిమిత స్థాయి భూదాడిని ప్రారంభిస్తాయి. 2002 జనవరి 14 న దాడి చేసే రోజుగా తాత్కాలికంగా నిర్ణయించారు. [18]
భారత వ్యూహం ప్రకారం, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లో పరిమితమైన దాడికే మొగ్గు చూపారు. ఎందుకంటే ఇది పాకిస్తాన్‌కు భారత సంకల్పాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయంగా వచ్చే ప్రతికూలతను తేలిగ్గా ఎదుర్కోనూ వచ్చు. ఒసామా బిన్ లాడెన్ కు చెందిన అల్-ఖైదా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో యుఎస్ చేస్తున్న దాడితో భారతదేశ చర్యలను పోల్చవచ్చు. [19]
భారత దాడులకు ప్రతిస్పందనగా పాకిస్ధాన్ పూర్తిస్థాయి దాడిని ప్రారంభించే అవకాశం గురించి CCS అంచనా వేసింది. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం పాక్ సైన్యం సన్నద్ధంగా లేదు. పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే అవకాశాలను ఇది మరింత తగ్గించింది. తక్కువ ద్రవ్యోల్బణం, అధిక పెట్రోలియం నిల్వలు, ఫారెక్స్ నిల్వలతో బలమైన ఆర్థిక వ్యవస్థ లు భారత ప్రణాళికలకు బలం చేకూర్చాయి. ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా చివరి మజిలీ అయిన యుద్ధానికి భారత ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు. పరిమిత దాడి వ్యూహాత్మక ఎంపికగా పనిచేసింది. సైనిక సమీకరణ అంతర్జాతీయ సమాజానికి "భారత్ కృతనిశ్చయత్వాన్ని" తెలియజేసింది. పాకిస్థాన్ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే, ఇక భారత్‌కు మరో మార్గం ఉండదు.న్ [20]
సైనిక ఘర్షణలు
మార్చుడిసెంబరు చివరలో, రెండు దేశాలు బాలిస్టిక్ క్షిపణులను సరిహద్దుకు దగ్గరగా తరలించాయి. కాశ్మీర్‌లో మోర్టారు, ఫిరంగి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. [21] 2002 జనవరి నాటికి, కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారతదేశం దాదాపు 5 లక్షల మంది సైనికులను, మూడు సాయుధ విభాగాలను సమీకరించింది. పాకిస్థాన్ కూడా అదే విధంగా స్పందించి, ఆ ప్రాంతంలో దాదాపు 3 లక్షల మంది సైనికులను మోహరించింది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని జనవరి 12న ముషారఫ్ చేసిన ప్రసంగం తర్వాత ఉద్రిక్తతలు పాక్షికంగా తగ్గాయి. [22]
సుదీర్ఘ సైనిక ఘర్షణల సమయంలో ఆర్టిలరీ ద్వంద్వ యుద్ధాలు సర్వసాధారణం. అలాంటి ఒక సందర్భంలో, సమీపంలోని పాయింట్ 5165, పాయింట్ 5240, పాయింట్ 5100 నుండి భారత సైనికులు పాకిస్తాన్ పోస్ట్‌పై ఫిరంగి కాల్పులు జరపడంతో ద్రాస్ సమీపంలోని పాయింట్ 5353 లో 40 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. [23]
దౌత్యం
మార్చుపాక్లో తన హైకమిషనర్‌ను వెనక్కి పిలిపించడం ద్వారా భారతదేశం తన దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్ నుండి పౌర విమానాలను నిషేధించింది. [24]
పాకిస్తాన్ యుద్ధ సంకేతాలను అందుకుంది. దాని సైన్యాన్ని సమీకరించడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ W. బుష్‌తో దౌత్యపరమైన చర్చలను ప్రారంభించింది. అమెరికా విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిమగ్నమయ్యాడు. జనవరి మొదటి వారంలో బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ భారత్‌లో పర్యటించి పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారఫ్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సందేశం ఇచ్చాడు. అమెరికా LeT, JeM లను విదేశీ ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించింది. [25]
ముషారఫ్ ప్రసంగం
మార్చు2002 జనవరి 8 న, భారత హోం మంత్రి ఎల్‌కె అద్వానీ అమెరికా సందర్శించాడు. అక్కడ ముషారఫ్ చేయబోయే ప్రసంగంలోని విషయాల గురించి ఆయనకు తెలియజేశారు. [26] 2002 జనవరి 12న, అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశంతో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉద్దేశించిన ప్రసంగం చేశాడు. భారత పార్లమెంటుపై జరిగిన దాడిని ఉగ్రవాద దాడి అని చెబుతూ ఆయన మొదటిసారిగా దాన్ని ఖండించాడు. దాన్ని సెప్టెంబర్ 11 దాడులతో పోల్చాడు. కాశ్మీర్ పేరుతో ఉగ్రవాదం అన్యాయమని, పాకిస్థాన్ తన సొంత గడ్డపై తీవ్రవాదాన్ని ఎదుర్కొంటోందనీ అతను తన ప్రసంగంలో ప్రకటించాడు. కాశ్మీర్ సమస్యను పాకిస్తాన్ చర్చలతో పరిష్కరించుకుంటుంది. కాశ్మీర్ సాకుతో ఉగ్రవాద కార్యకలాపాలు చెయ్యడానికి ఏ సంస్థనూ అనుమతించదు. భారతదేశం కోరినట్లుగా, మదర్సాల నియంత్రణకు, పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులను నిషేధించేందుకూ ప్రణాళికలను కూడా ప్రకటించాడు. [27] కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్, లష్కరే తాయిబాలతో సహా ఐదు జిహాదీ సంస్థలపై అధికారికంగా నిషేధం విధిస్తున్నట్లు అతను ప్రకటించాడు. [28]
భారత ప్రధాని అటల్ బి. వాజ్‌పేయికి ముషారఫ్ చిత్తశుద్ధిపై అనుమానం ఉన్నప్పటికీ, జనవరి 14న చేయ తలపెట్టిన సైనిక దాడిని జరపకూడదని నిర్ణయించుకున్నాడు.
కాలూచక్ ఊచకోత
మార్చు2002 మేలో ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. మే 14న, ముగ్గురు ఆత్మాహుతి ఉగ్రవాదులు జమ్మూ సమీపం లోని కాలూచక్ సైనిక శీబిరంపై దాడి చేసి 34 మందిని చంపి, యాభై మందిని గాయపరిచారు. ఈ ఉగ్రవాద సంఘటనతో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం పెరిగిపోయింది. [29]
మే 15న, ప్రధాని వాజ్‌పేయి భారత పార్లమెంటులో "మనం ప్రతీకారం తీర్చుకోవాలి" అని ప్రకటించాడు. [30] అమెరికా డిప్యూటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, రిచర్డ్ ఆర్మిటేజ్, ఈ సంఘటనను, పరిస్థితిని మరింత దిగజార్చే ట్రిగ్గరుగా పేర్కొన్నాడు.
దౌత్యపరమైన ఒత్తిడి కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతును ఆపగలదని భారత క్యాబినెట్‌కు నమ్మకం లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పాకిస్థాన్ విఫలమైందని భారత్ ఆరోపించింది. [31] జనవరి 12న ముషారఫ్ చేసిన ప్రసంగాన్ని భారతదేశం, బలహీనమైనదిగా, ద్వేషపూరితంగా పరిగణించింది. భారతదేశం డిమాండ్ చేసిన ఉగ్రవాద నాయకులను పాకిస్తాన్ అప్పగించలేదు. లష్కర్ కొత్త పేరుతో స్వచ్ఛంద సంస్థగా పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతి సంపాదించింది. వసంతకాలంలో, జిహాదీ తీవ్రవాదులు మళ్లీ నియంత్రణ రేఖను దాటడం ప్రారంభించారు. [32]
జూన్ ఘటనలు
మార్చుప్రణాళిక
మార్చుభారత సన్నద్ధత గురించి మే 18న, రక్షణ మంత్రి ఫెర్నాండెజ్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్మ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ లతో ప్రధాని వాజపేయి సమీక్షించాడు. CCS సమావేశమై పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై సైనిక చర్య తీసుకోవడానికే మొగ్గుచూపింది. నియంత్రణ రేఖపై పాకిస్తాన్ తన బలగాలను పటిష్టం చేసినందున జనవరిలో తలపెట్టిన విధంగా ప్రణాళికాబద్ధమైన పరిమిత సైనిక చర్య ఇప్పుడు ఆచరణీయం కాదని భావించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు పరిమితమైన ఏ చర్యకైనా సైనిక లాభాలు పరిమితంగానే ఉంటాయి. భారత సైన్యం ఇండో-పాక్ సరిహద్దు పొడుగునా దాడి చేసేందుకే మొగ్గుచూపింది, దీనివలన పాక్ సైన్యం మోహరింపు పలుచబడి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత్ ప్రవేశించడం తేలికౌతుంది. [33]
తదనుగుణంగా భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ యుద్ధ సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశాయి. జూన్‌లో ప్లాన్ చేసిన యుద్ధ కాన్వాస్ జనవరిలో ప్లాన్ చేసిన దానికంటే పెద్దది. ముజఫరాబాద్ నుండి లాహోర్ వరకు విస్తరించిన పాకిస్తాన్ ఆర్మీ రిజర్వ్ నార్త్ (ARN)ని పోరాటంలో నిమగ్నం చేయడానికి 1 స్ట్రైక్ కార్ప్స్ ఆఫ్ ఇండియాతో పాటు భారత వైమానిక దళం షకర్‌ఘర్ ప్రాంతంపై దాడిని ప్రారంభిస్తుంది. ఇది కీలకమైన పాకిస్తాన్ స్ట్రైక్ కార్ప్‌ను నిమగ్నం చేస్తుంది. ఈలోగా తూర్పు కమాండ్ నుండి భారత స్ట్రైక్ ఫార్మేషన్‌లు నియంత్రణ రేఖ వద్ద దాడిని నిర్వహిస్తాయి. చొరబాట్లకు ఉగ్రవాదులు ఉపయోగించే వ్యూహాత్మక స్థానాలను స్వాధీనం చేసుకుంటాయి. ఈ సైనిక చర్యకు పరిగణించిన కాలం మే 23 - జూన్ 10 మధ్య. [34]
సైనిక ఘర్షణలు
మార్చుమే 2002 చివరిలో, భారత, పాకిస్తానీ సాయుధ బలగాలను పూర్తిగా సమీకరించడం కొనసాగింది. భారతీయ పత్రికలలో ప్రచురించబడిన ప్రకటనలు, సేకరించిన గూఢచార సమాచారాల ధోరణి చూస్తే భారతదేశం దండయాత్ర చేసే సమయం ఆసన్నమైందని అనిపించింది. జూన్ నెలలో రక్షణ సామాగ్రి కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్‌కు పంపిన సందేశం, గూఢ సమాచారాన్ని ధృవీకరించింది.
మే 18న పాకిస్థాన్ హైకమిషనర్‌ను భారత్ బహిష్కరించింది. అదే రోజు, జమ్మూలో పాకిస్తాన్ ఫిరంగి కాల్పులకు వేలాది మంది గ్రామస్థులు పారిపోవాల్సి వచ్చింది. [35] మే 21న జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పాకిస్తానీ సైనికులు, 1 భారత సైనికుడు, ఇరువైపులా పౌరులూ మరణించారు. మే 22న, భారత ప్రధాని వాజ్‌పేయి "నిర్ణయాత్మక యుద్ధానికి" సిద్ధం కావాలని తన సైనికులకు ప్రకటించాడు. [36]
మే 25, 28 మధ్య పాకిస్తాన్ 3 క్షిపణి పరీక్షలను నిర్వహించింది. భారత్ ఎదురుదాడి చేసే తన అణ్వాయుధ సామర్థ్యాన్ని సమీక్షించింది. జూన్ 7న భారత వైమానిక దళం లాహోర్ సమీపంలో మానవ రహిత వైమానిక వాహనాన్ని కోల్పోయింది, దీనిని తామే కూల్చామని పాకిస్తాన్ చెప్పుకుంది. [37]
అణుయుద్ధ ముప్పు
మార్చుభారతదేశం, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధాలు కలిగి ఉన్నందున, సాంప్రదాయిక యుద్ధం అణుయుద్ధంగా మారే అవకాశం ప్రతిష్టంభన సమయంలో చాలాసార్లు తలెత్తింది. సంఘర్షణ సమయంలో ఈ విషయంపై భారత, పాకిస్తాన్ అధికారులు వివిధ ప్రకటనలు చేశారు. ప్రధానంగా నో ఫస్ట్ యూజ్ పాలసీకి సంబంధించినది. భారతదేశం మొదట అణ్వాయుధాలను ఉపయోగించదని జూన్ 5న భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ చెప్పాడు. [38] అయితే అణ్వాయుధాలను ఉపయోగించే హక్కును తాము వదులుకోమని ముషారఫ్ జూన్ 5న చెప్పాడు. భూగోళంపై 2002 జూన్ 6 న జరిగిన గ్రహశకలం పేలుడు, (దీన్నే తూర్పు మధ్యధరా ఘటన అని పిలుస్తారు) గనక భారతదేశం పాకిస్తాన్‌లపై పేలి ఉన్నట్లయితే అది అణు వివాదానికి కారణమయ్యే అవకాశం ఉండేది. [39]
దౌత్యం
మార్చుబుష్, బ్లెయిర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్‌లతో సహా వివిధ దేశాల నాయకులను వాజ్‌పేయి సంప్రదించాడు. ముషారఫ్ తన జనవరి 12 నాటి ప్రసంగంలో చెప్పిన అంశాలను అమలు చేయలేకపోయాడని, భారతదేశ సహనం నశిస్తున్నదనీ అతను వారికి తెలియజేశాడు. ఆ తర్వాత జరిగిన దౌత్యంలో, బుష్, పుతిన్, బ్లెయిర్, జపాన్ ప్రధాని జునిచిరో కొయిజుమీ తీవ్ర చర్యలకు పాల్పడవద్దని వాజ్‌పేయిని అభ్యర్థించారు. సరిహద్దు చొరబాట్లను అరికట్టేందుకు ముషారఫ్ తన వైఖరిని స్పష్టం చేసేందుకు ఆయనతో చర్చలు జరుపుతామని ప్రపంచ సమాజం భారత్‌కు తెలియజేసింది. [40]
పరిస్థితిని చల్లబరచేందుకు వాళ్ళు ప్రయత్నాలు కొనసాగించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాడు గానీ అది ఫలించలేదు. [41]
సాంప్రదాయిక ఆయుధ సంపత్తిలో భారత సాయుధ బలగాలతో పోలిస్తే తన అసమానతను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలను ఉపయోగిస్తుందనే భయాలు ఉన్నందున ప్రపంచ సమాజం సంయమనం దాన్ని పాటించాలని కోరింది. ఏప్రిల్‌లో, జర్మన్ మ్యాగజైన్ డెర్ స్పీగెల్ ముషారఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌పై అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే సూచించాడు. పాకిస్తాన్ అణు బెదిరింపుల కారణంగా మే చివరి వారంలో అమెరికా విదేశాంగ మంత్రి పావెల్, ముషారఫ్‌ను ఐదు సార్లు సంప్రదించాడు. [42]
2002 జూన్ 5 న, అమెరికన్ డిప్యూటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ ఆర్మిటేజ్ పాకిస్తాన్ సందర్శించాడు. సీమాంతర చొరబాట్లను "శాశ్వతంగా" అంతం చేస్తారా, ఉగ్రవాదానికి ఉపయోగించే మౌలిక సదుపాయాలను కూల్చివేయడంలో సహాయం చేస్తారా అని అతను ముషారఫ్‌ను అడిగాడు. అతను తిరిగి వచ్చాక, 2002 జూన్ 6 న ముషారఫ్ నిబద్ధత గురించి పావెల్‌కు, భారతదేశానికీ తెలియజేసాడు. 2002 జూన్ 10 న పావెల్, ముషారఫ్ వాగ్దానాన్ని గ్లోబల్ కమ్యూనిటీకి ప్రకటించాడు. ఆ తర్వాత భారతదేశం తన దాడి ప్రణాళికలను విరమించుకుంది. [43]
పూర్తి స్థాయి దండయాత్ర అంటే యుద్ధం లోకి దిగడమే. ముషారఫ్‌కు మరో అవకాశం ఇవ్వడం మంచిదని రాజకీయ తర్కం సూచించింది. భారతదేశం జనవరి, జూన్‌లలో సరిహద్దులో సైన్యాన్ని సమీకరించడంతో అంతర్జాతీయ సమాజం, పాకిస్తాన్ లను చర్య తీసుకోవాల్సిన స్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది. [44]
జూలై-ఆగస్టు దాడులు
మార్చుకార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత మొదటిసారిగా 2002 జూలై 29 న, మచిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖకు భారతదేశం వైపున ఉన్న లూండా పోస్ట్ వద్ద పాకిస్తాన్ బలగాల స్థానాలపై వైమానిక దాడి చేసింది. ఎనిమిది IAF మిరాజ్ 2000 H విమానాలు పాకిస్తాన్ ఆక్రమించిన నాలుగు బంకర్లను ధ్వంసం చేయడానికి 1,000-పౌండ్ల బరువున్న బాంబులను జారవిడిచాయి. మునుపటి సంవత్సరాలలో భారత సైనికులు నిర్మీచ్మిన ఫార్వర్డ్ ట్రెంచ్‌లను కూడా పాక్ దళాలు ఆక్రమించాయి. వాటిని కొట్టడానికి 155-మిల్లీమీటర్ల బోఫోర్స్ హోవిట్జర్‌లనుభారత్ ఉపయోగించింది. భారత మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారుల ప్రకారం, ఈ పోరాటంలో కనీసం 28 మంది పాక్ సైనికులు మరణించారు. కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా సంఘర్షణను తీవ్రతరం చేయడానికి భారతదేశం సుముఖంగా ఉన్నట్లు ప్రదర్శించడానికి భారత్ ఈ పగటిపూట వైమానిక దాడి చేసింది. [45]
నియంత్రణ రేఖకు దగ్గర్లోని కుప్వారా సెక్టార్ లోని కెల్ ప్రాంతంలోని పోస్టుకు సమీపంలో ఉన్న పాకిస్తానీ సైనిక దళాలు నియంత్రణ రేఖ వెంబడి భారత స్థావరాలపై కాల్పులు జరుపుతున్నాయి. కార్గిల్ తరహాలోనే సరిహద్దు పోస్ట్‌కు సమీపంలో బలగాల సమీకరించారేమోనని భారత్ అనుమానించింది. భారత సైన్యం పాక్ పోస్టులపై దాడి చేసేందుకు సైన్యాన్ని పంపి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. భారత సైన్యం 11 మంది సైనికులను కోల్పోవడంతో, పోస్టును తిరిగి కైవసం చేసుకునేందుకు చేసిన తొలి భూదాడి విఫలమైంది. [46] [47] ఆ తరువాత, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సుందరరాజన్ పద్మనాభన్‌తో చర్చల తరువాత, ప్రణాళికను సవరించారు. కేవలం భూదాడి కాకుండా, మొదట IAF జెట్‌లను ఉపయోగించి పాకిస్తాన్ స్థానాలపై దాడి చేయాలని నిర్ణయించారు. తర్వాత భారత ప్రత్యేక దళాలు భూదాడి చేయాలని తలపెట్టారు. ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు, లేజర్-గైడెడ్ ఆయుధాలతో కూడిన మిరాజ్ 2000 H యుద్ధ విమానం కెల్‌లో ఉన్న పాకిస్తాన్ బంకర్లపై బాంబు దాడి చేసింది. ఈ దాడిలో బంకర్లను ధ్వంసం చేసి, తెలియని సంఖ్యలో జననష్టం కలగజేసింది. [48] [49]
ఒత్తిడిని తగ్గించడం
మార్చుతరువాతి కొన్ని నెలల పాటు ఉద్రిక్తతలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, రెండు ప్రభుత్వాలు కాశ్మీర్‌లో పరిస్థితిని సడలించడం ప్రారంభించాయి. 2002 అక్టోబరు నాటికి, భారతదేశం సరిహద్దు వెంబడి తమ సైన్యాన్ని ఉపసంహరించడం మొదలుపెట్టింది. ఆ తరువాత పాకిస్తాన్ కూడా అదే పని చేసింది. 2003 నవంబరులో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. [50]
జననష్టం
మార్చుభారతీయ జననష్టం 1,874 వరకు ఉంది. ఇందులో 798 మరణాలున్నాయి. [3] పాకిస్థానీ మృతుల వివరాలు వెల్లడి కాలేదు.
ప్రతిష్ఠంభన ఖర్చు
మార్చుసైనిక సమీకరణ కోసం భారతదేశం $ 3 బిలియన్ నుండి $ 4 బిలియన్ల వరకూ ఖర్చుపెట్టగా [51] పాకిస్తాన్ $ 1.4 బిలియన్లు వెచ్చించింది. [52] పాకిస్థాన్ మీడియా అంచనాల ప్రకారం, ఈ ప్రతిష్టంభన కారణంగా మొత్తం 1,55,000 మంది భారతీయులు, 45,000 మంది పాకిస్థానీలు నిరాశ్రయులయ్యారు. [8]
భారత సైనిక సమీకరణ నెమ్మదిగా జరిగింది. 500,000 మంది సైనికులు, 3 సాయుధ విభాగాలు, ఇతర సహాయక విభాగాలను సరిహద్దుకు పూర్తిగా తరలించడానికి భారతదేశానికి దాదాపు మూడు వారాలు పట్టింది. ఈ సమయంలో పాకిస్తాన్ 3,00,000 మంది సైనికులతో పాటు సహాయక యూనిట్లను సరిహద్దుకు తరలించేసింది. వ్యూహాత్మక ఆశ్చర్యమేమీ కలగలేదు. [53]
2011 నవంబరు 5 న భారత నావికాదళ మాజీ చీఫ్, అడ్మిరల్ సుశీల్ కుమార్, ఆపరేషన్ పరాక్రమ్‌కు స్పష్టమైన లక్ష్యాలు లేవని చెప్పాడు. ఈ ఆపరేషన్‌ను భారత్ చేసిన పొరపాటుకు శిక్షగా అతను అభివర్ణించాడు. అంతేకాకుండా ఆపరేషన్ పరాక్రం సరిహద్దు ఉల్లంఘనలు పెంచేందుకు పాకిస్తాన్, చైనాలను ప్రోత్సహించి ఉండవచ్చని ఆయన అన్నాడు. ఒకవేళ భారత్ చైనాపై ఇలాంటి ఆపరేషన్‌కు ప్రయత్నించి ఉంటే, అది భారత్‌కు ఘోరమైన తప్పిదంగా ఉండేది. [54] [55]
ఇవి కూడా చూడండి
మార్చు- ఇండో-పాకిస్తాన్ యుద్ధాలు, వివాదాలు
- 2002 తూర్పు మధ్యధరా సంఘటన
- భారత్-పాకిస్థాన్ సంబంధాలు
- కాలుచక్ సంఘటన
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Kashmir Crisis Archived 11 జూలై 2006 at the Wayback Machine GlobalSecurity.org
- ↑ "Op Parakram claimed 798 soldiers". The Times of India. 31 July 2003. Archived from the original on 22 October 2012. Retrieved 20 March 2012.
- ↑ 3.0 3.1 India suffered 1,874 casualties without fighting a war Archived 19 ఏప్రిల్ 2013 at the Wayback Machine, THE TIMES OF INDIA.
- ↑ "Calculating the costs of India-Pakistan standoff".
- ↑ Bhaskar, C. Uday (2016-09-20). "No Nation Must Stumble Into War: Lessons from Op Parakram Post Uri". TheQuint (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2020. Retrieved 2021-11-15.
- ↑ "India's national interests must not be subsumed by politically-motivated, competitive machismo masquerading as patriotism". The Indian Express (in ఇంగ్లీష్). 2019-03-04. Retrieved 2021-11-16.
- ↑ Singh, Satnam Jit; Puangsuan, Yeshua Moser (2015-03-19). "It's time for India to join the Mine Ban Treaty". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 20 April 2019. Retrieved 2021-11-16.
- ↑ 8.0 8.1 "The cost of conflict-II Beyond the direct cost of war". The News International. Archived from the original on 30 December 2016. Retrieved 30 December 2016.
- ↑ 9.0 9.1 "The brink of war". BBC News. Archived from the original on 17 February 2002. Retrieved 2021-11-16.
- ↑ Jamal Afridi (9 July 2009). "Kashmir Militant Extremists". Council Foreign Relations. Archived from the original on 2 March 2012. Retrieved 4 February 2012.
Pakistan denies any ongoing collaboration between the ISI and militants, stressing a change of course after 11 September 2001.
- ↑ "Attack on Indian parliament heightens danger of Indo-Pakistan war". Wsws.org. 20 December 2001. Archived from the original on 15 December 2011. Retrieved 31 January 2012.
- ↑ "India to withdraw troops from Pak border" Archived 30 నవంబరు 2003 at the Wayback Machine, The Times of India, 16 October 2002.
- ↑ 13.0 13.1 13.2 Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ Singh, Amarinder (2001). A Ridge Too Far: War in the Kargil Heights 1999. Motibagh Palace. p. 132. ISBN 9788193107416.
- ↑ 15.0 15.1 Gen Ashok K. Mehta, Point 5353 still in Pakistan’s possession Archived 2016-04-09 at the Wayback Machine, The Tribune (Chandigarh), 13 June 2004
- ↑ "Musharraf vows to stop terror activity in Pakistan". USA Today. 22 June 2002.
- ↑ "ఆర్కైవ్ నకలు". 6 February 2004. Archived from the original on 3 డిసెంబరు 2008. Retrieved 13 మార్చి 2022.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ Pakistan, India 'move missiles' to border Archived 6 జనవరి 2007 at the Wayback Machine CNN, 26 December 2001.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ Swami, Praveen (9 March 2004). "War and peace on Gurkha Post". The Hindu. Retrieved 25 September 2017.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "The Stand-off" Archived 18 జూలై 2008 at the Wayback Machine, The New Yorker, 13 February 2006.
- ↑ "The Stand-off" Archived 18 జూలై 2008 at the Wayback Machine, The New Yorker, 13 February 2006.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "The Stand-off" Archived 18 జూలై 2008 at the Wayback Machine, The New Yorker, 13 February 2006.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "India expels Pakistan's ambassador". CBC News. 18 May 2002. Retrieved 26 January 2020.
- ↑ "Indian PM calls for 'decisive battle' over Kashmir" Archived 4 ఫిబ్రవరి 2017 at the Wayback Machine, The Guardian, Wednesday 22 May 2002. Retrieved 7 February 2013.
- ↑ "IAF's Searcher-II Loss on June 07, 2002". Vayu-sena-aux.tripod.com. Archived from the original on 23 January 2009. Retrieved 1 March 2012.
- ↑ "India will not use nuclear weapons first: Singh". BNET. 3 June 2002. Archived from the original on 5 December 2008. Retrieved 20 March 2012.
- ↑ "Near-Earth Objects Pose Threat, General Says". Spacedaily.com. Archived from the original on 1 December 2002. Retrieved 1 March 2012.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Putin Attempts to Mediate India-Pakistan Tensions" Archived 10 నవంబరు 2013 at the Wayback Machine, VOA, 3 June 2002.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ When Pakistan took Loonda Post Frontline Volume 19 – Issue 18, 31 August – 13 September 2002
- ↑ "Details of major clash in Kashmir were kept secret by India and Pakistan". Retrieved 26 Aug 2002.
- ↑ "The Kargil-II Incident".
- ↑ "Twice in 2002, India was on the verge of striking against Pakistan. Here's why it didn't". Cover Story. 23 December 2002. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ "EXCLUSIVE: In 2002, India's Fighter Jets Hit Pakistan In A Surgical Strike You've Never Been Told About". HuffPost. 27 January 2017. Retrieved 9 September 2018.
- ↑ "India-Pakistan Ceasefire Agreement" Archived 11 జనవరి 2013 at the Wayback Machine, NDTV.
- ↑ "What did India's military mobilisation after Parliament attack achieve?". The Week (in ఇంగ్లీష్). Retrieved 2022-01-05.
- ↑ Aditi Phadnis (16 January 2003). "Parakram cost put at Rs 6,500 crore". Rediff.com India Limited. Archived from the original on 3 February 2003. Retrieved 20 March 2012.
- ↑ Gady, Franz-Stefan (29 January 2019). "Is the Indian Military Capable of Executing the Cold Start Doctrine?". The Diplomat.
- ↑ "Operation Parakram after Parliament attack lacked cleared objectives: Ex navy chief Sushil Kumar". The Times of India. 6 November 2011.
- ↑ "Op Parakram most punishing mistake: Ex-Navy chief". The Indian Express. 5 November 2011.