37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

2006 చలన చిత్రోత్సవం

37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2006 నవంబరు 23 నుండి డిసెంబరు 3 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2][3] ఆస్ట్రేలియా దర్శకుడు రోల్ఫ్ డి హీర్ నేతృత్వంలోని జ్యూరీలో ఫ్రెంచ్ దర్శకుడు ఆలివర్ అస్సాస్, పోలిష్ నటి గ్రెయానా స్జాపోనోవ్ స్కా, అర్జెంటీనా నటి లెటిసియా బ్రెడిస్, భారతదేశానికి చెందిన జాహ్ను బారువా మొదలైనవారు ఉన్నారు.[4]

37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented onడిపెంబరు 3 2006
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ది ఓల్డ్ బార్బర్" (లే వియక్స్ బార్బియర్)

ఈ సంవత్సరంలో టెక్నికల్ రెట్రోస్పెక్టివ్ స్థాపించబడి, డిజిటల్ ఎడిటింగ్‌లోని అంశాలను 'కట్టింగ్ ఎడ్జ్'తోపాటు ఎడిటర్ స్టీవెన్ కోహెన్ చేత ప్రదర్శించబడింది. ఇటలీకి చెందిన సాంకేతిక నిపుణులు ఫిల్మ్ రిస్టోరేషన్, డిజిటల్ యానిమేషన్ గురించిన ప్రత్యేక ప్రదర్శనలు చేశారు.[4]

ఈ చిత్రోత్సవంలో నదిరా (నటి), నౌషాద్ (సంగీత దర్శకుడు), ఒడువిల్ ఉన్నికృష్ణన్ (మలయాళ నటుడు), భానుమతీ రామకృష్ణ (తెలుగు సినిమా నటీమణి, డాన్సర్, దర్శకురాలు, రచయిత్రి), పద్మిని (తెలుగు, తమిళ సినిమా నటి), హృషికేష్ ముఖర్జీ, రాజ్‌కుమార్ (కన్నడ నటుడు), శ్రీవిద్య (తమిళ/మలయాళ నటి), ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, పర్వీన్ బాబీ, మనోజ్ పంజ్ (యువ పంజాబీ చిత్ర దర్శకుడు, రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత) మొదలైన 11 మంది భారతీయ సినీ ముఖ్యులకు నివాళి అర్పించారు.[4]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]

విజేతలు

మార్చు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "హసీ చావోలు" దర్శకత్వం వహించిన "ది ఓల్డ్ బార్బర్" (లే వియక్స్ బార్బియర్) (చైనీస్ చిత్రం)
  • మోస్ట్ ప్రామిసింగ్ ఆసియా దర్శకుడికి సిల్వర్ పీకాక్ అవార్డు: "ఎ షార్ట్ లైఫ్" (దక్షిణ కొరియా చిత్రం) సినిమా దర్శకుడు "యాన్ కుంగ్-లీ"
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్: "అబూ సయీద్" దర్శకత్వం వహించిన "నిరోంటర్" (బంగ్లాదేశ్ చిత్రం).[4]

అధికారిక ఎంపికలు

మార్చు

ప్రత్యేక ప్రదర్శనలు

మార్చు

ప్రారంభ సినిమా

మార్చు
  • పెడ్రో అల్మోడోవర్ దర్శకత్వం వహించిన వోల్వర్ (స్పానిష్ చిత్రం)

ముగింపు సినిమా

మార్చు
  • అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు దర్శకత్వం వహించిన బాబెల్ (అమెరికన్ చిత్రం)[4]

మూలాలు

మార్చు
  1. "The Sunday Tribune - Spectrum". www.tribuneindia.com. Retrieved 2021-06-29.
  2. "Top awards for Asian films". 4 December 2006. Retrieved 2021-06-29 – via www.thehindu.com.
  3. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2016-04-15. Retrieved 2021-06-29.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "IFFI: focus on South India". 26 November 2006. Retrieved 2021-06-29 – via www.thehindu.com.
  5. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  6. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  7. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.

బయటి లింకులు

మార్చు