500, 1000 రూపాయల నోట్ల రద్దు

500, 1000 రూపాయల నోట్లు చెల్లవన్న నిర్ణయం వెలువడ్డ గంటల వ్యవధిలో ఏటీఎం (తాడేపల్లిగూడెం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వద్ద బారులు తీరిన జనం

500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.[1] ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల బ్యాంకు నోట్లను చెల్లనివిగా ప్రకటించి, కొత్త 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి వచ్చినట్టు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారు.[2]

విధానంసవరించు

ధాని ప్రకటన జరిగిన వెంటనే ఆర్.బి.ఐ. గవర్నర్ చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను మార్చుకునే విధానాన్ని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.[3] నవంబరు 8న 500, 1000 రూపాయల నోట్లు చెల్లవన్న అంశంతో పాటుగా మరికొన్ని సంబంధిత నిర్ణయాలను కూడా ప్రకటించారు:

  1. 9, 10 నవంబరు తేదీల్లో దేశ వ్యాప్తంగా అన్ని ఏటీయంలు మూసివుంటాయి.
  2. అన్ని బ్యాంకులు 9 నవంబరు తేదీన మూసివుంటాయి.
  3. ఆపైన డిసెంబరు 31 వరకూ సరైన గుర్తింపు ద్వారా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.
  4. పై గడువు తేది వరకు కూడా ఎవరైనా బ్యాంకులో తమ నోట్లను జమచేయనట్లయితే, 2017 మార్చి 30 వరకు తగిన ఆధారాలతో ఏదేని ఆర్. బి. ఐ బ్యాంకు లలో జమ చేయవచ్చు

రద్దు ద్వారా సమస్యలు, ఇబ్బందులుసవరించు

ప్రయాణాల్లో, హొటల్స్, ఇతర వ్యాపార లావాదేవీల్లో పెద్ద నోట్ల వలన అనేక సమస్యలు ఇబ్బందులు తలెత్తాయి.

సంబంధిత చర్యలుసవరించు

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన ప్రవేశ పెట్టారు. నోట్ల రద్దు ద్వారా చలామణిలోకి తీసుకురాదలిచిన డబ్బుకు అప్పటివరకూ పన్ను చెల్లించనట్టైతే భారీ ఎత్తున పన్ను వేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా వెల్లడి చేసిన డబ్బులో 50 శాతం ప్రభుత్వం పన్నుగా, జరిమానాగా, గరీబ్ కళ్యాణ్ సెస్ రూపంలో తీసుకుంటుంది. మిగతా 50 శాతంలో 25 శాతం వడ్డీలేని డిపాజిట్ గా నాలుగు సంవత్సరాల పాటు పెట్టాలి.[4]

మూలాలుసవరించు

  1. Bhatt, Abhinav (8 November 2016). "Watch PM Modi's Entire Speech On Discontinuing 500, 1000 Rupee Notes". NDTV India. Retrieved 8 November 2016. Cite news requires |newspaper= (help)
  2. PM Narendra Modi: Rs 500, Rs 1000 bank notes not valid from midnight; ATMs won't work tomorrow
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2016-11-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-11-08. Cite web requires |website= (help)
  4. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన. "ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేవై)". ఈనాడు. www.eenadu.net. Retrieved 14 February 2018. Cite news requires |newspaper= (help)