అశ్విని వైష్ణవ్
అశ్విని వైష్ణవ్ (జననం 1970 జూలై 18) ఒక భారతీయ రాజకీయవేత్త, మాజీ ఐ ఏ ఎస్ అధికారి, ప్రస్తుతం 39వ రైల్వే మంత్రిగా, 55వ కమ్యూనికేషన్స్ మంత్రిగా, 2021 నుండి భారత ప్రభుత్వంలో 2వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నారు. 2019 నుండి ఒడిశాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు . అంతకుముందు 1994లో, వైష్ణవ్ ఒడిశా కేడర్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐ ఏ ఎస్ ) లో చేరారు, ఒడిశాలో పనిచేశారు.[2]
అశ్విని వైష్ణవ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | పీయూష్ గోయెల్ | ||
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | రవి శంకర్ ప్రసాద్ | ||
కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | రవి శంకర్ ప్రసాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జోధ్పూర్, రాజస్థాన్ | 1970 జూలై 18||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సునీతా వైష్ణవ్[1] | ||
సంతానం | 2 | ||
వృత్తి | సమారంభకుడు ఐఏఎస్ అధికారి |
ప్రారంభ జీవితం , విద్య
మార్చువైష్ణవ్ అసలు రాజస్థాన్ పాలి జిల్లా జీవంద్ కల్లాన్ గ్రామ నివాసి . తరువాత, అతని కుటుంబం రాజస్థాన్లోని జోధ్పూర్లో స్థిరపడింది.
వైష్ణవ్ తన పాఠశాల విద్యను జోధ్ పూర్లోని సెయింట్ ఆంథోనీస్ కాన్వెంట్ స్కూల్లో, జోధ్పూరని మహేష్ స్కూల్లో చదివాడు. వైష్ణవ్ 1991లో ఎంబిఎమ్ ఇంజనీరింగ్ కళాశాల (జె ఎన్ వి యూ ) జోధ్పూర్ నుండి ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కోర్సులో బంగారు పతకంతో పట్టభద్రుడయ్యాడు .ఆ తర్వాత తన ఎం.టెక్ పూర్తి చేశాడు. ఐఐటీ కాన్పూర్ నుండి, 1994 లో ఆల్ ఇండియా ర్యాంక్ 27 తో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేరడానికి ముందు 2008లో వైష్ణవ్ పెన్సి లవెనియ విశ్వవిద్యాలయంలోని వార్తాన్ స్కూల్ నుండి ఎంబీఏ చేయడానికి యూఎస్ఏ వెళ్లాడు.
ప్రజా సేవకుడి గా ...
మార్చుసివిల్ సర్వీసులో
మార్చు1994 వైష్ణవ్ ఒడిశా కేడర్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేరారు. బాలసోర్, కటక్ జిల్లాల కలెక్టర్ గా పనిచేయడంతో సహా ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పనిచేశారు సూపర్ సైక్లోన్ 1999లో ఒడిశా ప్రభుత్వం.. ఒడిస్సా ప్రజల కోసం భద్రత విషయంలో తీసుకున్న డేటాను సేకరించడం ద్వారా తుఫాన్ యొక్క వాస్తవ సమయం, ప్రదేశానికి సంబంధించి డేటాను సేకరించగలిగాడు.
మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి కార్యాలయంలో సెక్రెటరీగా నియమితులైన వైష్ణవ్ 2003 వరకు పనిచేశాడు. పీఎంఓలో కొద్దికాలం పనిచేసిన తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడంలో కీలకపాత్ర వహించాడు. 2004లో బిజెపి నేతలు ఎన్డీఏ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైష్ణవవ్ వాజ్ పేయి యొక్క ప్రైవేట్ సెక్రటరీగా నియమితుడయ్యాడు. 2006లో మోర్ ముంగావ్ పోర్ట్ టెస్ట్ కు డిప్యూటీ చైర్మన్ గా నియమితులయ్యారు అక్కడ రెండు సంవత్సరాలు పనిచేశాడు.
వ్యాపారం , ఎంటర్ప్యునర్ షిప్
మార్చుఅశ్విని వైష్ణవ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేయడానికి విద్య రుణం తీసుకున్నాడు. అది తిరిగి చెల్లించడానికి తనకు నెలల సమయం పట్టిందని గ్రహించి చివరికి 2010లో ప్రైవేటు రంగాల్లో చేరడానికి పరిశ్రమలు తెరవడానికి సివిల్ సర్వీసులను విడిచిపెట్టాడు.
విజయవంతమైన వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో లోతైన అంశాలను పరిజ్ఞానాన్ని పొందడానికి ఆయన ఎంబీఏ డిగ్రీ చేసాడు. ఎంబీఏ తర్వాత వైష్ణవవ్ భారతదేశం తిరిగి వచ్చి జిఈ ట్రాన్స్పోర్టేషన్లో మేనేజింగ్ డైరెక్టర్ గా చేరాడు తదనంతరం ఆయన సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేరాడు లోకోమోటీస్ హెడ్ అర్బన్ ఇన్ స్ట్రక్చర్ గా విధులు నిర్వహించాడు. 2012లో గుజరాత్ లో త్రీ టీ ఆటో లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, వీచి ఆటో కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు ఆటోమేటిక్ విడిభాగాల తయారీ యూనిట్లను స్థాపించాడు.
రాజకీయ జీవితం
మార్చువైష్ణవ్ ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు ఒడిశాలో సభ్యుల సహకారంతో ఆయన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచారు. వైష్ణవ్ సబార్డినేట్ లెజిస్లేషన్ అండ్ పిటిషన్ అండ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2019లో భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక మందగమనం చక్రియ స్వభావాన్ని కలిగి ఉందని అది నిర్మాణాత్మకమైన మందగమనం కాదని మార్చి 20 20 నాటికి అది అట్టడుగునా పడిపోయే అవకాశం ఉందని ఆ తర్వాత అది పటిష్ఠమైన వృద్ది సాధిస్తుందినీ వైష్ణవి పార్లమెంట్లో వాదించారు.
డబ్బును వినియోగంలో పెట్టడం కంటే పెట్టుబడిలో పెట్టడమే దేశాన్ని నిర్మించే మార్గమని వైష్ణవి గట్టిగా నమ్ముతాడు . వైష్ణవి 2019 డిసెంబరు 5న రాజ్యసభలో పన్నుల చట్టాల సవరణ బిల్లు 2019కి మద్దతుగా నిలిచారు . పన్ను నిర్మాణానికి తగ్గించడం లేదా హేతుబద్ధీకరించడం అనేది భారతీయ పరిశ్రమ యొక్క పోటీ తత్వాన్ని పెంచుతుందని, భారతీయ పరిశ్రమ యొక్క మూలధన స్థావరాన్ని కూడా అభివృద్ధి చేస్తుందని అయన విశ్వసించాడు . పన్నుల నిర్మాణం యొక్క నిర్దిష్ట హేతుబద్ధీకరణ కార్పొరేట్లకు డి లేవరేజ్ కి సహాయ పడుతుందని, నిలుపుకున్న ఆదాయాలు నిల్వలు, మిగులు పెంచుతుందని ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక అభివృద్ధికి పునాది వేస్తుందని వాదించారు. వీటితో పాటు రాజ్యసభలో షిప్ రీసైక్లింగ్ బిల్లు నుండి మహిళల రక్షణ వరకు సమస్యలపై కూడా ఆయన మాట్లాడారు.
క్యాబినెట్ మంత్రి
2012 జూలైలో 22వ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అతనికి రైల్వే మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు కేంద్ర టెలికం మంత్రిగా వైష్ణవ మే 23లో భారతదేశంలో సంచార సాతి పోర్టల్ ను ప్రారంభించాడు.
మూలాలు
మార్చు- ↑ "Shri Ashwini Vaishnaw | National Portal of India". www.india.gov.in. Retrieved 8 July 2021.
- ↑ "Statewise Retirement". 164.100.47.5. Retrieved 2019-06-28.