2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట

2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట ఆగష్టు 3, 2008 న భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలొ జరిగినది. ఈ తొక్కిసలాటలో 146 మంది ప్రజలు మరణించారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయ రహదారి మృత్యు మార్గమైంది. భక్తి మార్గంలో ప్రయాణిస్తూ అసువులు బాసిన పురుషులు మరికొందరు కాగా, అభంశుభం తెలియని మరో 36 మంది చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాటలో.. పద ఘట్టనలతో వారి శరీరాలు నలిగిపోయాయి. భక్తుల దుస్తులు బురద కొట్టుకుని మసకబారిపోయాయి.

2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట
సమయం15:00 (భారత ప్రామాణిక సమయం)
ప్రదేశంబిలాస్‌పూర్ జిల్లా, హిమాచల ప్రదేశ్
 భారతదేశం
146 మరణాలు
150 క్షయగాత్రులు
తొక్కిసలాట, తోపులాట మరణాలు, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావడం
The Naina Devi guard rail was much like this one.

తొక్కిసలాటసవరించు

నైనాదేవి ఆలయంలో శ్రావణ నవరాత్రులు ప్రారంభ మయ్యాయి.[1] శ్రావణ తొలి ఆదివారం కావడంతో అశేష భక్తులు నయనా దేవి దర్శనానికి తరలి వచ్చారు. ఈ నవరాత్రులు వచ్చే 11వ తేదీతో ముగుస్తాయి. నయినా దేవిని దర్శించడానికి దాదాపు పాతిక వేల మంది భక్తులు తరలి వచ్చారు. ఇంతలో కొండ చెరియలు విరిగి పడుతున్నాయని ఎవరో ఒక అగంతుకుడు కేక వేశాడు. ఇది వదంతా? వాస్తవమా? నిర్ధారించుకునే లోపే కళ్లముందు పెను ఘోరం జరిగిపోయింది. జనం అటూ ఇటూ పరుగులు తీశారు. కిందికి దిగుతున్నవాళ్లు, పైకి ఎక్కుతున్న వాళ్ల మధ్య తొక్కిసలాట మొదలైంది. లేని ప్రమాదం నుంచి బయట పడేందుకు ఎవరికి వారు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో రెయిలింగ్‌ విరిగిపోయింది. తొక్కిసలాట మరింత ఎక్కువైంది. కింద పడిన వారు మళ్లీ పైకి లేవలేకపోయారు.[2][1][3] కేవలం 20 నిమిషాల్లో 146 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. 36 మంది చిన్న పిల్లలు. 38 మంది మహిళలు ఉన్నారు.[4] మరో 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన భక్తులే ఉన్నారు. [5]

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేం కుమార్ ధుమాల్ మృతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు, క్షతగాత్రులకు 50000 రుపాయలను పరిహారాన్ని అందించారు. [6]

తొహానా కు చెందిన 13 యేండ్ల గౌరవ్ సింగ్ సైనీ 50 నుండి 60 మంది ప్రజలను తొక్కిసలాట నుండి రక్షించినందులకు గానూ నేషనల్ బ్రేవరీ అవార్డు 2009లో వచ్చింది.[7]


మూలాలుసవరించు

  1. 1.0 1.1 "'Scores killed' in India stampede". BBC News Online. 2008-08-03. మూలం నుండి 4 ఆగస్టు 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-03. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite news requires |newspaper= (help)
  2. Megha Mann; Jai Kumar (3 August 2008). "146 die in Naina Devi stampede". Anandpur Sahib / Bilaspur: The Tribune (India). Retrieved 6 July 2014. Cite web requires |website= (help)
  3. Patil, Gangadhar (15 October 2013). [http:// www.dnaindia.com/india/report-madhya-pradesh-temple-stampede-27-of-29-stampedes-in-country-in-last-five-years-at-religious-places-1904000 "Madhya Pradesh temple stampede: 27 of 29 stampedes in country in last five years at religious places"] Check |url= value (help). dnaIndia.com. New Delhi, India: Diligent Media Corporation. Retrieved 6 July 2014.
  4. Page, Jeremy (2008-08-04). ece "More than 100 die in Indian temple stampede" Check |url= value (help). London: Times Online. Retrieved 2008-08-03. Cite news requires |newspaper= (help)
  5. 'నయనాదేవి' ఆలయంలో మృత్యుఘోష
  6. Sahib, Anandpur. stampede-at-naina-devi-mandir-125-feared-killed/1603/news/himvani/ "Stampede at Naina Devi Mandir, 125 feared killed" Check |url= value (help). Himvani. మూలం నుండి 2011-07-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-03. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
  7. "21 children to get National Bravery Awards for 2009". Press Trust of India (PTI). Jan 18, 2010. మూలం నుండి 20 January 2010 న [http:// web.archive.org/web/20100120050426/http:// www.ptinews.com/news/474070_21-children-to-get-National-Bravery-Awards-for-2009 ఆర్కైవు చేసారు] Check |archiveurl= value (help). Retrieved 20 January 2010. Cite uses deprecated parameter |deadurl= (help); Cite news requires |newspaper= (help)

ఇతర లింకులుసవరించు