38వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

2007 చలన చిత్రోత్సవం

38వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2007 నవంబరు 23 నుండి డిసెంబరు 3 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1] ఈ చిత్రోత్సవంలో "కంట్రీ ఫోకస్"గా హంగేరియన్ దేశం ఉంది.[2] ఈ కార్యక్రమానికి సినీ దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.[3][4]

38వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented onడిసెంబరు 3 2007
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ది వాల్"
Lifetime achievement"దిలీప్ కుమార్", "లతా మంగేష్కర్"

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]

విజేతలు

మార్చు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "లిన్ చిహ్ జు" దర్శకత్వం వహించిన "ది వాల్"(తైవానీస్ చిత్రం)
  • లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: "దిలీప్ కుమార్", "లతా మంగేష్కర్"
  • ప్రత్యేక జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఆన్ ది వింగ్స్ ఆఫ్ డ్రీమ్స్" బంగ్లాదేశ్ సినిమా దర్శకుడు "గోలం రబన్నీ బిప్లాబ్"
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: నటుడు: "మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్" మెక్సికన్ సినిమాలో నటించిన జూలియా ఉర్బిని
  • మోస్ట్ ప్రామిసింగ్ ఆసియా దర్శకుడికి సిల్వర్ పీకాక్ అవార్డు: "మీ... మై సెల్ప్" థాయ్ సినిమా దర్శకుడు పోంగ్‌పట్ వచిరాబున్‌జోంగ్"[4]

అధికారిక ఎంపికలు

మార్చు

ప్రత్యేక ప్రదర్శనలు

మార్చు

ప్రారంభ సినిమా

మార్చు
  • "క్రిస్టియన్ ముంగియున్" దర్శకత్వం వహించిన "4 మంత్స్, 3 వీక్స్, 2 డేస్" (రొమేనియన్ సినిమా)[8]

ముగింపు సినిమా

మార్చు
  • "కార్లోస్ సౌరా" దర్శకత్వం వహించిన "ఫాడోస్" (పోర్చుగల్-స్పెయిన్ సినిమా)

మూలాలు

మార్చు
  1. "38TH INTERNATIONAL FILM FESTIVAL OF INDIA". iffi.nic.in. Archived from the original on 2010-11-23. Retrieved 2021-06-29.
  2. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2018-03-21. Retrieved 2021-06-29.
  3. "English Releases".
  4. 4.0 4.1 "Taiwan film wins Golden Peacock". 4 December 2007. Retrieved 2021-06-29 – via www.thehindu.com.
  5. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  6. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  7. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
  8. "38th International Film Festival to begin in Goa". 23 November 2007. Retrieved 2021-06-29 – via The Economic Times.

బయటి లింకులు

మార్చు