2021 లో ఆంధ్రప్రదేశ్

2021 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు.

జనవరి మార్చు

జనవరి 25: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరిపే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనరుకూ మధ్య తలెత్తిన వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. ఎన్నికలు జరపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనరు తలపెట్టిన ఎన్నికలు సజావుగా జరిగేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆతనికి సహకరిస్తానని ప్రకటించింది.[1]

ఫిబ్రవరి మార్చు

ఫిబ్రవరి 28:తెల్లవారుఝామున 4:54 నిమిషాలకు ఇస్రో, నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోట నుండి పి.ఎస్.ఎల్.వి సి-51 ఉపగ్రహవాహక నౌకను విజయవంతంగా అంతరిక్షం లోకి పంపించింది.[2]

నవంబరు మార్చు

నవంబరు 1: అమరావతి ఉద్యమకారులు న్యాస్థానం నుండి దేవస్థానానికి మహా పాదయాత్రను మొదలుపెట్టారు. 45 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్ర అమరావతి లోని తుళ్ళూరులో నవంబరు 1 న మొదలై తిరుపతిలో వెంకటేశ్వరస్వామి దర్శనంతో ముగుసింది. డిసెంబరు 18 న తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించారు.

మూలాలు మార్చు

  1. "Clipping of Andhra Jyothy Telugu Daily - Andhra Pradesh". epaper.andhrajyothy.com. Archived from the original on 2021-01-29. Retrieved 2021-01-29.
  2. "PSLV-C51, the first dedicated launch by NSIL, successfully launches Amazonia-1 and 18 Co-passenger satellites from Sriharikota - ISRO". www.isro.gov.in. Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.