పద్మిని (నటి)
పద్మిని ప్రముఖ సినిమా నటి, నర్తకి. ఈమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె, ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారు.
పద్మిని | |
---|---|
![]() | |
జననం | తిరువనంతపురం, ట్రావన్కోర్, కేరళ | 1932 జూన్ 12
మరణం | 2006 సెప్టెంబరు 25 | (వయసు 74)
వృత్తి | నటి, నృత్యకళాకారిణి |
జీవిత భాగస్వామి | రామచంద్రన్ |
పిల్లలు | ప్రేమానంద |
తల్లిదండ్రులు |
|
విశేషాలుసవరించు
ఈమె 1932, జూన్ 12వ తేదీన జన్మించింది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. తరువాత 30 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది. ఈమె శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించింది[1].
ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును 1961లో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది. 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డ్యాన్స్ స్కూలును ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూలు అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరుపొందింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు.
ఈమె చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2006, సెప్టెంబరు 24 తేదీన గుండెపోటుతో మరణించింది.
తెలుగు సినిమాల జాబితాసవరించు
ఈమె నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:
మూలాలుసవరించు
బయటి లింకులుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పద్మిని పేజీ