భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితా

(హైకోర్టు నుండి దారిమార్పు చెందింది)

హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానం అనగా భారతదేశంలోని రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతీ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ఒక్కో హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆరవ భాగం, ఐదవ అధ్యాయం, 214 వ నిబంధనను అనుసరించి ఏర్పాటయ్యాయి.

తెలంగాణ హైకోర్టు, హైదరాబాదు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి

మొత్తం భారతదేశంలో 25 హైకోర్టు‌లు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టు‌లో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ల సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసులపై అయినా న్యాయ విచారణ కోసం హైకోర్ట్‌ను సంప్రదించవచ్చు. కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు న్యూఢిల్లీకు మాత్రమే ఉంది.

హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:

 • భారత దేశ పౌరుడై ఉండాలి.
 • కనీసం 10 సంవత్సరాలు పాటు దిగువ కోర్టులో న్యాయమూర్తిగా కానీ, హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగానో, న్యాయ శాస్త్రవేత్తగానో కానీ పనిచేసి ఉండాలి.

హైకోర్టులు

మార్చు

భారతదేశంలో గల 25 హైకోర్టుల జాబితా.

న్యాయస్థానము పేరు స్థాపించిన సంవత్సరం ఏ చట్టం ద్వారా స్థాపించారు పరిధి పీఠము న్యాయపీఠములు (బెంచీలు)
అలహాబాదు హైకోర్టు[1] 1866 జూన్ 11 హైకోర్టుల చట్టం 1861 ఉత్తర ప్రదేశ్ అలహాబాదు లక్నో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అమరావతి  
తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తెలంగాణ హైదరాబాద్  
బాంబే హైకోర్టు 1862 ఆగస్టు 14 హైకోర్టుల చట్టం 1861 మహారాష్ట్ర, గోవా, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూ ముంబై నాగపూర్, పనాజీ, ఔరంగాబాదు
కలకత్తా హైకోర్టు 1862 జూలై 2 హైకోర్టుల చట్టం 1861 పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ ద్వీపాలు కోల్కతా పోర్ట్ బ్లెయిర్ (సర్క్యూట్ బెంచీ)
ఛతీస్ గఢ్ హైకోర్టు 2000 జనవరి 11 మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ఛత్తీస్ గఢ్ బిలాస్ పూర్  
ఢిల్లీ హైకోర్టు[2] 1966 అక్టోబరు 31 ఢిల్లీ హైకోర్టు ఆక్టు, 1966 జాతీయ రాజధాని పరిధి ఢిల్లీ న్యూఢిల్లీ  
గౌహతి హైకోర్టు[3] 1948 మార్చి 1 భారతప్రభుత్వ చట్టం 1935 అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, మిజోరం గౌహతి కోహిమా, ఐజాల్లలో సర్క్యూట్ బెంచీ గలదు.
త్రిపుర హైకోర్టు 2013 మార్చి 26 ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012 త్రిపుర అగర్తలా
మణిపూర్ హైకోర్టు 2013 మార్చి 26 ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012 మణిపూర్ ఇంఫాల్
మేఘాలయ హైకోర్టు 2013 మార్చి 26 ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012 మేఘాలయ షిల్లాంగ్  
గుజరాత్ హైకోర్టు 1960 మే 1 బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం 1960 గుజరాత్ అహ్మదాబాదు  
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 1971 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం 1970 హిమాచల్ ప్రదేశ్ సిమ్లా  
జమ్మూ , కాశ్మీరు హైకోర్టు 1943 ఆగస్టు 28 కాశ్మీరు మహారాజు జారీచేసిన పేటెంటు లేఖ జమ్మూ కాశ్మీరు శ్రీనగర్ & జమ్మూ[4]  
జార్ఖండ్ హైకోర్టు 2000 బీహారు పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 జార్ఖండ్ రాంచీ  
కర్నాటక హైకోర్టు[5] 1884 మైసూరు హైకోర్టు చట్టం , 1884 కర్నాటక బెంగళూరు  
కేరళ హైకోర్టు[6] 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956. కేరళ, లక్షద్వీప్ కొచ్చి  
మధ్యప్రదేశ్ హైకోర్టు[7] 1936 జనవరి 02 భారత ప్రభుత్వ చట్టం 1935 మధ్యప్రదేశ్ జబల్ పూర్ గ్వాలియర్, ఇండోర్
మద్రాసు హైకోర్టు 1862 ఆగస్టు 15 హైకోర్టు ఆక్ట, 1861 తమిళనాడు, పాండిచ్చేరి చెన్నై మదురై
ఒడిషా హైకోర్టు 1948 ఏప్రిల్ 03 ఒడిషా హైకోర్టు ఆజ్ఞ 1948 ఒడిషా కటక్  
పాట్నా హైకోర్టు 1916 సెప్టెంబరు 02 ' 1915 బీహారు పాట్నా  
పంజాబ్ , హర్యానా హైకోర్టు[8] 1947 నవంబరు 08 హైకోర్టు (పంజాబ్) ఆజ్ఞ 1947 పంజాబ్, హర్యానా, చండీగఢ్ చండీగఢ్  
రాజస్థాన్ హైకోర్టు 1949 జూన్ 21 రాజస్థాన్ హైకోర్టు ఆర్డినెన్స్, 1949 రాజస్థాన్ జోధ్ పూర్ జైపూరు
సిక్కిం హైకోర్టు 1975 38వ సవరణ భారత రాజ్యాంగం సిక్కిం గాంగ్ టక్  
ఉత్తరాంచల్ హైకోర్టు 2000 యూ.పీ. రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 ఉత్తరాంచల్ నైనీటాల్  

అత్యధిక న్యాయమూర్తులు అహ్మదాబాద్ హైకోర్టుకు ఉన్నారు.

హైకోర్టులు ఉన్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు

మార్చు
రాష్ట్రం లేదా కే.పా.ప్రా. కోర్టు నగరం
అండమాన్ నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు కోల్కతా
అరుణాచల్ ప్రదేశ్ గౌహతి హైకోర్టు గౌహతి
ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి
అస్సాం గౌహతి హైకోర్టు గౌహతి
బీహారు పాట్నా హైకోర్టు పాట్నా
ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు బిలాస్ పూర్
చండీగఢ్ పంజాబ్ , హర్యానా హైకోర్టు చండీగఢ్
దాద్రా నగర్ హవేలీ బాంబే హైకోర్టు ముంబై
డామన్ , డయ్యు బాంబే హైకోర్టు ముంబై
జాతీయ రాజధాని ప్రాంతం న్యూఢిల్లీ ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ
గోవా బాంబే హైకోర్టు ముంబై
గుజరాత్ గుజరాత్ హైకోర్టు అహ్మదాబాదు
హర్యానా పంజాబ్ , హర్యానా హైకోర్టు చండీగఢ్
హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సిమ్లా
జమ్మూ కాశ్మీరు జమ్మూ , కాశ్మీరు హైకోర్టు శ్రీనగర్/జమ్మూ
జార్ఖండ్ జార్ఖండ్ హైకోర్టు రాంచీ
కర్నాటక కర్నాటక హైకోర్టు బెంగళూరు
కేరళ కేరళ హైకోర్టు కోచి
లక్షద్వీప్ కేరళ హైకోర్టు కోచి
మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్
మహారాష్ట్ర బాంబే హైకోర్టు ముంబై
మణిపూర్

ఇంఫాల్

ఇంఫాల్
మేఘాలయ గౌహతి హైకోర్టు గౌహతి
మిజోరం గౌహతి హైకోర్టు గౌహతి
నాగాలాండ్ గౌహతి హైకోర్టు గౌహతి
ఒడిషా ఒడిషా హైకోర్టు కటక్
పాండిచ్చేరి మద్రాసు హైకోర్టు చెన్నై
పంజాబ్ పంజాబ్ , హర్యానా హైకోర్టు చండీగఢ్
రాజస్థాన్ రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్
సిక్కిం సిక్కిం హైకోర్టు గాంగ్ టక్
తమిళనాడు మద్రాసు హైకోర్టు చెన్నై
త్రిపుర గౌహతి హైకోర్టు గౌహతి
ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ హైకోర్టు నైనితాల్
ఉత్తర ప్రదేశ్ అలహాబాదు హైకోర్టు అలహాబాదు
పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు కోల్‌కతా

మూలాలు

మార్చు
 1. ప్రారంభంగా ఆగ్రా లో స్థాపించారు. 1875 లో అలహాబాదుకు మార్చారు.
 2. లాహోర్ హైకోర్టు 1919 మార్చి 21 లో స్థాపించారు. పరిధి, అవిభాజ్య పంజాబ్ , ఢిల్లీ. 1947 ఆగస్టు 11 లో ఒక ప్రత్యేక హైకోర్టు ఆఫ్ పంజాబ్ స్థాపించబడినది, భారతీయ స్వాతంత్ర్య ఆక్టు 1947, ప్రకారం సిమ్లా లో ఒక సీటును ఏర్పాటు చేశారు. 1966 లో పంజాబ్ గుర్తింపబడిన తరువాత, పంజాబ్ హర్యానాల కొరకు ఒక హైకోర్టును స్థాపించారు. ఢిల్లీ హైకోర్టు, 1966 అక్టోబరు 31 లో, సిమ్లాలో ఒక సీటుతో స్థాపించారు.
 3. దీన్ని అస్సాం, నాగాల్యాండ్‌ల కొరకు స్థాపించారు. "ఈశాన్యభారత పునర్వ్యవస్థీకరణ చట్టం 1971" ప్రకారం 1971 లో దీనికి గౌహతి హైకోర్టు అని పేరు పెట్టారు.
 4. వేసవిలో రాజధాని శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ.
 5. మూలంగా దీనిని మైసూరు హైకోర్టు అనేవారు, తరువాత కర్నాటక హైకోర్టు అని పేరు 1973.
 6. ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టు, ఎర్నాకుళంలో 1949 లో జూలై 7 న ఉద్ఘాటన చేశారు. కేరళ్ రాష్ట్రం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పడింది. ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టును అబాలిష్ చేసి కేరళ హైకోర్టును సృష్టించింది. దీని పరిధి, లక్షద్వీప్ వరకు గలదు.
 7. భారత ప్రభుత్వ చట్టం , 1935, లెటర్ పేటెంట్ ద్వారా 2-1-1936 న ఒక హైకోర్టు నాగపూర్ నందు స్థాపించబదింది. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జబల్ పూర్ కు మార్చబడింది, 1956.
 8. మూలంగా పంజాబ్ హైకోర్టు, తరువాత పంజాబ్ & హర్యానా హైకోర్టు గా మారింది, 1966

ఇతర ఆధార గ్రంథాలు

మార్చు
 • Jurisdiction and Seats of Indian High Courts, Eastern Book Company, retrieved 2 September 2005
 • Judge strength in High Courts increased, Press Information Bureau – Govt. of India, retrieved 2 September 2005
 • Judiciary, Supreme Court of India, archived from the original on 29 ఆగస్టు 2005, retrieved 2 September 2005
 • Constitution of India, Wikisource, retrieved 31 December 2005