40వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
40వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2009 నవంబరు 23 నుండి డిసెంబరు 3 వరకు గోవాలోని పనాజీలో జరిగింది. ఈ కార్యక్రమానికి నటులు వహీదా రెహ్మాన్, మమ్ముట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.[1] ఐదు చిత్రాలతో అస్సామీ సినిమా 75 సంవత్సరాల వేడుక కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అస్సామీ సినీముఖ్యులు జాహును బారువా, జ్ఞానడ కాకోటి, బిద్యారావు, మంజు బోరా తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా, మాలెగావ్ ఇండస్ట్రీ ఆఫ్ రీమేక్స్ వారి రెండు చిత్రాల ప్రదర్శనతో అంతర్జాతీయ వేదికను అందుకుంది.[2]
40వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | డిసెంబరు 3, 2009 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "కెనాట్ లైవ్ వితౌట్ యూ" |
సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసిన ఆశా పరేఖ్, షర్మిలా ఠాగూర్, సౌమిత్రా ఛటర్జీలకు గోల్డెన్ జూబ్లీ రెట్రో విభాగంలో గుర్తింపు లభించింది.[3] బ్రెజిల్ డైరెక్టర్ జోవా బాటిస్టా డి ఆండ్రేడ్ పోటీ జ్యూరీకి నాయకత్వం వహించాడు. కెనిచి ఒకుబు (జపాన్), జీన్-మిచెల్ ఫ్రోడాన్ (ఫ్రాన్స్), సరికా తఖూర్ (భారతదేశం), విక్ సరిన్ (కెనడా) మొదలైనవారు జ్యూరీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.[2]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]
విజేతలు
మార్చు- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "లియోన్ డై" దర్శకత్వం వహించిన "కెనాట్ లైవ్ వితౌట్ యూ" (తైవానీస్ చిత్రం)
- స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "జార్జి ఓవాష్విలి" దర్శకత్వం వహించిన "ది అదర్ బ్యాంక్" (జార్జన్ ఫిల్మ్)
- ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డు: "ఓనీ లెకామ్టే" దర్శకత్వం వహించిన "ఎ బ్రాండ్ న్యూ లైఫ్" (దక్షిణ కొరియా చిత్రం)[2]
అధికారిక ఎంపికలు
మార్చుప్రత్యేక ప్రదర్శనలు
మార్చుప్రారంభ చిత్రం
మార్చు- "హీ పింగ్" (చైనీస్ చిత్రం) "గోధుమ"[2]
ముగింపు చిత్రం
మార్చు- "పెడ్రో అల్మోడావర్" (స్పానిష్ చిత్రం) "బ్రోకెన్ ఎంబ్రేసెస్"[7]
మూలాలు
మార్చు- ↑ "English Releases".
- ↑ 2.0 2.1 2.2 2.3 "English Releases".
- ↑ "Taiwanese film "I Can't Live Without You" wins Golden Peacock at IFFI - NetIndian". netindian.in.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
- ↑ "40th INTERNATIONAL FILM FESTIVAL OF INDIA (IFFI) 2009 - Shadow Play India". www.shadowplayindia.com. Archived from the original on 2021-06-29. Retrieved 2021-06-29.