2023 ఒడిశా రైలు ప్రమాదం
ఈ వ్యాసం, వర్తమాన ఘటనను వివరిస్తుంది. సమయం గడిచే కొద్దీ సమాచారం వేగంగా మారిపోయే అవకాశం ఉంది. |
2023 ఒడిశా రైలు ప్రమాదం అనేది ఒడిషా రాష్ట్రంలో సంభవించిన పెను ప్రమాదం. ఈ మృత్యు ఘోషకు మూడు రైళ్లు కారణం అయ్యాయి.
ఒడిశా రైలు ప్రమాదం | |
---|---|
వివరాలు | |
తేదీ | 2 జూన్ 2023 |
స్థానం | బాలాసోర్, ఒడిషా, భారతదేశం |
గణాంకాలు | |
రైళ్ళు | 3, * షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12841), * యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ (12864), * గూడ్స్ రైలు |
మరణాలు | 288 |
గాయపడినవారు | 1175 |
2023 జూన్ 2న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్‌పై పడిన ఈ రైలు బోగీలను యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా[1] బహనాగ రైల్వే స్టేషన్[2] సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం కాగా 275 మంది మృతి చెందారు.[3][4] రాత్రి 7 గంటల సమయంలో ఈ వరుస ప్రమాదాలు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.[5] ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు) హుటాహుటిన రంగంలోకి దిగింది.[6]
హెల్ప్ డెస్క్
మార్చుఘటనాస్థలిలో 250 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. గాయపడిన వారిని బాలాసోర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీనికిసంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లు: 044-2535 4771, 67822 62286.
చెన్నై రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసారు. హౌరా హెల్ప్‌లైన్ నంబర్ 033-26382217, ఖరగ్‌పూర్ హెల్ప్‌లైన్ నంబర్ 8972073925, 9332392339, బాలాసోర్ హెల్ప్‌లైన్ నంబర్ 8249591559, 7978418322, షాలిమర్ హెల్ప్‌లైన్ నంబర్ 9903370746.[7]
దక్షిణ మధ్య.రైల్వే పరిధిలో సహాయ కేంద్రాల వివరాలు: సికింద్రాబాద్ రైల్ నిలయం 040 27788516, విజయవాడ రైల్వే స్టేషన్ 0866 2576924, రాజమండ్రి రైల్వే స్టేషన్ 0883 2420541, రేణిగుంట రైల్వే స్టేషన్ 9949198414, తిరుపతి రైల్వే స్టేషన్ 7815915571, నెల్లూరు రైల్వే స్టేషన్ 08612342028.
రైళ్ల మళ్ళింపు, రద్దు
మార్చుఒడిశాలో రైలు ప్రమాదం కారణంగా 22807, 22873, 18409, 22817, 15929 నంబరుగల రైళ్లను దారి మళ్లించారు, కాగా 12837, 12863,12839, 12895, 20831, 02837 మొదలైన రైళ్లు రద్దయ్యాయి.[8]
దుర్ఘటన అవలోకనం
మార్చురెండు ప్యాసింజర్ రైళ్లు సహా మూడు రైళ్లు.. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12841), యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ (12864), గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ప్రాథమిక సమాచారం మేరకు స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహానగా బజార్ స్టేషన్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. మరో ట్రాక్ మీద పడి ఉన్న ఈ బోగీలను ఢీకొని యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి.[9]
పరిహారం
మార్చుఈ ప్రమాదంలో మృతులకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిహారం ప్రకటించాడు.[10]
దర్యాప్తు
మార్చుదర్యాప్తునకు హైలెవల్ కమిటీని నియమించారు. విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రాథమిక నివేదిక
మార్చుసిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. మెయిన్ లైన్ పై వెళ్లేందుకే కోరమాండల్ కు సిగ్నల్ ఇచ్చారని, కానీ, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పొరపాటున లూప్ లైన్ లోకి వెళ్లిందని పేర్కొంది. దీంతో లూప్ లైన్ లో ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఢీకొట్టగా, బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు వచ్చిందని, దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని వివరించింది.[11]
సంతాప దినాలు
మార్చుభారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదం చోటుచేసుకున్నందున ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవడంతో పాటు మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2023 జూన్ 3న సంతాప దినంగా పాటిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఒక రోజు సంతాప దినంగా పాటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించాడు.[12]
పలువురి దిగ్భ్రాంతి
మార్చు- రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
- ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
- ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు.[13]
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ - వెన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, యూఎస్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సాబా కోరోసి.. తదితరులు సంఘీభావం ప్రకటించారు. అలాగే ఈ ఘోర ప్రమాదం నుంచి ఉపశమనం కోసం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని ఆయా దేశాలు ప్రకటించాయి.
ట్రాక్‌ల పునరుద్ధరణ
మార్చుకేవలం 51 గంటల్లోనే ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ట్రాక్‌ల పునరుద్ధరణ పూర్తయ్యింది. ఒడిశా- పశ్చిమబెంగాల్ రూట్‌లో యధావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.[14]
మూలాలు
మార్చు- ↑ "Coromandel Express derailment | At least 50 dead, 350 injured in in Odisha's Balasore district". The Hindu (in Indian English). 2023-06-02. ISSN 0971-751X. Retrieved 2023-06-02.
- ↑ "Coromandel Express derails in Odisha's Balasore; 50 dead & 350 injured". Deccan Herald (in ఇంగ్లీష్). 2023-06-02. Retrieved 2023-06-02.
- ↑ "Train Accident: పట్టాలపై మరణమృదంగం.. ఒడిశాలో మూడు రైళ్ల ఢీ |". web.archive.org. 2023-06-03. Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "కోరమాండల్ ఇంజిన్‌ను కిందికి దించిన సిబ్బంది | odisha train accident". web.archive.org. 2023-06-04. Archived from the original on 2023-06-04. Retrieved 2023-06-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Train accident: ఘోరం.. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. సుమారు 50మంది మృతి | coromandel express collided with a goods train". web.archive.org. 2023-06-02. Archived from the original on 2023-06-02. Retrieved 2023-06-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275: ఒడిశా సీఎస్ | Odisha Train Accident The Number Of Railway Deaths Was Not 288 But 275 bvn". web.archive.org. 2023-06-05. Archived from the original on 2023-06-05. Retrieved 2023-06-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Coromandel Express Accident Live Updates: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన తాజా అప్‌డేట్స్.. | Odisha train accident Almost 50 Passengers dead 179 injured after Coromandel Express derails ssr". web.archive.org. 2023-06-02. Archived from the original on 2023-06-02. Retrieved 2023-06-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు.. | odisha train derailment several trains cancelled diverted checklist". web.archive.org. 2023-06-03. Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Coromandel express accident live: Coromandel, Bengaluru-Howrah Express trains derail, hit goods train; over 300 injured, several dead". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-06-02.
- ↑ "Odisha train accident LIVE: Railway minister announces ₹10 lakh ex gratia for kin of deceased". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-06-02. Retrieved 2023-06-02.
- ↑ "Odisha Train Tragedy: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారడం వల్లే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక | coromandel express went on wrong track minutes before accident say officials". web.archive.org. 2023-06-03. Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు.. | odisha 3 train accident tamil nadu odisha govts one day mourning mk stallin naveen patnaik yvr". web.archive.org. 2023-06-03. Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "India train crash: More than 280 dead after Odisha incident". BBC. 3 June 2023.
- ↑ "Odisha Train Accident Track Restoration Works Completed Within 51 Hours, Details Inside - Sakshi". web.archive.org. 2023-06-05. Archived from the original on 2023-06-05. Retrieved 2023-06-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)